ఆ హీరోని చూస్తే సింహాన్ని చూసినట్టే - కోర్టు బ్యూటీ శ్రీదేవి
ఒక్క సినిమాతో ఓవర్ నైట్ స్టార్ గా మారిపోయింది యంగ్ బ్యూటీ "శ్రీదేవి". కోర్టు మూవీలో జాబిలి పాత్రలో నటించి.. తన నటనతో మంచి గుర్తింపు సంపాదించుకుంది. దీంతో ఒక్క సినిమాతోనే స్టార్ హీరోయిన్ లెవల్లో ఫేమ్ సంపాదించుకుంది. దాంతో యూత్ నుంచి సోషల్ మీడియాలో వరకూ ఆమెకు విపరీతమైన క్రేజ్ వచ్చింది. రోషన్ కూడా తన పాత్రకు న్యాయం చేస్తూ అద్భుతమైన స్క్రీన్ ప్రెజెన్స్ చూపించాడు. కాగా హర్ష్ రోషన్, శ్రీదేవీ జంట మళ్లీ 'బ్యాండ్ మేళం' అంటూ ఆడియెన్స్ ముందుకు రానుంది.
సతీష్ జవ్వాజీ దర్శకత్వం వహించిన ఈ మూవీని మ్యాంగో మాస్ మీడియా సమర్పణలో కోన ఫిల్మ్ కార్పొరేషన్ బ్యానర్‌పై కావ్య, శ్రావ్య ఈ చిత్రాన్ని నిర్మించారు. ఇప్పటికే సినిమా నుంచి విడుదలైన టీజర్, ట్రైలర్, అలాగే మాస్ పెప్పీ సాంగ్ 'తిప్పూ కుంటున్నావ్', మెలోడీ సాంగ్ 'పల్లెలోని సందల్లన్ని మీవే' ఇప్పటికే ప్రేక్షకుల్లో మంచి స్పందన పొందాయి. ముఖ్యంగా యూత్ ఆడియెన్స్‌లో ఈ సినిమాపై మంచి బజ్ ఏర్పడింది. గ్రామీణ నేపథ్యం, ప్రేమ కథ, వినోదం కలిసిన ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌గా ఈ సినిమా ఉండబోతుందని తెలుస్తోంది.

ఈ చిత్రంలో ప్రముఖ నటుడు Sai Kumar కీలక పాత్ర పోషిస్తుండగా.. మార్చి 26న ప్రేక్షకుల ముందుకు రానుంది. శ్రీరామ నవమి సందర్భంగా ఈ చిత్రాన్ని గ్రాండ్‌గా విడుదల చేయాలని మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు. ప్రమోషన్ల కోసం కూడా చిత్రబృందం ప్రత్యేక కార్యక్రమాలు, ఈవెంట్లు నిర్వహించేందుకు సిద్ధమవుతోంది. ఈ క్రమంలోనే ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ శ్రీదేవి చేసిన కామెంట్స్ ఫుల్ వైరల్ గా మారాయి.
అందులో భాగంగా యాంకర్ రామ్ చరణ్, ఎన్టీఆర్, అల్లు అర్జున్ ఈ ముగ్గురిలో ఎవరు పవర్ హౌస్ అని ప్రశ్నించగా.. శ్రీదేవి ఎన్టీఆర్ అంటూ సమాధానం ఇచ్చింది. ఆయనను చూస్తేనే సింహాన్ని చూసినట్టు ఉంటుందని చెప్పుకొచ్చింది. రోషన్ సైతం ఎన్టీఆర్ గురించే చెప్పడంతో ఈ వీడియో ఫుల్ వైరల్ అవుతోంది. ఇక ప్రస్తుతం శ్రీదేవి చేతిలో రెండు, మూడు సినిమాలు ఉన్నట్లు సమాచారం. 'హైకూ' అనే మరో సినిమాతో కూడా త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రానున్నారు. 'కోర్ట్' సినిమాతో హిట్ జోడీగా గుర్తింపు పొందిన హర్ష్ రోషన్ - శ్రీదేవి అపల్ల జంట 'బ్యాండ్ మేళం' ద్వారా మరోసారి ప్రేక్షకులను ఎంతవరకు అలరిస్తుందో చూడాలి.
-
ప్రతీ ఇంటికీ రెండు ఫ్రీ గ్యాస్ సిలెండర్లు-ఇరాన్ వార్ వేళ సర్కార్ ఆఫర్..! -
శర్వానంద్ 'బైకర్' ఫస్ట్ రివ్యూ.. దేశంలోనే తొలి ప్రయత్నం.. -
ఇకపై నెలకు రెండు సిలిండర్లే..కొత్త బుకింగ్ రూల్స్ -
తమిళనాడులో సీన్ రివర్స్-తాజా సర్వేలో హోరాహోరీ-ఎడ్జ్ మాత్రం..! -
ధనుస్సు రాశి, మకర రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
మిస్టరీ స్టోరీ, గూస్ బంప్స్ ట్విస్ట్స్.. మామూలు మూవీ కాదు గురూ !! -
ఇంటర్ ఫలితాల డేట్ వచ్చేసింది- ఏపీ, తెలంగాణలో ఇలా..!! -
కుప్పకూలుతున్న బంగారం ధరలు- రాక్ బాటమ్ -
ఏప్రిల్ ఒకటి నుంచి చికెన్ షాపులు బంద్ !! -
తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగులకు బంపరాఫర్.. భారీ డిస్కౌంట్ -
భారత్.. పాకిస్థాన్ లా 'బ్రోకర్' కాదు.. ఇచ్చిపడేసిన జై శంకర్.. -
ఎన్టీఆర్ పాటకు స్టెప్పులేసిన సితార.. వైరల్ వీడియో












Click it and Unblock the Notifications