పండంటి మగబిడ్డకు జన్మనిచ్చిన టాలీవుడ్ హీరోయిన్..
టాలీవుడ్ హీరోయిన్ ప్రణీతా సుభాష్ పండంటి మగబిడ్డకు జన్మనిచ్చారు. ఇప్పటికే ఆమెకు ఓ కూతురు ఉండగా, ఇవాళ మరో బిడ్డకు ఆమె తల్లి అయ్యారు. ఈమె తెలుగులో ఏం పిల్లో ఏం పిల్లడో చిత్రంతో తన కెరీర్‌ను ప్రారంభించారు. ఆ తర్వాత బావ, అత్తారింటికి దారేది , హలో గురు ప్రేమ కోసమే, బ్రహ్మోత్సవం, రభస, డైనమైట్, పాండవులు పాండవులు తుమ్మెద వంటి చిత్రాల్లో నటించి అందరినీ మెప్పించారు. తెలుగులో తక్కువ సినిమాలే చేసినా కన్నడలో మాత్రం స్టార్ హీరోయిన్ మంచి గుర్తింపు తెచ్చుకుంది. సినిమాలతో పాటే ఈ అమ్మడు సేవా కార్యక్రమాలతో కూడా మంచి పేరు తెచ్చుకుంది. ఈ నటి కరోనా సమయంలో కర్ణాటకకు చెందిన బిజినెస్‌మ్యాన్ నితిన్ రాజును వివాహం చేసుకుంది.
ఆ తర్వాత పలు చిత్రాల్లో నటించిన ఈ అమ్మడు 2022లో ఓ పాపకు జన్మనిచ్చారు. అనంతరం సినిమాలకు కాస్త దూరంగా ఉన్నారు. పాప పుట్టాక పలు షోలలో జడ్జిగా వ్యవహరించారు. తాను మరోసారి గర్భం దాల్చినట్లు హింట్ ఇచ్చారు. బేబీ బంప్‌తో ఉన్న తన ఫొటోలను ఇటీవలే సోషల్ మీడియాలో కూడా షేర్ చేశారు ప్రణీత.

ఇప్పుడు తాజాగా ఈ బ్యూటీ పండంటి మగబిడ్డకు జన్మనిచ్చారు. నటి ప్రణీత సుభాష్ తన మాతృత్వపు మాధుర్యాన్ని ఆస్వాదిస్తూ ఇటీవలే బేబీ బంప్‌తో ఓ ఫొటో షూట్ కూడా చేశారు. ఆ ఫోటోలను ఆమె సోషల్‌మీడియాలో తన ఖాతాలో కూడా పోస్ట్ చేశారు.












Click it and Unblock the Notifications