Pic talk: పోలా.. బొమ్మ అద్దిరి పోలా..!!
హైదరాబాద్: నేడు దీపావళి. చెడుపై మంచి సాధించిన విజయానికి ప్రతీకగా ఈ పండగను జరుపుకొంటారు. చీకటిని పారద్రోలుతూ వెలుగులు తెచ్చే పండుగగా, విజయానికి ప్రతీకగా దీపావళి పండుగను జరుపుకోవడం సంప్రదాయంగా వస్తోంది. దేశవ్యాప్తంగా ఈ పండగను ప్రజలు ఉత్సాహంగా జరుపుకొంటోన్నారు.
రెండు తెలుగు రాష్ట్రాల్లో భారీగా బాణాసంచా అమ్మకాలు కొనసాగుతున్నాయి. ఈ సందర్భాన్ని పురస్కరించుకుని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, రెండు తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు కేసీఆర్, వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రజలకు శుభాకాంక్షలు తెలియజేశారు. దీపావళి కాంతులు అందరి జీవితాల్లో వెలుగులు నింపాలని ఆకాంక్షించారు.

టాలీవుడ్‌లో దీపావళి సందడి ఏర్పడింది. సెలెబ్రిటీలందరూ ఈ పండగను ఆనందోత్సాహాలతో జరుపుకొంటోన్నారు. ఫిల్మ్ నగర్‌లో సందడి నెలకొంది. స్టార్ హీరోలు, దర్శకులు, నిర్మాతలు, టెక్నీషియన్ల ఇళ్లన్నింటినీ విద్యుద్దీపాలతో అలంకరించారు. ఫిల్మ్ నగర్ కల్చరల్ సెంటర్‌లో ప్రత్యేక ఈవెంట్లను నిర్వహిస్తోన్నారు.
టాలీవుడ్ టాప్ హీరోలు వెంకటేష్, మహేష్ బాబు, జూనియర్ ఎన్టీఆర్, రామ్ చరణ్.. దీపావళి సెలబ్రేషన్స్‌కు అటెండ్ అయ్యారు. ప్రస్తుతం ఆ నలుగురు కూడా తమ నెక్ట్స్ ప్రాజెక్టుల్లో బిజీగా ఉంటోన్న విషయం తెలిసిందే. దీపావళి కావడంతో అందరూ ఒకేచోటికి చేరి, సెలబ్రేట్ చేసుకున్నారు.

ప్రస్తుతం సైంధవ్లో నటిస్తోన్నారు వెంకటేష్. ఇది వెంకటేష్‌కు 75వ సినిమా. శైలేష్ కొలను దర్శకత్వం వహిస్తోన్నారు. 2024 జనవరి 13వ తేదీన విడుదల కానుంది. మహేష్ బాబు గుంటూరు కారం సినిమా షూటింగ్‌లో ఉంటోన్నారు. త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వం వహిస్తోన్న ఈ సినిమా 2024 జనవరి 12వ తేదీన విడుదల కానుంది.
జూనియర్ ఎన్టీఆర్ చేతిలో బిగ్ ప్రాజెక్ట్ ఉంది. దేవరలో నటిస్తోన్నారాయన. 300 కోట్ల రూపాయలకు పైగా బడ్జెట్‌తో తెరకెక్కుతోందీ మూవీ. కొరటాల శివ దర్శకుడు. జాన్వీ కపూర్ హీరోయిన్. సైఫ్ అలీఖాన్, షైన్ టామ్ చాకో.. కీలక పాత్రల్లో నటిస్తోన్నారు. రామ్ చరణ్.. గేమ్ ఛేంజర్‌లో నటిస్తోన్నారు. శంకర్ దర్శకత్వం వహిస్తోన్న ఈ సినిమాకు దిల్ రాజు నిర్మాత.












Click it and Unblock the Notifications