మూవీకి నో చెప్పానని ఆ డైరెక్టర్ అలా చేశారు.. ఫుల్‌గా ఏడ్చేశా - మెగా కోడలు
మెగా కోడలు, నటి లావణ్య త్రిపాఠి సంచలన వ్యాఖ్యలు చేశారు. ఒక ఇంటర్వ్యూలో ఆమె తన కెరీర్ ప్రారంభ దశలో ఎదుర్కొన్న చేదు అనుభవాన్ని పంచుకున్నారు. ఒక ప్రముఖ డైరెక్టర్ తీరు నచ్చకపోవడంతో సినిమాను రిజెక్ట్ చేశానని.. అందుకు తనపైనే తప్పుడు ప్రచారం చేశారని వాపోయింది. పైగా రివర్స్ లో తనను టార్గెట్ చేసి వేధించారని.. కేసు కూడా పెట్టారని వెల్లడించింది. అంతే కాకుండా పత్రికల్లోకూడా తప్పుడు కథనాలు రాయించారని తెలిపింది. ఆ సమయంలో ఏం చేయాలో తెలియాక ఏడ్చేశానని చెప్పుకొచ్చింది. ప్రస్తుతం ఈ బ్యూటీ కామెంట్స్ ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా మారాయి.
ఆమె ఇంకా మాట్లాడుతూ..
కోలీవుడ్ లో ఒక సినిమా చేయాల్సి వచ్చినప్పుడు అక్కడి దర్శకుడి ప్రవర్తన తనకు తీవ్ర అసౌకర్యం కలిగించిందని లావణ్య తెలిపారు వెల్లడించారు. అయితే ఆ సినిమా దర్శకుడి ప్రవర్తన తనకు అస్సలు నచ్చలేదని.. ఏదో తప్పు జరుగుతోందని మనసుకు అనిపించిందని స్పష్టం చేసింది. తన ఆత్మగౌరవాన్ని వదులుకోలేక ఆ సినిమా నుంచి వెంటనే తప్పుకున్నానని క్లారిటీ ఇచ్చారు. ఆ నిర్ణయం తర్వాత పరిస్థితులు మరింత కఠినంగా మారాయని లావణ్య చెప్పారు. తనపై తప్పుడు కేసులు పెట్టడమే కాకుండా మీడియాలో తన వ్యక్తిత్వాన్ని దెబ్బతీసేలా వార్తలు ప్రచారం చేశారని తెలిపారు. ఆ సమయంలో తనకు పెద్దగా మద్దతు ఇచ్చే వారు ఎవరూ లేరని.. తీవ్ర మానసిక ఒత్తిడిని ఎదుర్కొన్నానని ఆమె భావోద్వేగానికి గురయ్యారు. అలాంటి పరిస్థితులను ధైర్యంగా ఎదుర్కొన్నందుకు నెటిజన్లు ఆమెకు సపోర్టుగా కామెంట్స్ చేస్తున్నారు.

లావణ్య సినీ కెరీర్..
ఇక 'అందాల రాక్షసి' సినిమాతో లావణ్య త్రిపాఠి హీరోయిన్‌గా పరిచియమైంది. తన అందం, సహజ నటనతో ప్రత్యేక గుర్తింపు సంపాదించుకుంది. ఆ తర్వాత భలే భలే మగాడివోయ్, సోగ్గాడే చిన్నినాయన, శ్రీరస్తు శుభమస్తు, అర్జున్ సురవరం వంటి చిత్రాలతో ప్రేక్షకుల్లో మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. ఈ క్రమంలోనే మెగా కుటుంబానికి చెందిన నటుడు వరుణ్ తేజ్‌ని 2023లో వివాహం చేసుకున్నారు. వరుణ్ తేజ్, లావణ్య త్రిపాఠి ఇద్దరి కలిసి మిస్టర్, అంతరిక్షం సినిమాల్లో నటించారు. ఆ సమయంలో ఏర్పడిన పరిచయం ప్రేమగా మారగా.. పెద్దల అంగీకారంతో వివాహ బంధం లోకి అడుగుపెట్టారు.
ప్రస్తుతం లావణ్య త్రిపాఠి ప్రధాన పాత్రలో నటించిన చిత్రం "సతీ లీలావతి". ఈ సినిమా మార్చి 6న విడుదల కావాల్సి ఉండగా కొన్ని అనివార్య కారణాల వల్ల వాయిదా పడింది. త్వరలోనే చిత్రబృందం కొత్త విడుదల తేదీని ప్రకటించే అవకాశం ఉందని సినీ వర్గాలు చెబుతున్నాయి. మరోవైపు ఇటీవల సోషల్ మీడియా వేధింపుల విషయంలో కూడా లావణ్య త్రిపాఠి పోలీసులను ఆశ్రయించిన సంగతి తెలిసిందే. 'పర్పుల్ క్రెయాన్ జీరో జీరో' అనే ఇన్‌స్టాగ్రామ్ ఖాతా ద్వారా తనను లక్ష్యంగా చేసుకుని అసభ్యకరమైన పోస్టులు, కామెంట్లు పెడుతున్నారని ఆమె ఫిర్యాదు చేశారు. సంబంధిత ఖాతాదారుడిని గుర్తించి కఠిన చర్యలు తీసుకోవాలని సైబర్ క్రైమ్ పోలీసులను కోరారు.
Actress #LavanyaTripathi says she rejected a Tamil film due to discomfort with the director, after which negative articles about her began appearing in newspapers.
— Milagro Movies (@MilagroMovies) March 14, 2026
pic.twitter.com/wAQQz6nj34
-
శర్వానంద్ 'బైకర్' ఫస్ట్ రివ్యూ.. దేశంలోనే తొలి ప్రయత్నం.. -
తెలుగులో 100 రోజులు ఆడిన సినిమాల్లో ఈ హీరోదే రికార్డు -
ఉస్తాద్ భగత్ సింగ్ కాస్ట్లీ మిస్టేక్.. !! -
సవాల్ చేసి మరీ అవార్డు కొట్టాడయ్యా..! -
ఒకటి కాదు, రెండు కాదు ఏకంగా 17 లిప్ లాక్స్.. ఫస్ట్ మూవీ లోనే ! -
పవన్ "ఉస్తాద్" మూవీకి థియేటర్ మెయింటెనెన్స్ ఖర్చులు కూడా వచ్చేలా లేవా ??? -
దివ్యాంగులకు అండగా "పెద్ది" సినిమా నిర్మాత వెంకట సతీష్ కిలారు..! -
గుండెపై "నాగబాబు" పేరు టాటూగా వేసుకున్న టీడీపీ హార్డ్ కోర్ ఫ్యాన్ !! -
మిస్టరీ స్టోరీ, గూస్ బంప్స్ ట్విస్ట్స్.. మామూలు మూవీ కాదు గురూ !! -
స్టార్ హీరోలున్నా.. కేవలం ఈ విలన్లవల్లే బ్లాక్ బస్టర్ అయిన సినిమాలు -
"నాకు అమ్మా నాన్న లేరు సార్ మీరే నాకు అమ్మా నాన్న.. పాస్ చేయండి సార్" -
తులా రాశి, వృశ్చిక రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం












Click it and Unblock the Notifications