నా భార్య నన్ను వదిలేసింది బాబోయ్..తెలుగు హీరోయిన్‌పై భర్త సంచలన పోస్ట్
ఇటీవల కాలంలో విడాకులు తీసుకునే వారి సంఖ్య ఎక్కువగా ఉంది. అందులోనూ సెలబ్రిటీల గురించి అయితే ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఎప్పుడు ఏ సెలబ్రిటీలు విడాకలు గురించి ప్రకటిస్తారో తెలియని పరిస్థితి. సినిమా షూటింగ్ సమయంలో ప్రేమించి పెళ్లి చేసుకోవడం , ఆ తర్వాత ఒకరినొకరు అర్థం చేసుకోలేక , కలిసి ఉండలేక విడాకుల బాట పడుతున్నారు. చాలామంది సెలబ్రిటీల జీవితాలు ఇలాగే ఉన్నాయి. భాషతో సంబంధం లేకుండా సెలబ్రిటీలు చాలామంది విడాకులు తీసుకుంటున్నారు. తాజాగా విడాకుల తీసుకుంటున్న వారి లిస్ట్‌లో ఓ హీరోయిన్ పేరు తెగ వైరల్ అవుతోంది. ఆ హీరోయిన్ మరెవరో కాదు..పూర్ణ.
'గుంటూరు కారం' సినిమాలో మహేష్ బాబుతో కలిసి స్పెషల్ సాంగ్‌లో ఆడి పాడి ప్రేక్షకులను అలరించిన పూర్ణ.. దుబాయ్ వ్యాపారవేత్త షానిద్ అసిఫ్ అలీని వివాహం చేసుకుని ఒక మగబిడ్డకు జన్మనిచ్చారు. తన కొడుకు కోసం కొన్నాళ్ళు సినిమాలకు దూరంగా ఉన్న పూర్ణ.. ఇటీవల రీఎంట్రీ ఇచ్చి వరుస చిత్రాలతో బిజీ అయ్యారు.

ఈ నేపథ్యంలో, ఆమె భర్త షానిద్ అసిఫ్ అలీ ఇన్‌స్టాగ్రామ్‌లో చేసిన ఒక పోస్ట్ విడాకుల పుకార్లకు దారితీసింది. నా జీవితంలో ఈ 45 రోజులను నేనెప్పటికీ మర్చిపోలేను. ఒంటరితనాన్ని, నిశ్శబ్దాన్ని భరించలేకపోయాను. నీ జ్ఞాపకాలతోనే రాత్రులు గడపాల్సి వచ్చింది. ముఖ్యంగా, మనల్ని ప్రేమించే వారు మనతో ఉండడమే జీవితంలో అంతకంటే గొప్ప వరం. ఈ రోజు నా భార్య నా దగ్గరకు వచ్చేసిందని ఆయన భావోద్వేగంగా రాసుకొచ్చారు. ఈ పోస్ట్ చూసిన అభిమానులు, నెటిజన్లు వీరు విడాకులు తీసుకుంటున్నారేమోనని అనుమానాలు వ్యక్తం చేశారు.
అయితే, ఈ ప్రచారం ఊపందుకున్న వెంటనే షానిద్ మరో పోస్ట్‌తో స్పష్టత ఇచ్చారు. నా భార్య 45 రోజులు నాకు దూరంగా ఉంది. పెళ్లైన తర్వాత ఇన్ని రోజులు ఎప్పుడూ దూరంగా ఉండలేదు. అందుకే అలా పోస్ట్ పెట్టాను. దయచేసి మీరు తప్పుగా అర్థం చేసుకొని లేనిపోనివి రాయవద్దు. దేవుడి దయతో మేమంతా సంతోషంగానే ఉన్నామని ఆయన వివరణ ఇచ్చారు.
ఈ రెండు పోస్టులు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. మొదట షానిద్ చేసిన పోస్ట్ అభిమానులను ఆందోళనకు గురిచేయగా, ఆ తర్వాత ఇచ్చిన క్లారిటీతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. ఈ సంఘటన నటి పూర్ణ, ఆమె భర్త మధ్య ఉన్న అన్యోన్యతను మరోసారి నిరూపించింది.












Click it and Unblock the Notifications