టాలీవుడ్‌లో వేధింపులు.. ఆ హీరోతో టార్చర్ అనుభవించా : శ్వేతా బసు
బాలనటిగా కెరీర్ ప్రారంభించి 'కొత్తబంగారు లోకం' చిత్రంతో టాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇచ్చింది నటి శ్వేతా బసు ప్రసాద్ . తొలి మూవీతోనే తెలుగు సినీప్రేక్షకులను ఆకట్టుకుని, వారి మనసుల్లో ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకుంది . తన జీవితంలో చోటు చేసుకున్న కొన్ని వివాదాల తరువాత మళ్లీ తన నటనా వృత్తిపై దృష్టి సారించింది. అయితే, గత కొంతకాలంగా ఆమె టాలీవుడ్‌కు దూరంగా ఉన్న సంగతి తెలిసిందే. ఇటీవల ఓ ఇంటర్వ్యూలో తన సినీ ప్రయాణం, ఎదుర్కొన్న సవాళ్లు, ఇబ్బందుల గురించి ఆసక్తిర విషయాలను పంచుకున్నారు. కెరీర్‌లో కొన్ని కఠిన పరిస్థితులను ఎదుర్కొన్నానని, ముఖ్యంగా ఓ తెలుగు సినిమా సెట్లో అవమానాలు ఎదుర్కొన్న విషయాన్ని వెల్లడించారు. ఎన్నో అవనామాలను భరించాల్సివచ్చిందని పేర్కొంది.
నా శరీరాకృతిని కించపరిచేలా..
ప్రస్తుతం కెరీర్‌ను చాలా సంతృప్తిగా ఉన్నానని చెప్పుకొచ్చింది. నాకు నచ్చిన చిత్రాల్లో నటించే అవకాశం వచ్చింది. ప్రస్తుతం టెలివిజన్ ఇండస్ట్రీలో నా ప్రయాణం మంచిగానే సాగుతోంది. అయితే, కెరీర్‌లో కొన్ని ఇబ్బందికర పరిస్థితులు ఎదుర్కొన్న సందర్భాలు ఉన్నాయనంటూ తెలిపింది.. ముఖ్యంగా ఓ తెలుగు సినిమా సెట్లో నేను ఎంతో ఇబ్బంది పడ్డాను. నా శరీరాకృతిని కించపరిచేలా సెట్లోని ప్రతి ఒక్కరూ వ్యాఖ్యలు చేసేవారు. హీరోతో పోలిస్తే నా ఎత్తు తక్కువగా ఉందని ఎగతాళి చేసేవారు. 'హీరో ఆరడుగులుంటే, ఇది ఐదు అడుగులే' అంటూ కామెంట్లు చేసేవారు. అలా అవమానించబడటం నాకు ఎంతో బాధ కలిగించిందని ఆవేదన వెల్లబుచ్చింది.

ఆ హీరోతో అవమానపడ్డా..
టాలీవుడ్ హీరో కారణంగా కూడా నాకు ఎన్నో ఇబ్బందులు ఎదురయ్యాయయని శ్వేతా చెప్పుకొచ్చారు. అతను ప్రతిసన్నివేశాన్ని మారుస్తూ గందరగోళాన్ని సృష్టించేవాడు. రీటేక్స్ ఎక్కువగా తీసేవాడు. ముఖ్యంగా, తెలుగులో డైలాగ్స్ చెప్పడంలో కూడా అతనికి ప్రాబ్లెమ్ ఉండేది. ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే, అతని మాతృభాష తెలుగే అయినప్పటికీ, డైలాగ్స్ సరిగ్గా చెప్పలేకపోయేవారు. నిజంగా చెప్పాలంటే, నాకు కూడా తెలుగు పూర్తిగా రాదు. అయినప్పటికీ, డైలాగ్స్ నేర్చుకొని నటించేందుకు ప్రయత్నించా.. కానీ, అతను మాత్రం నా ఎత్తు గురించి కామెంట్లు చేయడం బాధను కలిగించింది. ఎత్తు అనేది జన్యుపరమైన విషయం. దాన్ని మార్చలేము కదా అంటూ పేర్కొంది. ఆ సినిమా సెట్లో నేను ఎదుర్కొన్న అవమానాలే నా కెరీర్‌లో అతిపెద్ద ఇబ్బందిగా నిలిచాయి అని శ్వేతా బసు ప్రసాద్ వెల్లడించింది..
వ్యభిచారం కేసులో చిక్కులు.
శ్వేతా బసు ప్రసాద్ 11 ఏళ్లకే బాలనటిగా తన కెరీర్‌ను ప్రారంభించారు. 2002లో వచ్చిన హిందీ చిత్రం 'మక్డి' ద్వారా ప్రేక్షకులకు పరిచయం అయ్యారు. ఆ తర్వాత ఆమె తెలుగులో 'కొత్తబంగారు లోకం' (2008)తో ఘన విజయాన్ని సాధించి, తెలుగు ప్రేక్షకులకు దగ్గరయ్యారు. ఆ సినిమా తర్వాత 'రైడ్', 'కాస్కో', 'కళవర్ కింగ్', 'ప్రియుడు', 'జీనియస్' వంటి చిత్రాల్లో నటించారు. 2014లో, శ్వేతా బసు ప్రసాద్ వ్యభిచారం కేసులో చిక్కుకుంది. అయితే, తరువాత ఆమెకు కోర్టు క్లీన్ చిట్ ఇచ్చింది. ఈ సంఘటన ఆమె జీవితంలో ఒక మచ్చలా మిగిలిపోయింది. 2018లో విడుదలైన 'విజేత' చిత్రం ఆమె చివరి తెలుగు సినిమా. ఆ తర్వాత హిందీ సినిమాలు, టెలివిజన్ సీరియల్స్‌లో నటిస్తూ తన కెరీర్‌ను కొనసాగిస్తున్నారు.
ప్రియుడుతో వివాహం ఏడాదిలోనే విడాకులు.
శ్వేతా బసు ప్రసాద్ 2018లో తన ప్రియుడు రోహిత్ మిట్టల్‌ను వివాహం చేసుకుంది. రోహిత్ మిట్టల్ ఒక చలన చిత్ర నిర్మాత. అయితే, వారి వివాహం ఎక్కువ కాలం నిలవలేదు. 2019లో వారు విడాకులు తీసుకున్నారు. వివాదాల తరువాత, శ్వేతా తన నటనా వృత్తిపై దృష్టి సారించింది. ఆమె ప్రస్తుతం టెలివిజన్, వెబ్ సిరీస్‌లలో నటిస్తూ తన కెరీర్‌ను కొనసాగిస్తోంది. ఆమె తన ప్రతిభతో ప్రేక్షకులను అలరిస్తూ, తనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపును సంపాదించుకుంది.












Click it and Unblock the Notifications