అబ్బాయిలకు పీరియడ్స్ వస్తే అణు యుద్ధాలే జరిగేవి..
అతిలోక సుందరి శ్రీదేవి కుమార్తెగా బాలీవుడ్ లోకి గ్రాండ్ ఎంట్రీ ఇచ్చింది జాన్వీ కపూర్. ఈ సినిమా సూపర్ హిట్ కావడంతో వరుస ఆఫర్లతో ఫుల్ బిజీ అయిపోయింది జాన్వీ. ప్రస్తుతం వరుస సినిమాల్లో నటిస్తూ దూసుకుపోతున్న ఈమె.. తనదైన శైలిలో నటిస్తూ బాలీవుడ్ లో తనకంటూ ఓ ప్రత్యేక స్థానాన్ని ఏర్పరచుకుంది. అంతే కాకుండా దేవర సినిమాతో టాలీవుడ్ లోకి కూడా ఎంట్రీ ఇచ్చిన ఈ ముద్దుగుమ్మ భారీ హిట్ ని తన ఖాతాలో వేసుకుంది.
ఇక సినిమాలతో పాటు సోషల్ మీడియా లోనూ, ఇంటర్వ్యూ లలోనూ యాక్టివ్ గానే ఉంటుంది ఈ భామ. అప్పుడప్పుడు తనదైన శైలిలో సొసైటీలో జరిగే పలు విషయాలపై స్పందిస్తుంది. అయితే ఇప్పుడు ఏకంగా పీరియడ్స్ గురించి నోరు విప్పింది. సున్నితమైన అంశం అయినప్పటికీ.. సభ్య సమాజం ఈ విషయాన్ని చూసే దృష్టి కోణంలో కొంత మార్పు రావాలని కూడా పలువురు కామెంట్స్ చేశారు. ఈ తరహా లోనే స్టార్ హీరోయిన్ అయిన జాన్వీ ఇలా ఓపెన్ గా మాట్లాడడం సర్వత్రా చర్చనీయాంశంగా మారింది.

ఈ మేరకు ఆమె మాట్లాడుతూ.. అమ్మాయిల పీరియడ్స్ బాధను చాలా మంది అర్థం చేసుకోరని అన్నారు. అదేదో చిన్న విషయం అన్నట్టే మాట్లాడుతారని.. పీరియడ్స్ టైమ్ లో మూడ్ స్వింగ్స్ వేరేలా ఉంటాయని చెప్పుకొచ్చారు. అందుకే తాను మాట్లాడే విధానాన్ని బట్టి చాలా మంది.. ఇది నీకు ఆ సమయమా అని అడుగుతారని వ్యాఖ్యానించింది. అంతే కాకుండా అమ్మాయిల పీరియడ్స్ పెయిన్ చాలా బాధగా ఉంటుందని.. దాన్ని కొందరు చులకనగా చూస్తారని ఆగ్రహం వ్యక్తం చేసింది.
ఒకవేళ అబ్బాయిలకు పీరియడ్స్ వస్తే ఆ బాధను తట్టుకోలేరని జాన్వీ అభిప్రాయం వ్యక్తం చేసింది. అప్పుడు మా బాధ ఏంటి అనేది వారికి అర్థం అవుతుందని.. అబ్బాయిలకు పీరియడ్స్ వస్తే కచ్చితంగా అణు యుద్ధాలే జరిగేవని తెలిపింది. దీంతో ఇప్పుడు జాన్వీ కపూర్ చేసిన కామెంట్లు వైరల్ గా మారాయి.
ప్రస్తుతం మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ సరసన 'పెద్ది' సినిమాలో హీరోయిన్ గా నటిస్తోంది. ఉప్పెన ఫేమ్ బుచ్చిబాబు సానా దర్శకత్వంలో ఈ మూవీ తెరకెక్కుతోంది. రీసెంట్ గా రామ్ చరణ్ పుట్టినరోజు సందర్భంగా ఈ మూవీ టైటిల్ ను అనౌన్స్ చేశారు. సినిమా టైటిల్ తో పాటు ఫస్ట్ లుక్ ను కూడా రిలీజ్ చేశారు. ఫుల్ గా జుట్టు, గడ్డంతో చరణ్ రా అండ్ రస్టిక్ లుక్ లో అదరగొట్టారు. జగపతిబాబు, కన్నడ స్టార్ శివ రాజ్‌కుమార్, బాలీవుడ్ నటుడు దివ్యేండు సహా పలువురు నటులు కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ఆస్కార్ అవార్డు గ్రహీత మ్యూజిక్ డైరెక్టర్ ఏఆర్ రెహమాన్ ఈ సినిమాకు సంగీతం అందిస్తున్నారు. రత్నవేలు ఈ సినిమాకు సినిమాటోగ్రాఫర్ గా ఉన్నారు. మైత్రీ మూవీ మేకర్స్, సుకుమార్ రైటింగ్స్ సంస్థలు నిర్మిస్తున్నాయి.
-
అప్పుడు టీవి యాంకర్.. ఇప్పుడు ఏకంగా సినిమాకి రూ.20 కోట్లు !! -
బాలీవుడ్ సూపర్ స్టార్ సరసన సమంత? -
45కి పైగా దేశాల్లో "దురంధర్ 2" నయా రికార్డ్.. పవన్ మూవీ సర్దేసుకోవడమే !! -
కొడుక్కి న్యాయం చేసిన షారూఖ్.. కుతుర్ని గట్టెక్కిస్తారా ?? -
ఉగాది నుంచి కన్యారాశి, సింహరాశి వారి జాతక ఫలం -
విశాఖ టు బెంగళూరు వయా తిరుపతి వందేభారత్ స్లీపర్ రెడీ - రూట్ , ముహూర్తం..!! -
నిర్మలమ్మ వరాలు: మినిమం బ్యాంక్ బ్యాలెన్స్ పై సంచలన నిర్ణయం -
India Post GDS 2nd Merit List 2026: పోస్టల్ జాబ్స్ రెండో మెరిట్ లిస్ట్ అప్పుడే? -
మెగాస్టార్‌కి బహిరంగంగా క్షమాపణలు చెప్పిన సీఎం.. -
ఏపీలో భారీగా మద్యం ధరల తగ్గింపు, ఏ బ్రాండ్ ఎంత..!! -
T20 World Cup: సూర్యకుమార్ యాదవ్ కు ఐసీసీ అనూహ్య షాక్..! -
పెళ్లైన హీరోతో ఎఫైర్ వల్ల సినిమాల్లో బ్యాన్.. ఎవరా డ్రీమ్ గర్ల్ ??












Click it and Unblock the Notifications