14 ఏళ్ల క్రితం అలా జరిగినందుకు చాలా ఫీల్ అయ్యా.. చేసింది వాళ్లే ?
ప్రముఖ హీరోయిన్ జెనీలియా గురించి కొత్తగా పరిచయం అక్కర్లేదు. హ హ హాసిని అంటూ బొమ్మరిల్లు సినిమాతో ప్రేక్షకుల హృదయాల్లో చెరగని ముద్ర వేసుకుంది ఈ ముద్దుగుమ్మ. "బాయ్స్" సినిమాతో చిత్ర పరిశ్రమలోకి ఎంట్రీ ఇచ్చిన ఈమె.. సుమత నటించిన సత్యం చిత్రంతో టాలీవుడ్ లోకి అడుగు పెట్టింది. సిద్దార్ధ్ సరసన నటించిన "బొమ్మరిల్లు" బ్లాక్ బస్టర్ హిట్ అవ్వడంతో వరుస అవకాశాలతో దూసుకుపోయింది.
2012 తర్వాత తెలుగులో సినిమాలకు బ్రేకి ఇచ్చిన జెనీలియా.. పెళ్లి తర్వాత నటనకు విరామం చెప్పేశారు. ఇక రీసెంట్ గానే సెకండ్ ఇన్నింగ్స్ షురూ చేసిన ఈమె తన భర్తతో కలిసి మజిలీ మూవీ రీమేక్ లో నటించి సూపర్ హిట్ అందుకుంది. ప్రస్తుతం పలు బాలీవుడ్ చిత్రాల్లో నటిస్తూ బిజీగా ఉంది. ఈ క్రమంలోనే తాజాగా ఓ ఇంటర్వ్యూలో గతంలో హీరో జాన్ అబ్రహాంతో పెళ్లి జరిగిందనే విషయంపై ఓపెన్ అయ్యారు. దీంతో ఈ వ్యవహారం మళ్లీ హాట్ టాపిక్ గా మారింది.

జెనీలియా మాట్లాడుతూ.. ఆ రూమర్స్ ఎవరు క్రియేట్ చేసారో తనకు తెలుసని.. వాటికి వారే సమాధానం చెప్పాలని అన్నారు. అది కేవలం ప్రచారం మాత్రమేనని.. అందులో ఏమాత్రం నిజం లేదని కొట్టిపారేశారు.
2011లో జెనీలియా - జాన్ అబ్రహం హీరో హీరోయిన్లుగా 'ఫోర్స్' అనే సినిమా చేశారు. ఇది గౌతమ్ మీనన్ 'ఘర్షణ' చిత్రానికి రీమేక్. హిందీలో మంచి కమర్షియల్ సక్సెస్ సాధించింది. అయితే ఈ మూవీ షూటింగ్ టైంలో జాన్ - జెనీలియా పెళ్ళి జరిగిందనే వార్తలు అప్పట్లో తెగ చక్కర్లు కొట్టాయి. సెట్ లో వేద మంత్రాల సాక్షిగా రియల్ గా మ్యారేజ్ చేసుకున్నారని జోరుగా ప్రచారం జరిగింది. కానీ ఆ పుకార్లకు చెక్ పెడుతూ.. 2012లో జెనీలియా రితేష్ ని వివాహం చేసుకున్నారు.
ప్రస్తుతం జెన్నీ.. అమీర్ ఖాన్ హీరోగా నటించిన 'సితారే జమీన్ పర్' మూవీలో కీలక పాత్ర పోషించారు. ఈ సినిమా జూన్ 20న విడుదల కానుంది. అలానే 'జూనియర్' అనే చిత్రంతో జెన్నీ టాలీవుడ్ లోకి రీఎంట్రీ ఇవ్వనున్నారు. గాలి జనార్థన్ రెడ్డి తనయుడు కిరీటి హీరోగా పరిచయం అవుతున్న ఈ సినిమాలో శ్రీలీల హీరోయిన్ గా నటిస్తుండగా.. జెనీలియా ముఖ్య పాత్ర పోషిస్తున్నారు.












Click it and Unblock the Notifications