ఏడుసార్లు సూసైడ్ అటెంప్ట్ చేశా - మెగాస్టార్ సోదరి
చిత్ర పరిశ్రమలో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న నటి "మోహిని" . 90వ దశకంలో స్టార్ హీరోయిన్ గా ఓ వెలుగు వెలిగిన ఈమె అసలు పేరు మహాలక్ష్మి శ్రీనివాసన్. తెలుగు, తమిళ భాషల్లో పలువురు స్టార్ హీరోలకు జోడీగా నటించింది. తెలుగు లెజెండ్స్ బాలకృష్ణ, చిరంజీవిలతో పాటు మలయాళం స్టార్‌లు మోహన్‌లాల్, మమ్ముట్టి, బాలీవుడ్‌లో అక్షయ్ కుమార్ లాంటి హీరోలతో నటించింది. వందకు పైగా సినిమాల్లో నటించి అన్ని భాషల్లోనూ ఆమె నటనకు మంచి పేరు వచ్చింది.
తెలుగులో బాలయ్యతో క్లాసిక్ మూవీ 'ఆదిత్య 369'.. మెగాస్టార్ చిరంజీవితో బ్లాక్‌బస్టర్ 'హిట్లర్' చిత్రాలలో కనిపించింది. ఇక మోహిని చివరగా 2008లో 'ఇన్నత్తే చింతా విషయం'.. 2011లో 'కలెక్టర్' వంటి మలయాళం సినిమాల్లో కనిపించింది. అలానే బుల్లితెరపై కూడా 'కాదల్ పగడై', 'రాజ రాజేశ్వరి' వంటి టీవీ సీరియల్స్‌లో కూడా మెప్పించింది.

అయితే డిప్రెషన్‌లో ఉండి ఏడుసార్లు సూసైడ్ అటెంప్ట్ చేసుకున్నానని ఆమె ఇటీవల ఓ ఇంటర్వ్యూలో వెల్లడించింది. తనపై చేతబడి కూడా జరిగిందంటూ ఆమె చెప్పిన విషయాలు విని అందరూ షాక్ అవుతున్నారు.
డిప్రెషన్‌తో 7 సార్లు సూసైడ్ అటెంప్ట్..
కాగా ప్రముఖ ఛానల్ కి ఇచ్చిన ఇంటర్వ్యూలో మోహిని తన జీవితంలోని మరో భయంకరమైన నిజాన్ని చెప్పింది. 1999లో పెళ్లి చేసుకున్న ఈ బ్యూటీ ఇద్దరు పిల్లలకు జన్మనిచ్చింది. పెళ్లి తర్వాత భర్త, పిల్లలతో లైఫ్ హ్యాపీగా సాగిపోతున్నా.. కానీ అకస్మాత్తుగా తీవ్రమైన డిప్రెషన్‌లోకి వెళ్లిపోయానని తెలిపింది. ఎందుకో తెలియని బాధ, బతకడం ఎందుకనే ఆలోచనలు తనను వెంటాడాయని వాపోయింది. అన్నీ ఉన్నా ఎందుకు చనిపోవాలనిపిస్తోందో అర్థం కాక నరకయాతన అనుభవించానని కన్నీటి పర్యంతం అయ్యింది.
అయితే తన మానసిక వేదనకు కారణం తన భర్త భరత్ కజిన్ చేయించిన చేతబడి (బ్లాక్ మ్యాజిక్) అని మోహిని సంచలన ఆరోపణ చేసింది. తన జీవితాన్ని నాశనం చేయడానికి అత్యంత దగ్గరి వాళ్లే ఇలా చేశారని తెలుసుకుని కుంగిపోయానని చెప్పింది. ఆ తర్వాత పరిస్థితుల కారణంగా హిందూ కుటుంబంలో పుట్టిన తాను.. 2006లో క్రైస్తవ మతాన్ని స్వీకరించినట్టు ఓపెన్ అయ్యింది.












Click it and Unblock the Notifications