గుడ్ న్యూస్ చెప్పిన మెగా డాటర్..శుభ తరుణం వచ్చిందంటూ పోస్ట్

మెగా డాటర్ నిహారిక ఇటీవల ఫుల్ జోష్‌లో కనిపిస్తోంది. విడాకులు తీసుకున్న తరువాత మళ్లీ ఇండస్ట్రీలో యాక్టివ్ అవడానికి ప్రయత్నిస్తోంది. నిహారిక వ్యక్తిగత జీవితం గురించి అందరికి తెలిసిన విషయమే. చైతన్య అనే వ్యక్తిని ప్రేమించి పెద్దల సమక్షంలో అంగరంగ వైభవంగా పెళ్లి చేసుకుంది. అయితే భర్త చైతన్యతో కాపురాన్ని ఎక్కువ కాలం కొనసాగించ లేకపోయింది. ఇద్దరి మధ్య విభేదాలు తలెత్తడంతో పెళ్లైన సంవత్సరానికి భర్తకు విడాకులిచ్చి షాకిచ్చింది.

అయితే ఆ సమయంలో నిహారికను నెటిజన్లు ఘోరంగానే ట్రోల్ చేశారు. విడాకుల తీసుకోవడంలో నిహారికదే తప్పని సోషల్ మీడియాలో ప్రచారం జరిగింది. విడాకుల అనంతరం కొంతకాలం సైలెంట్ అయిన నిహారిక ..ఇటీవల సోషల్ మీడియాలో మళ్లీ యాక్టివ్‌గా కనిపిస్తుంది.ఇండస్ట్రీలో తిరిగి తన అదృష్టాన్ని పరీక్షించుకుంది. అయితే ఈసారి నటిగా కాకుండా నిర్మాతగా మారి ఇండస్ట్రీలో రీఎంట్రీ ఇచ్చింది ఈ బ్యూటీ.

After Divorce Niharika Is Back in Full Swing Producer Success amp amp Acting Comeback

ఆమె తొలిసారి నిర్మాతగా మారి తెరకెక్కించిన 'కమిటీ కుర్రాళ్లు' సినిమా బాక్సాఫీస్ వద్ద సూపర్ హిట్‌గా నిలిచింది.తాను నిర్మించిన తొలి సినిమా హిట్ కావడంతో నిహారిక సైతం ఆనందం వ్యక్తం చేశారు. తొలి సినిమాతోనే సక్సెస్ కొట్టిన నిహారిక ఫుల్ జోష్‌లో ఉన్నారు. ఇదిలా ఉంటే నిహారిక తాజాగా ఓ పోస్ట్‌ను షేర్ చేసింది.

నిహారిక తన ఇన్‌స్టాగ్రామ్‌లో ఒక వీడియోను షేర్ చేస్తూ తన మనసులోని మాటను పంచుకున్నారు. నిన్న నాకోసం చాలా ప్రత్యేకమైన రోజు. ఒకవైపు నేను కెమెరా ముందు డ్యాన్స్ చేస్తుండగా, మరోవైపు నా ప్రొడక్షన్ షూట్ కొనసాగుతోందని ఆమె తెలిపారు.

నిర్మాణం, నటన ఈ రెండింటిలో ఏది ఇష్టమని అడిగితే, రెండూ సమానమేనని ఆమె చెప్పారు. నటన నా కళ అయితే, నిర్మాణం నేను చాలా కష్టపడి పైకి వచ్చిన పని అని నిహారిక పేర్కొన్నారు. ఈ రెండు పనులను ఒకే రోజు చేయగలిగానని, అందుకే ఈ రోజును ఎప్పటికీ గుర్తుంచుకుంటానని ఆమె ఆనందంగా వెల్లడించారు.

నిహారిక పోస్ట్ ద్వారా తన తదుపరి సినిమాను నిర్మించడమే కాకుండా, అందులో నటిగా కూడా భాగం కానున్నారని స్పష్టమైంది. ఈ గుడ్ న్యూస్ మెగా అభిమానులకు మరింత ఆనందాన్ని ఇచ్చింది. ప్రస్తుతం ఈ పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతూ నిహారిక అభిమానులను ఆకట్టుకుంటోంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+