అఖండ తాండవం..ఆ రోజే- నెక్స్ట్ లెవెల్ బ్లాస్టింగ్
Akhanda 2: నందమూరి బాలకృష్ణ నటిస్తోన్న తాజా మూవీ.. అఖండ 2. బోయపాటి శ్రీను దర్శకుడు. 2021లో విడుదలైన బ్లాక్ బస్టర్ మూవీ అఖండకు సీక్వెల్ ఇది. అఘోరీగా నందమూరి బాలకృష్ణ నట విశ్వరూపాన్ని ప్రదర్శించారీ మూవీలో. బాక్సాఫీస్ వద్ద కలెక్షన్ల సునామీ సృష్టించిందీ సినిమా.
ఇప్పుడు దీనికి సీక్వెల్ తెరకెక్కిస్తోన్నారు బోయపాటి. ఇప్పటికే కీలక సన్నివేశాల చిత్రీకరణ పూర్తయింది. ప్రయాగ్ రాజ్ లో మహా కుంభమేళాలో సైతం కొన్ని సన్నివేశాలను చిత్రీకరించారు. అసలైన అఘోరీలు, వారి జీవన విధానం, త్రివేణి సంగమం, కుంభమేళకు సంబంధించిన సీన్లను షూట్ చేశారు. అఘోరీలతో కూడిన సినిమా కావడం వల్ల ఆయా సన్నివేశాలను చిత్రీకరించాల్సి వచ్చింది.

ఆ తరువాత బోయపాటి హిమాలయాల్లో మకాం వేశారు. అక్కడ రెక్కీ నిర్వహించారు. కథకు అనుగుణంగా అత్యంత సంక్లిష్ట ప్రదేశాల్లో సన్నివేశాలను తెరకెక్కించారు. అసేతు హిమాలయ పర్వతాలను సరికొత్త కోణంలో షూట్ చేశారు బోయపాటి. ఇప్పటి వరకూ ఎవరూ చిత్రీకరించడానికి సాహసించని ప్రదేశాలను అఖండ 2 సినిమాలో చూడబోతున్నారు అభిమానులు.
అఘోరీ బాలకృష్ణ ఇంట్రడక్షన్ సహా కొన్ని సీన్ల చిత్రీకరణ ఆయా ప్రాంతాల్లో నిర్వహించారు. ఆది పినిశెట్టి, సంయుక్త మీనన్, ప్రగ్యా జైస్వాల్, శరత్ లోహితాశ్వ.. ఇతర కీలక పాత్రల్లో నటిస్తోన్నారు. సరైనోడు తరువాత బోయపాటి శ్రీనుతో మూవీ చేస్తోన్నారు ఆది పినిశెట్టి. ఓ పవర్ ఫుల్ క్యారెక్టర్‌లో నటిస్తోన్నాడు.
14 రీల్స్ ప్లస్ పై రామ్ ఆచంట, గోపీచంద్ ఆచంట ఈ చిత్రాన్ని నిర్మిస్తోన్నారు. ఎం తేజస్విని నందమూరి ఈ చిత్రాన్ని సమర్పిస్తోన్నారు. తాజాగా ఈ సినిమా టీజర్ విడుదల తేదీని ప్రకటించింది 14 రీల్స్ ప్లస్ యూనిట్. సోమవారం సాయంత్రం 6:03 నిమిషాలకు టీజర్ విడుదల అవుతుందని వెల్లడించింది. అఖండ తాండవం ఆరంభమౌతుందని పేర్కొంది.












Click it and Unblock the Notifications