సొంత తమ్ముడిని కిరాతకంగా చంపిన స్టార్ హీరోయిన్..!

ఒక్క తప్పుతో జీవితాన్ని జైలుపాలు చేసుకున్నవారు ఎందరో ఉన్నారు. సామాన్యుల నుంచి ప్రముఖుల వరకు తమ జీవితాన్ని చేజేతులా నాశనం చేసుకున్న వారు చాలామందే ఉన్నారు. అయితే చిత్ర పరిశ్రమలోకి ఎంట్రీ ఇచ్చి.. ప్రేక్షకుల్లో మంచి గుర్తింపు తెచ్చుకున్న ఓ స్టార్ బ్యూటీ.. సొంత తమ్ముడిని కిరాతకంగా హతమార్చింది. ప్రేమ విషయాన్నిపెద్దలతో మాట్లాడి ఒప్పించి వివాహం వరకు తీసుకువెళ్లాల్సిన పరిస్థితుల్లో.. ప్రేమ విషయానికి అడ్డుగా ఉన్నాడని సోదరుడిని కాటికి పంపించి ఇప్పుడు కటకటాలు లెక్కేస్తుంది ఓ ముద్దుగుమ్మ. ఆ స్టోరీ ఏంటో తెలుసుకుందాం..

ఎవరా బ్యూటీ..?

కన్నడలో శృంగార భరితమైన చిత్రాలలో నటించి మెప్పించింది యువ హీరోయిన్ " షనయా కత్వే ". 2018లో ఇదమ్ ప్రేమమ్ జీవనమ్ అనే చిత్రం ద్వారా చిత్ర పరిశ్రమలోకి ఎంట్రీ ఇచ్చి.. ఆ తర్వాత ఒండు ఘంటేయా కథే చిత్రంతో ఫుల్ పాపులర్ అయ్యారు. అయితే ఆమె సొంత సోదరుడిని హత్య చేయించిన ఘటనలో అరెస్ట్ కావడం దేశవ్యాప్తంగా హాట్ టాపిక్ అయ్యింది.

actress-shanaya-kathve-killed-her-own-brother-for-love-affair

ఏం జరిగిందంటే..?

ఏప్రిల్ 9, 2021న హుబ్లీలో 'ఒండు ఘంటేయ కథే' సినిమా ప్రమోషన్స్ లో తల్లిదండ్రులు, తమ్ముడితో కలిసి పాల్గొంది షనయా. అయితే తర్వాత రోజు నుంచి ఆమె సోదరుడు కనిపించకపోవడంతో మిస్సింగ్ కేసు ఫైల్ చేశారు.

కాగా ఓ వైపు పోలీసులు విచారణ జరుపుతూ ఉండగానే.. మరోవైపు మూడు రోజుల తర్వాత హుబ్లీకి 12 కిలోమీటర్ల దూరంలో ఉన్న అడవిలో అతని తల కనిపించింది. ఓ వ్యక్తి అడవి గుండా వెళ్తుండగా.. ఓ ప్లాస్టిక్ కవర్ అనుమానాస్పదంగా కనిపించింది. తెరిచి చూస్తే తల ఉండటంతో దగ్గర్లోని పోలీస్ స్టేషన్‌కు సమాచారం అందించాడు. ఇన్వెస్టిగేషన్ ప్రారంభించిన పోలీసులు.. అక్కడికి సమీపంలో ఉన్న ఓ బావిలో బాడీని గుర్తించారు. తలకు సంబంధించిన ఫొటోలు తండ్రికి చూపించడంతో స్పృహ తప్పిపడిపోయాడు. కాగా అడవిలో రెండు కార్లు రక్తపు మరకలతో ఉండగా.. ఒకటి చనిపోయింది తమ కుమారుడే అని నిర్ధారించారు.

అసలు ట్విస్ట్ అదే..?

అయితే అడవిలో రెండు కార్లు రక్తపు మరకలతో ఉండగా.. ఒకటి అమన్ గిరనివాలే పేరుతో రిజిస్టర్ కాగా మరొకటి హీరోయిన్ పేరు మీద రిజిస్టర్ అయింది. పోలీసులు తమదైన పద్దతిలో విచారించగా.. తనే తమ్ముడిని మర్డర్ చేశానని ఒప్పుకుంది. తాను ముస్లిం వ్యక్తి నియాజ్‌ను ప్రేమించానని తెలిపింది. ఆ విషయంలో రాకేష్ అతనితో లైఫ్ బాగోదని.. ఇక్కడితో రిలేషన్ ఎండ్ చేయాలని సూచించాడని వివరించింది.

actress-shanaya-kathve-killed-her-own-brother-for-love-affair

దీంతో తన ప్రేమకు అడ్డుగా ఉన్నారనే కారణంతో రాకేశ్‌ను తన ప్రియుడితో కలిసి హత్య చేసినట్టు ఒప్పుకుంది. హుబ్బాలిలోని సొంత ఇంటిలోనే రాకేశ్ గొంతు కోసి హత్య చేశారనే విషయం పోలీసుల విచారణలో వెల్లడైంది. రాకేశ్ కత్వే దేహాన్ని ముక్కల ముక్కలుగా నరికి పలు అవయవాలను హుబ్బలిలోని పలు ప్రాంతాల్లోను, అలాగే గడగ్ రోడ్ ప్రాంతంలో వేశారని తేల్చారు.

ఇక ఈ కేసులో షనయాతోపాటు మరో నలుగురుని అరెస్ట్ చేశారు. షనయా ప్రియుడు నియజహెమెద్, తౌసీఫ్ చన్నాపూర్, అల్తాఫ్ ముల్లా, ఆమన్ గిరానివాలే‌ను ధర్వాడ్ జిల్లా పోలీసులు అరెస్ట్ చేశారు. ప్రేమ కోసం సొంత తమ్ముడిని చంపడం ఏంటని సర్వత్రా ఆగ్రహం వ్యక్తం చేశారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+