Actress Kasthuri: దిగొచ్చిన కస్తూరి.. తన వ్యాఖ్యలు వక్రీకరించారంటూ పోస్ట్..!
సినీ, సీరియల్ నటి కస్తూరి చేసిన వ్యాఖ్యలపై తెలుగు రాష్ట్రాల్లో తీవ్ర వ్యతిరేకత రావడంతో ఆమె తను చేసిన వ్యాఖ్యలపై వివరణ ఇచ్చారు. తెలుగు తన మెట్టినిల్లుగా చెప్పుకొచ్చారు. తలుగు వారంతా తన కుటుంబమని సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. తన వ్యాఖ్యలను తప్పుగా అర్థం చేసుకున్నారని వివరించారు. తనకు తెలుగు చాలా మంది అభిమానులు ఉన్నారని తెలిపారు. తమిళ మీడియా తన వ్యాఖ్యలను వక్రీకరించినట్లు పేర్కొన్నారు. డీఎంకే పార్టీ కావాలనే తన మాట్లాడిన మాటలపై తప్పుడు ప్రచారం చేస్తుందని ఆరోపించారు.
తను తెలుగు వారికి వ్యతిరేకంగా మాట్లాడానంటూ విష ప్రచారం చేస్తూన్నారని మండిపడ్డారు. చెన్నైలోని గురుమూర్తి నగరంలో ఓ కార్యక్రమంలో కస్తూరి పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో మాట్లాడుతూ.. 300 ఏళ్ల క్రితం ఓ రాజు కు చెందిన అంత పురంలోని మహిళలకు సేవే చేసేందుకు తెలుగు వారు వచ్చారని చెప్పారు. తెలుగువారిని బానిసలుగా అభివర్ణించే ప్రయత్నం చేశారు. అప్పుడు వచ్చిన తెలుగు వారంతా ఇప్పుడు తమిళ జాతిగా చెప్పుకుంటున్నారని పేర్కొన్నారు.

కానీ ఎప్పుడో వచ్చిన బ్రహ్మణులను మాత్రం తమిళులు కాదని అనడం సరికాదన్నారు. తమిళనాడులో బ్రాహ్మణులు సనాతన ధర్మ పరిరక్షణ కోసం కలిసికట్టుగా ఉండాలని కోరారు. ప్రస్తుతం కస్తూరి బీజేపీలో పార్టీలో ఉన్నారు. కస్తూరీ గతంలో తమిళంతో పాటు తెలుగు సినిమాల్లో చేశఆరు. భారతీయుడు, అన్నమయ్య వంటి సూపర్ హిట్ చిత్రల్లో హీరోయిన్ గా చేశారు. ప్రస్తుతం ఆమె సీరియల్స్ చేస్తున్నారు. ఆమెకు తమిళంలో కంటే తెలుగులోనే ఎక్కువ అవకాశాలు వస్తున్నాయి. ఇలాంటి సందర్భంలో ఆమె చేసిన వ్యాఖ్యలు వివాదంగా మారాయి.
అందుకే డ్యామేజ్ ను కవర్ చేయడానికి సోషల్ మీడియాలో వివరణ ఇస్తూ పోస్ట్ పెట్టినట్లు తెలుస్తోంది. కాగా కస్తూరి వ్యాఖ్యలు సరైనవి కావని తెలుగు రాష్ట్రాలకు చెందిన పలువురు నాయకులు అన్నారు. తమిళ, తెలుగు వారి మధ్య దూరం పెంచుతున్నారని మండిపడ్డారు.












Click it and Unblock the Notifications