ఆ హీరో కారణంగా నా కెరీర్ మొత్తం సర్వ నాశనం..తెలుగు హీరోయిన్ షాకింగ్ కామెంట్స్
సినిమా ఇండస్ట్రీలో అవకాశాలు రావడమే పెద్ద టాస్క్. తర్వాత వచ్చిన అవకాశాలను నిలబెట్టుకోవడం పెద్ద టాస్క్. అన్ని ఉన్నా అల్లుడి నోట్ల శని ఉన్నట్టు. సినిమా పూర్తి అయిన తర్వాత వాళ్లు చేసిన సీన్లు ఉంటాయో లేదో తెలియని పరిస్థితి. ప్రస్తుతం సినిమా ఆర్టిస్టుల పరిస్థితి ఇలానే ఉంది. టాలెంట్ ఉంటే సరిపోదు దానికి అదృష్టం కూడా కలిసి రావాలి.అందానికి అందం , టాలెంట్‌కు టాలెంట్ ఉన్నా చాలామంది నటీనటులకు సరైన అవకాశాలు రావడం లేదు.
తాజాగా ఓ హీరోయిన్ ఓ హీరోతో నటించడం వల్ల తన కెరీర్ మొత్తం నాశనం అయిందని వాపోయింది. ఆ హీరోయిన్ మరెవ్వరో కాదు..మనోచిత్ర. ఈ భామ తెలుగు ప్రేక్షకులకు సుపరిచితమే.మనోచిత్ర 2010లో నందిగి అనే స్క్రీన్ పేరుతో నటనలోకి అడుగుపెట్టింది. ఆమె తన అందం, ప్రతిభతో ప్రేక్షకులను ఆకట్టుకుంటుకుంది.శ్రీకాంత్ హీరోగా నటించిన మల్లిగాడు మ్యారేజ్ బ్యూరో సినిమాతో హీరోయిన్‌గా ఎంట్రీ ఇచ్చింది. తెలుగుతో పాటు, తమిళ,కన్నడ,మలయాళం భాషల్లో సినిమాలు చేసింది.

అయితే తాజాగా ఈ భామ తమిళ స్టార్ హీరో అజిత్ సినిమా వల్ల తన కెరీర్ నాశనం అయిందని చెప్పుకొచ్చింది.అజిత్ హీరోగా నటించిన వీరం సినిమా తన కెరీర్‌ను నాశనం చేసిందని ఆరోపించారు. దర్శకుడు శివ తనను మోసం చేశారని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు.అజిత్ సినిమాలో హీరోయిన్‌గా అవకాశం ఇస్తానని చెప్పి దర్శకుడు మోసం చేశాడని ఆమె తెలిపారు. వీరం సినిమాలో తమన్నా క్యారెక్టర్ చనిపోతుందని, ఆ తర్వాత సినిమాలో నువ్వే హీరోయిన్ అని చెప్పారని, కానీ అక్కడ అలాంటిది జరగ్గపోవడంతో చాలా నిరాశ చెందానని మనోచిత్ర చెప్పుకొచ్చారు.
దర్శకుడు సిరుతై శివ దగ్గర ఈ విషయం చెప్పి ఏడ్చానని, ఏడుస్తున్నప్పుడు కూడా చాలా అందంగా ఉన్నారని చెప్పి తనని ఓదార్చారని, అజిత్ కోసం ఆ సినిమాలో నటించానని, ఆ సినిమా తన సినీ జీవితాన్ని నాశనం చేసిందని ఆమె ఆరోపించారు.సినిమా విడుదలైన తర్వాత తనకు అవకాశాలు రాలేదని మనోచిత్ర తెలిపారు.












Click it and Unblock the Notifications