కొత్త అవతారంలో హాట్ బ్యూటీ.. నెగిటివ్ రోల్ చేయనున్న "మీనాక్షీ చౌదరి"!!
మీనాక్షి చౌదరి.. తెలుగు చిత్ర పరిశ్రమలో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది ఈ హాట్ బ్యూటీ. హర్యానా రాష్ట్రంలోని పంచకులలో 1997 ఫిబ్రవరి 1 నాడు పుట్టింది. ఆమె తండ్రి B.R చౌదరి భారత ఆర్మీ సైన్యంలో కల్నల్ గా పని చేసారు. ఫెమినా మిస్ ఇండియా 2018 పోటీలో హర్యానా రాష్ట్రానికి ప్రాతినిధ్యం వహించి.. ఫెమినా మిస్ ఇండియా గ్రాండ్ ఇంటర్నేషనల్ 2018గా కిరీటాన్ని పొందింది. అలానే మిస్ గ్రాండ్ ఇంటర్నేషనల్ 2018 పోటీల్లో పాల్గొని రన్నరప్‌గా నిలిచింది.
టాలీవుడ్ ఎంట్రీ..
సుశాంత్ హీరోగా 'ఇచట వాహనములు నిలుపరాదు' సినిమాతో టాలీవుడ్‌లో ఎంట్రీ ఇచ్చింది. తక్కువ సమయంలోనే స్టార్ హీరోల సరసన నటిస్తూ మంచి గుర్తింపు తెచ్చుకుంది. రవితేజతో నటించిన ఖిలాడీ సినిమా అంచనాలు అందుకోలేకపోయినా.. అడివి శేష్‌తో చేసిన హిట్ 2 మాత్రం బ్లాక్‌బస్టర్‌గా నిలిచింది. ఆ తర్వాత మహేష్ బాబు సరసన గుంటూరు కారంలో నటించి ప్రేక్షకులను అలరించింది. గతేడాది చివర్లో వచ్చిన లక్కీ భాస్కర్ కూడా విజయవంతం కాగా.. ఈ ఏడాది సంక్రాంతికి మరో హిట్‌ని అందుకుంది. ప్రస్తుతం పలు సినిమాలతో బిజీగా ఉన్న ఈ భామ టాలీవుడ్‌లో ఫుల్ జోష్‌లో కొనసాగుతోంది.

నెగిటివ్ రోల్..
మీనాక్షి చౌదరి బాలీవుడ్ కూడా త్వరలోనే ఎంట్రీ ఇవ్వనుంది. ప్రస్తుతం ఫోర్స్ 3 సినిమాలో మీనాక్షి చౌదరి ఓ ప్రత్యేక పాత్రలో కనిపించనున్నారట. అయితే ఈ సినిమా తర్వాత మరో సినిమాలో కూడా నటించే ఛాన్స్ దక్కించుకుందని టాక్ వినిపిస్తుంది.
అయితే రొటీన్ కి భిన్నంగా.. విలన్ పాత్ర ఆఫర్ వచ్చిందట. ఈ మేరకు ఆమె పాత్ర గురించి చర్చలు జరుగుతున్నాయని గుసగుసలు వినిపిస్తున్నాయి. అయితే మీనాక్షి కనుక ఆ నెగిటివ్ పాత్ర చేస్తే.. ఏ మేరకు మెప్పిస్తుందో చూడాలి.

ప్రస్తుతం మీనాక్షి చౌదరి, నాగచైతన్య సరసన NC-24లో నటిస్తోంది. 'విరూపాక్ష' ఫేమ్ కార్తీక్ దండు దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రం ఒక మిథికల్ యాక్షన్ థ్రిల్లర్. ఇదిలా ఉండగా, మీనాక్షి చౌదరి వ్యక్తిగత జీవితంపై కూడా ఆసక్తికర ప్రచారం జరుగుతోంది. ఆమె అక్కినేని హీరో సుశాంత్‌తో రిలేషన్‌లో ఉన్నారని వార్తలు గుప్పుమంటున్నాయి. ఇద్దరూ కలిసి నటించిన ఇచట వాహనములు నిలుపరాదు సినిమా సమయంలో పరిచయం ప్రేమగా మారిందని టాక్. అయితే ఈ రూమర్లపై ఇప్పటివరకు వీరిద్దరూ స్పందించలేదు.












Click it and Unblock the Notifications