చిరంజీవి కుటుంబానికి 'ఆమె' వల్ల బాగా కలిసివస్తోంది

మెగాస్టార్ చిరంజీవి కుటుంబంలోని అందరూ సభ్యులు మంచి ఫామ్ లో ఉన్నారు. చిరంజీవి విశ్వంభర చిత్రం చేస్తున్నారు. కచ్చితంగా బ్లాక్ బస్టర్ అవుతుందని దర్శకుడు వశిష్ట ప్రకటించారు. మరోవైపు పవన్ కల్యాణ్ రాజకీయాల్లోకి అడుగుపెట్టి పిఠాపురం నుంచి సంచలన విజయాన్ని కైవసం చేసుకున్నారు. అంతేకాదు.. రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పదవితో ఐదు మంత్రి పదవులను నిర్వర్తిస్తున్నారు. ఎన్నికల్లో జనసేన పోటీచేసిన 21 నియోజకవర్గాల్లోను విజయాన్ని సాధించిపెట్టి దేశవ్యాప్తంగా అన్ని పార్టీలు తమవైపు తల తిప్పి చూసేలా చేసుకున్నారు.

విజయవంతంగా వ్యాపారాలు
మరోవైపు రామ్ చరణ్ భార్య ఉపాసన ప్రస్తుతం నిర్వహిస్తున్న వ్యాపార బాధ్యలతోపాటు తన అత్తయ్య సురేఖతో కలిసి అత్తమ్మాస్ కిచెన్ అని యూట్యూబ్ చానెల్ ను ప్రారంభించి విజయపథంలో నడిపిస్తున్నారు. రామ్ చరణ్ గేమ్ ఛేంజర్ సినిమా పూర్తయి విడుదలకు సిద్ధమవుతోంది. ఈ సినిమా కూడా ఘనవిజయం సాధిస్తుందనే అంచనాలున్నాయి. మరోవైపు వరుణ్ తేజ్ రెండు సినిమాల షూటింగ్ లో పాల్గొనబోతున్నారు. లావణ్య త్రిపాఠి కొత్త వ్యాపారంలోకి అడుగుపెడుతోంది. చిరంజీవి పెద్ద కుమార్తె నిర్మాతగా రాణిస్తోంది.

after klinkara birth good time starts megastar chiranjeevi family

ఫొటో బయటకు రాకుండా జాగ్రత్తలు
ఇలా చిరంజీవి కుటుంబ సభ్యులంతా ఆనందంగా, సంతోషంగా ఉన్నారు. అందుకు కారణం ఏమిటంటే రామ్ చరణ్ - ఉపాసన దంపతుల కుమార్తె క్లింకార. ఆ పాప జన్మించిన తర్వాత అందరికీ బాగా కలిసివస్తోందని, ఎప్పుడూ లేనివిధంగా పవన్ కల్యాణ్ సంచలన విజయాలను అందుకుంటున్నారంటే అందుకు కారణం ఆ పాప అని ఫిల్మ్ నగర్ వర్గాలు చెబుతున్నాయి. అలాగే చిరంజీవి మేనళ్లుల్లు కూడా కొత్త సినిమాలను ఒప్పుకుంటున్నారు.

చిరంజీవి కుటుంబానికి క్లింకార అదృష్ట దేవతగా మారిందని, అన్నీ శుభశకునాలే చోటుచేసుకుంటున్నాయని మెగా అభిమానులు కూడా గర్వంగా చెప్పుకుంటున్నారు. క్లింకార జన్మించిన తర్వాత వరుణ్ తేజ్ వివాహం జరగడం, ఆర్ఆర్ఆర్ సినిమాకు ఆస్కార్ అవార్డు రావడం, చిరుకు పద్మవిభూషణ్ అవార్డు రావడం జరిగిందంటున్నారు. అందుకే దిష్టి తగులుతుందని ఆమె ఫొటోను కూడా ఎక్కడా సామాజిక మాధ్యమాల్లో రాకుండా రామ్ చరణ్, ఉపాసన జాగ్రత్తపడుతున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+