Radhika Apte : ముంబై ఎయిర్‌పోర్టులో చిక్కుకుపోయిన నటి రాధికా ఆప్టే..
ముంబై ఎయిర్‌పోర్టులో సినీ నటి రాధికా ఆప్టే ఇరుక్కుపోయారు. ప్రస్తుతం దీనికి సంబంధించి ఫోటోలు కాస్త నెట్టింట్లో వైరల్‌గా మారుతున్నాయి. ముంబై నుంచి భువనేశ్వర్ వెళ్లాల్సిన ఇండిగో విమానం ఛత్రపతి శివాజీ మహారాజ్ ఇంటర్నేషన్‌ల్ ఎయిర్‌పోర్ట్ ఏరోబ్రిడ్జిపై నిలిచిపోయింది. విమానం కోసం గంటల తరబడి ఎదురుచూసిన ప్రయాణికులంతా తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఏరోబ్రిడ్జిపై వెంటిలేషన్ సరిగా లేకపోవడంతో సిబ్బందితో ప్రయాణికులు గొడవకు దిగారు.
ఇక ఈ ఏరోబ్రిడ్జ్‌పై ఇరుక్కుపోయిన ప్రయాణికుల్లో ప్రముఖ సినీ నటి రాధికా ఆప్టే ఉండడం విశేషం. ఈ సంఘటనపై నటి రాధికా సోషలష్‌మీడియాలోని తన ఖాతాలో స్పందించారు. ఈ ఘటనకు సంబంధించి నటి రాధికా ఆప్టే ఇన్‌స్టాగ్రామ్‌లో ఒక వీడియోను కూడా షేర్ చేశారు.

అయితే, ఆ వీడియోలో చాలా మంది ప్రయాణికులు మూసి ఉన్న గాజు తలుపు వెనుక కనిపించడం జరుగుతుంది. ఆమె పోస్ట్‌లో ఇలా రాశారు. "నేను దీన్ని పోస్ట్ చేయాల్సి వచ్చింది! ఈరోజు నా ఫ్లైట్ ఉదయం 8:30కి. ఇప్పుడు 10:50 అయ్యింది కానీ ఇంకా ఫ్లైట్ ఎక్కలేదు. కానీ విమానం ఎక్కుతున్నామని చెప్పి ప్రయాణికులందరినీ ఏరోబ్రిడ్జికి తీసుకెళ్లి తాళం వేశారు అని పేర్కొన్నారు.
గంటల తరబడి నిరీక్షించిన ప్రయాణికులు..
అయితే, ప్రయాణికుల్లో చాలామంది చిన్నారులు, వృద్ధులు కూడా ఉన్నారని, వీరంతా గంటల తరబడి ఇక్కడ ఏరోబ్రిడ్జిలో చిక్కుకుపోయారని ఆమె పేర్కొన్నారు. సెక్యూరిటీ సిబ్బంది తలుపులు తెరవలేదని, విమానం రాకపై సిబ్బందికి ఖచ్చితంగా సమాచారం లేదని పోస్టులో తెలిపారు. మధ్యాహ్నం 12 గంటల వరకు ఇక్కడే ఉంటామని మాకు చెప్పారు.
ఇక్కడ తాగేందుకు కనీసం మంచి నీరు కూడా లేదు'' అని రాధికా ఆప్టే ఇన్‌స్టా పోస్టులో చెప్పుకోచ్చారు. అయితే, దీనిపై ఇండిగో ప్రతినిధి స్పందించడం జరిగింది. ముంబయి నుండి భువనేశ్వర్ వెళ్లే 6E 2301 ఫ్లైట్ నంబర్ ఆపరేషనల్ కారణాల వల్ల ఆలస్యం అయిందని, ఈ ఆలస్యంపై ప్రయాణికులకు సమాచారం అందించడం జరిగింది. ప్రయాణికులందరికీ కలిగిన అసౌకర్యానికి మేము చింతిస్తున్నామని వారు తెలిపారు.












Click it and Unblock the Notifications