బంపర్ ఆఫర్ కొట్టేసిన ప్రేమలు బ్యూటీ.. 'ఎన్టీఆర్ - నీల్' సినిమాలో ఛాన్స్
మలయాళీ ముద్దుగుమ్మ 'మమిత బైజు' గురించి తెలుగు ప్రేక్షకులకు కొత్తగా పరిచయం అక్కర్లేదు. గత కొంతకాలంగా మలయాళం సినిమాలు తెలుగు బాక్సాఫీస్ వద్ద మంచి విజయాన్ని అందుకుంటున్నాయి. ఈ క్రమంలోనే నసీన్, మమితా కలిసి నటించిన "ప్రేమలు" చిత్రం యూత్ కి బాగా కనెక్ట్ అయ్యి మంచి హిట్ కొట్టింది. దీంతో చేసింది ఒక్క సినిమానే అయిన ఓవర్ నైట్ లో స్టార్ హీరోయిన్ గా మారిపోయింది ఈ భామ. అయితే ఈ హీరోయిన్ గురించి ఇప్పుడు ఓ వార్త సినీ వర్గాల్లో హాట్ టాపిక్ గా మారింది.
యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రస్తుతం ఫుల్ జోష్ లో దూసుకుపోతున్నారు. గత ఏడాది ఎన్టీఆర్ 'దేవర' సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చి భారీ హిట్ తన ఖాతాలో వేసుకున్నారు. ప్రస్తుతం ఎన్టీఆర్ - ప్రశాంత్ నీల్ కాంబినేషన్‌లో సినిమా తెరకెక్కుతుంది. మైత్రి మూవీ మేకర్స్ భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్న ఈ సినిమాను 2026 చివర్లో విడుదల చేసేందుకు ప్లాన్ చేస్తున్నట్టు తెలుస్తోంది. గత ఏడాదిలో సినిమా పూజా కార్యక్రమాలు జరగగా.. గత నెలలోనే సినిమా షూటింగ్ ప్రారంభించారు. రీసెంట్ గానే ఎన్టీఆర్ కూడా ఈ మూవీ షూటింగ్ లో పాల్గొన్నారు. దీంతో ఈ సినిమా కూడా కేజీఎఫ్, సలార్ సినిమాల కంటే కూడా భారీ హిట్ అవుతుందని అంచనా వేస్తున్నారు.

ఇప్పుడు ఈ సినిమాలోనే మమిత ఛాన్స్ కొట్టేసిందని సోషల్ మీడియా కోడై కూస్తుంది. మూవీలో ఓ కీలక పాత్ర కోసం మమితను తీసుకున్నారని టాక్ నడుస్తోంది. దీంతో ప్రశాంత్ నీల్ - తారక్ ప్రాజెక్టులో మమిత నటించడం అంటే పెద్ద ఆఫర్ ఏ అని.. ఆమె ఫ్యాన్స్ తెగ మురిసిపోతున్నారు. అయితే దీని గురించి అధికారికంగా ఎలాంటి అనౌన్స్ మెంట్ రాకపోయినప్పటికీ.. త్వరలోనే రావొచ్చు అని భావిస్తున్నారు. ప్రస్తుతం మమిత దళపతి విజయ్ నటిస్తున్న జన నాయగన్ సినిమాలో నటిస్తోంది. అలానే పలు సినిమాల్లో సైతం నటిస్తూ బిజీగా ఉంది ఈ ముద్దుగుమ్మ.
ఇక ఈ సినిమా కోసమే దాదాపు ఐదు నెలల్లోనే ఎన్టీఆర్ సుమారుగా 18 కేజీల బరువు తగ్గారని అంటున్నారు. రోజుకు మూడు గంటల పాటు వర్కౌట్ చేసి, ఫ్యాట్ ఎంకరేజ్ చేయకుండా హై ప్రోటీన్స్ తో ఎన్టీఆర్ డైట్ ను పాటించారని చెబుతున్నారు. దీంతో ఎన్టీఆర్ బాగా బరువు తగ్గి పోయారని తెలిపారు.












Click it and Unblock the Notifications