Roja:మంత్రి రోజా ఫుడ్ మెనూ తెలిసిందోచ్.. ఆ హీరోతో నటిస్తానంటోన్న ఫైర్ బ్రాండ్..!
హైదరాబాద్ : రోజా.. ఏపీ పొలిటికల్ ఎరీనాలో ఫైర్‌బ్రాండ్‌గా గుర్తింపు ఉంది. సినిమాల్లో ఎంట్రీ ఇచ్చి అక్కడ సక్సెస్ చూశాక రాజకీయాల్లోకి అడుగుపెట్టారు. ఇక్కడ కూడా సక్సెస్ అయ్యారు. పార్టీ ఏదైనా సరే ప్రత్యర్థులకు ముచ్చెమటలు పట్టించారు.ఎమ్మెల్యేగా ఉన్నా మంత్రిగా ఉన్నా.. పదవి ఏదైనా సరే ప్రజల్లో మాత్రం నిత్యం కనిపిస్తూనే ఉంటారు. బహుశా ఇందుకేనేమో సీఎం జగన్ ఇలాంటి ఫైర్ బ్రాండ్‌కు తన కేబినెట్‌లో చోటిచ్చారు.
రోజా మంత్రి కాకముందు పలు సినిమాల్లో నటిస్తూ కొన్ని టీవీ షోల్లో కనిపిస్తూ అభిమానులను అలరించారు. అయితే మంత్రిగా బాధ్యతలు స్వీకరించాక బుల్లితెరకు దూరమయ్యారు. జబర్దస్త్‌లో జడ్జ్‌గా ఉండటంతో పాటు మరికొన్ని రియాల్టీ షోలకు హోస్ట్‌గా కూడా వ్యవహరించారు. మంత్రి అయ్యాక కూడా కొన్ని వేదికలపై రోజా సంప్రదాయ నృత్యాలతో పాటు తన దైన మాస్ స్టెప్స్ కూడా వేసి ట్రెండ్ సెట్ చేశారు.

రెస్టారెంట్ ఓపెనింగ్‌లో రోజా : తాజాగా రోజా హైదరాబాదులో ఓ రెస్టారెంట్ ప్రారంభోత్సవానికి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ రెస్టారెంట్ పేరు మీ కడుపునిండా తెలుగు వారి రుచులు. బుల్లితెర స్టార్స్ శ్రీవాణి ఆమె భర్త విక్రమాదిత్యా రెడ్డిలు ఈ రెస్టారెంట్‌ను నిర్వహిస్తున్నారు. మణికొండలో ఉండే ఈ రెస్టారెంట్‌లో ఆంధ్ర స్టయిల్ వెజ్ మరియు నాన్ వెజ్ వంటకాలు అందుబాటులో ఉంటాయి. రెస్టారెంట్ ప్రారంభోత్సవం అయ్యాక మంత్రి రోజా ఎగిరే పావురమా చిత్రం నుంచి ఆహా ఏమి రుచి తినరా మైమరచి అనే పాట పాడి అలరించారు.ఏపీలో ఉన్నవారు హైదరాబాద్‌కు వస్తే మణికొండలోని ఈ రెస్టారెంట్‌కు వచ్చి తప్పక భోజనం చేయాలంటూ చిన్న ప్రమోషన్ కూడా ఇచ్చారు.

రోజాకు ఇష్టమైన వంటకాలు : ఇక ఆ తర్వాత మీడియాతో మాట్లాడిన మంత్రి రోజా తను ఇష్టపడే ఫుడ్స్ గురించి చెప్పుకొచ్చారు.పీతల ఇగురు, క్రాబ్ ఫ్రై, చాపల వేపుడు లాంటి నాన్‌వెజ్ ఫుడ్ ఎక్కువగా ఇష్టపడతారట.అంతేకాదు వంట మీద మాంచి పట్టుందని కూడా మంత్రి రోజా చెప్పుకొచ్చారు. తనకు వంట చేయడమంటే చాలా ఇష్టమని తన వంటను భర్త సెల్వమణి, పిల్లలు చాలా ఇష్టంగా తింటారని చెప్పారు. కరోనా సమయంలో మంత్రి రోజా పలు స్పెషల్ డిషెస్ చేసి సోషల్ మీడియా వేదికగా షేర్ చేశారు కూడా.

మహేష్ బాబుతో నటిస్తా : ఇక మంత్రి రోజా తన డైట్ గురించి చెప్పారు. ఉదయాన్నే ఓట్స్, ఆపిల్స్ కలిపి తీసుకుంటానని చెప్పారు. భోజన సమయంలో మాత్రం ముక్క లేనిదే ముద్ద దిగదని క్లారిటీగా చెప్పారు. ఇక రాత్రి వేళల్లో లైట్‌గా ఇడ్లీ, లేదా దోశ తినేందుకు ఇష్టపడతానని చెప్పారు ఈ ఆంధ్ర ఫైర్ బ్రాండ్. ఇక సినిమాల విషయానికొస్తే సూపర్ స్టార్ మహేష్ బాబు చిత్రంలో నటించేందుకు అవకాశం వస్తే తప్పకుండా చేస్తానని చెప్పుకొచ్చారు. అయితే తల్లి పాత్రలో కాకుండా మహేష్ బాబుకు అక్క, లేదా వదిన పాత్రలో నటించేందుకు తాను సిద్ధమని ఫుల్ క్లారిటీ ఇచ్చేశారు.

రోజాను మళ్లీ సిల్వర్ స్క్రీన్ పై చూసేందుకు చాలామంది అభిమానులు వెయిట్ చేస్తున్నారు. ఈ ఒక్క ప్రకటనతో మళ్లీ నటించేందుకు పరోక్షంగా ఆసక్తి కనబర్చింది మంత్రి రోజా. అయితే మహేష్ బాబుకు అక్క లేదా వదిన పాత్రలో రోజాకు అవకాశం ఇచ్చే డైరెక్టర్ ఎవరు, రోజా కోసమే మహేష్ బాబు సినిమాలో క్యారెక్టర్ క్రియేట్ చేస్తారా అనే పలు ప్రశ్నలు ఫిలింనగర్‌లో చక్కర్లు కొడుతున్నాయి.












Click it and Unblock the Notifications