రష్మికకు షాకిచ్చిన మాజీ మంత్రి.. ట్వీట్ వైరల్
రాజకీయాలను , సినిమాలను వేరు చేసి చూడటం చాలా కష్టం. సినిమాల ద్వారా వచ్చిన పాపులారిటీతో చాలామంది రాజకీయ నేతలుగా ఎదిగారు. మంత్రులు, ముఖ్యమంత్రులు, ఎమ్మెల్యేలు కాగలిగారు. తాజాగా అల్లు అర్జున్ సైతం వైసీపీ ఎంపీ అభ్యర్థికి ప్రచారం చేయడం కూడా మనం చూశాం. అయితే ఇదే తరహాలో హీరోయిన్ బీజేపీకి మద్దతుగా చేసిన ఓ ప్రకటన ఇప్పుడు కొందరికి టార్గెట్ అయ్యారు. హీరోయిన్ రష్మిక మందన్న తాజాగా బీజేపీకి మద్దతుగా ఓ వీడియో విడుదల చేసింది. అయితే దీనిపై ఆమెకు తీవ్ర విమర్శలను కూడా ఎదుర్కొంటుంది.రష్మిక పేరు తీయకుండానే ఆమెకు కౌంటర్లు వేశారు. ఆ వివరాల్లోకి వెళ్తే..
దేశంలోనే అత్యంత పొడవైన సముద్రపు వంతెన ముంబై ట్రాన్స్ హార్బర్ లింక్‌ను వాణిజ్య రాజధాని ముంబైలో నిర్మించిన సంగతి తెలిసిందే. ఈ వంతెనను అటల్ సేతు అని పిలుస్తున్నారు. ఈ అటుల్ సేతుపై ఇటీవల ప్రయాణించిన ప్రముఖ హీరోయిన్ రష్మిక మందన్న ప్రశంసలు కురిపించింది. అటల్ సేతుపై కారులో ప్రయాణిస్తూ దాని గురించి తాను మాట్లాడుతున్న వీడియోను రష్మిక ఇటీవల సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు.

ఆ వైరల్ వీడియోను తాజాగా ప్రధాని మోదీ వీక్షించారు. ప్రజల జీవితాలను మెరుగుపరచడం, వారిని అనుసంధానించడం కంటే మించి సంతృప్తి ఏముంటుందని ప్రధాని ట్విటర్‌లో కామెంట్ చేశారు. భారత్.. ఇలాంటి ఓ అద్భుతాన్ని ఆవిష్కరిస్తుందని బహుశా ఎవరూ ఊహించి ఉండరని, అసాధ్యం అనుకున్న దాన్ని ఏడేళ్ల వ్యవధిలో సుసాధ్యం చేశారని రష్మిక ఓ ఇంటర్వ్యూలో పేర్కొంది. ఈ వంతెనపై ప్రయాణం ఓ మధురానుభూతిని ఇస్తుందని, వికసిత్ భారత్‌కు ఈ బ్రిడ్జి అద్దం పడుతోందని వ్యాఖ్యానించింది. అయితే ఈ వీడియో బీజేపీ ప్రమోషన్ లాగ ఉందని విమర్శలు మొదలయ్యాయి.
తాజాగా ఉద్దవ్ థాక్రే కుమారుడు మహారాష్ట్ర మాజీ మంత్రి ఆదిత్య థాక్రరే రష్మిక పేరు తీయకుండానే ఆమె గురించి మాట్లాడారు.ఒక నటి సడన్‌గా ప్రస్తుత పాలనలో అటల్ సేతుగా బ్రాండ్ చేయబడిన ఎమ్‌టీహెచ్‌ఎల్ పై ఒక ప్రకటన చేయడం నేను చూశాను. దానికి సంభందించిన కొన్ని వాస్తవాలు అంటూ కొన్ని అంశాలు హైలెట్ చేస్తూ ట్వీట్ చేశారు.
I just saw an actor suddenly make an advertisement (wonder if it’s paid for or not) on the MTHL, branded as Atal Setu by the current regime.
— Aaditya Thackeray (@AUThackeray) May 17, 2024
Some facts were missed:
• Atal Setu- MTHL’s 85% work was completed till June 2022, when our govt was toppled. The work happened during…
అలాగే ఆమె చివర్లో మేల్కొని అభివృద్ధికి ఓటు వేయండి చెప్పిందని, అదే కరెక్ట్, ఎందుకంటే దాని అర్థం బీజేపీకి ఓటు వేయవద్దు అని రాసుకొచ్చారు. కానీ ఇటువంటి ప్రమోషన్లు చేస్తున్న వారందరికీ వినయపూర్వకమైన అభ్యర్థన చేస్తున్నాను. దయచేసి వాస్తవమేంటో తెలుసుకోండి. కొన్ని పార్టీలు నటీనటులను 'వార్ రుఖ్వా ద' తరహా ప్రకటనలు చేయిస్తున్నాయి. అంటూ పోస్ట్‌లో ఆదిత్య థాక్రరే రష్మిక గురించి రాసుకొచ్చారు. ప్రస్తుతం ఆయన చేసిన ట్వీట్ సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.












Click it and Unblock the Notifications