తప్పుడు పని చేసి దొరికిపోయిన తెలుగు హీరోయిన్
కేరళలోని కొచ్చిలో ఒక ఐటీ ఉద్యోగిని కిడ్నాప్ చేసి, దాడి చేసిన కేసులో ప్రముఖ తమిళ నటి లక్ష్మీ మీనన్ సహా నలుగురిపై పోలీసులు కేసు నమోదు చేశారు. బాధితుడి ఫిర్యాదు ఆధారంగా ఎర్నాకులం నార్త్ పోలీసులు ఈ చర్య తీసుకున్నారు.
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం, ఈ సంఘటన ఆదివారం రాత్రి జరిగింది. ఒక రెస్టారెంట్ బార్ వద్ద లక్ష్మీ మీనన్ బృందానికి, బాధితుడి స్నేహితుడికి మధ్య వాగ్వాదం జరిగింది. ఈ గొడవ తర్వాత, నటి లక్ష్మీ మీనన్, ఆమె స్నేహితులు ఐటీ ఉద్యోగిని కారులో వెంబడించి, అడ్డగించారు. అనంతరం అతడిని బలవంతంగా తమ కారులోకి లాగి దాడికి పాల్పడ్డారని ఫిర్యాదులో పేర్కొన్నారు.

ఈ కేసులో ఇప్పటివరకు మిథున్, అనీష్, సోనామోల్ అనే ముగ్గురిని పోలీసులు అరెస్టు చేశారు. అయితే, నటి లక్ష్మీ మీనన్ ప్రస్తుతం పరారీలో ఉన్నారని, ఆమె ఫోన్ స్విచ్ఛాఫ్ చేసి ఉందని పోలీసులు తెలిపారు. ఆమె కోసం గాలింపు చర్యలు ముమ్మరం చేశామని వెల్లడించారు.
లక్ష్మీ మీనన్ తమిళ చిత్రాలైన కుమ్కి, సుందరపాండియన్, జిగర్తాండ, వేదాలం, చంద్రముఖి 2 వంటి చిత్రాలతో మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. విశాల్ నటించిన 'ఇంద్రుడు' చిత్రంతో తెలుగు ప్రేక్షకులకు కూడా దగ్గరయ్యారు. ఒక నటి కిడ్నాప్, దాడి కేసులో ఇరుక్కోవడం ప్రస్తుతం క్రీడా వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది.
-
సవాల్ చేసి మరీ అవార్డు కొట్టాడయ్యా..! -
2007లో సినీ వజ్రోత్సవ వేడుకల్లో చిరంజీవి-మోహన్‌బాబు మాటల యుద్ధం -
ప్రతీ ఇంటికీ రెండు ఫ్రీ గ్యాస్ సిలెండర్లు-ఇరాన్ వార్ వేళ సర్కార్ ఆఫర్..! -
శర్వానంద్ 'బైకర్' ఫస్ట్ రివ్యూ.. దేశంలోనే తొలి ప్రయత్నం.. -
ఇకపై నెలకు రెండు సిలిండర్లే..కొత్త బుకింగ్ రూల్స్ -
తమిళనాడులో సీన్ రివర్స్-తాజా సర్వేలో హోరాహోరీ-ఎడ్జ్ మాత్రం..! -
ధనుస్సు రాశి, మకర రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
మిస్టరీ స్టోరీ, గూస్ బంప్స్ ట్విస్ట్స్.. మామూలు మూవీ కాదు గురూ !! -
ఇంటర్ ఫలితాల డేట్ వచ్చేసింది- ఏపీ, తెలంగాణలో ఇలా..!! -
కుప్పకూలుతున్న బంగారం ధరలు- రాక్ బాటమ్ -
ఏప్రిల్ ఒకటి నుంచి చికెన్ షాపులు బంద్ !! -
తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగులకు బంపరాఫర్.. భారీ డిస్కౌంట్












Click it and Unblock the Notifications