సమంతకు మ్యారేజ్ ప్రపోజల్.. రెండేళ్ల టైమ్

యువసామ్రాట్ అక్కినేని నాగచైతన్య తాజాగా శోభిత ధూళిపాళతో నిశ్చితార్థం జరుపుకున్నారు. ప్రస్తుతం ఈవార్త తెలుగు ఫిలింనగర్ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. నిశ్చితార్థం ఫొటోలను నాగార్జున ట్విటర్ లో ఉంచి శుభాకాంక్షలు తెలిపారు. త్వరలోనే వివాహతేదీని ప్రకటించబోతున్నారు. సమంత అభిమానులకైతే ఈ వార్త షాక్ ఇచ్చింది. ఈరోజు కాకపోతే రేపైనా తిరిగి నాగచైతన్య-సమంత కలిసిపోతారనే ఆశాభావంతో వారు ఉన్నారు. కొద్దిరోజుల నుంచి నాగచైతన్య-శోభిత ప్రేమించుకుంటున్నారంటూ వస్తున్న వార్తలు నిశ్చితార్థం జరగడంతో అవే నిజమయ్యాయి.

సోషల్ మీడియాలో రీల్
నాగ చైతన్య - శోభిత నిశ్చితార్థం జరిగిన తర్వాత సామాజిక మాధ్యమాల్లో మీమ్స్ హోరెత్తిపోతున్నాయి. వీటిల్లో ఓ వీడియో మాత్రం సమంతను ఆకర్షించింది. ముఖేష్ అనే అభిమాని రీల్ చేసి పోస్ట్ చేశారు. సమంతా.. నువ్వు ఎటువంటి ఆందోళన చెందొద్దు.. నీకు నేనున్నాను.. రెండు సంవత్సరాల్లో ఆర్థిక వ్యవహారాలకు సంబంధించి నేను స్వతంత్రుడిని అవుతాను.. ఆ తర్వాత ఇద్దరం పెళ్లిచేసుకుందామని చెబుతాడు. ఈ రీల్ కు సమంత స్పందించింది. రీల్ కన్నా నీ బ్యాగ్రౌండ్ లో ఉన్న జిమ్ తనను బాగా ఆకట్టుకుంది అని చెప్పింది.

after naga chaitanya and sobhita engagement marriage proposal to samantha

సమంత లేకపోతే భూమిమీద లేను
దీంతో ముఖేష్ సమంతను మళ్లీ ట్యాగ్ చేస్తూ పోస్ట్ చేశాడు. సమంత ఇచ్చిన రిప్లై తన రోజును పూర్తిగా మార్చేసిందన్నాడు. సమంతకు వెయ్యిమంది అభిమానులుంటే అందులో తాను కూడా ఒకడినని, అదే ఆమెకు వంద మంది అభిమానులుంటే వారిలో ఒక్కడినని, ఒక్కరే అభిమాని అంటే అది తానేనన్నాడు. సమంతకు ఎవరూ అభిమానులు లేరంటే భూమి మీద తాను కూడా లేనట్లే అని పోస్ట్ చేశాడు. ప్రస్తుతం ఇది బాగా వైరలైంది. సామాజిక మాధ్యమాల్లో ఒకర్నొకరు షేర్ చేసుకుంటున్నారు. నాగచైతన్యతో శోభిత నిశ్చితార్థం జరిగిన తర్వాత సమంత ఎక్కువగా బాధపడుతోందని ఆమె అభిమానులు అంటున్నారు. గతంలో వివాహ బంధంపై సామ్ చేసిన వ్యాఖ్యలు, వీడియోలు ప్రస్తుతం వైరలవుతున్నాయి. పాత వీడియోలను అభిమానులు సామాజిక మాధ్యమాల్లో షేర్ చేస్తున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+