వేణు స్వామిని వదిలిపెట్టని హీరోయిన్లు

ప్రముఖ జ్యోతిషుడు వేణు స్వామి గురించి తెలియని వారు రెండు తెలుగు రాష్ట్రాల్లో ఉండరంటే అతిశేయోక్తి కాదు. సినీ , రాజకీయ ప్రముఖుల జాతకాల గురించి చెబుతూ బాగా ఫేమస్ అయ్యారాయన. ముఖ్యంగా నాగ చైతన్య, సమంత జంట వీడిపోతారని ముందుగానే చెప్పి సంచలనం స‌ృష్టించారు. వీరితో పాటు పలువురు సెలబ్రిటీల గురించి వేణు స్వామి చెప్పినవి చెప్పినట్టుగా జరగడంతో..సోషల్ మీడియాలో ఆయన పెద్ద సెలబ్రిటీగా మారిపోయారు. అయితే ఆయన ఎన్నికల్లో విషయంలో చెప్పిన జాతకాలు ఫెయిల్ కావడంతో తీవ్ర విమర్శలను మూటగట్టుకున్నారు.

తెలంగాణలో కేసీఆర్, ఏపీలో జగన్‌లు సీఎం అవుతారని చెప్పిన వేణు స్వామి జాతకం తప్పని తేలాయి. దీంతో ఆయనపై నెటిజన్లు ఓ రేంజ్‌లో ఫైర్ అయ్యారు. దీంతో ఇక మీదట తాను ప్రిడిక్షన్ చెప్పనని తేల్చేశారు. ఒకపక్క ఆయన జాతకాలు ఫెయిల్ అవుతున్నాయని తెలిసినిప్పటికి కూడా సెలబ్రిటీలు ఆయన్ను మాత్రం వదలడం లేదు. డింపుల్ హయాతి, రష్మిక, నిధి ఆగర్వాల్ వంటి హీరోయిన్లు వేణు స్వామి చేత జాతక దోష నివారణ పూజలు చేయించుకున్నారంటే ఆయన ప్రభావం ఏ స్థాయిలో ఉందో అర్థం చేసుకోవచ్చు.

Actress Nishvika Performs Pooja With Venu Swamy

తాజాగా కన్నడ ఇండస్ట్రీకి చెందిన కొందరు హీరోయిన్లు వేణు స్వామితో పూజాలు చేయించుకున్నారు. తాజాగా కన్నడ హీరోయిన్ నిశ్విక వేణు స్వామి దగ్గరకు వచ్చి పూజలు చేయించుకున్నారు. నిశ్విక 2018లో హీరోయిన్ గా కన్నడ చిత్ర పరిశ్రమలోకి ఎంట్రీ ఇచ్చింది. 28 ఏళ్ళ నిశ్విక కన్నడలో వరుస చిత్రాలు చేస్తూ క్రేజ్ సొంతం చేసుకుంది. ఈ భామ తాజాగా వేణు స్వామితో పూజాలు చేయించుకుంది. దీనికి సంబంధించిన ఫొటోలు, వీడియోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+