సమంతతో అఖిల్.. అక్కినేని ఫ్యామిలీలో ఊహించని ట్విస్ట్..!
నాగ చైతన్య, సమంత జీవితం తెరిచిన పుస్తకమే.హీరో నాగచైతన్యను సమంత ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. నాగ చైతన్య, సమంత 2017లో వివాహం చేసుకున్నారు. అయితే కొన్నాళ్లకే ఇద్దరి మధ్య విభేదాలు రావడంతో ఈ జంట అక్టోబర్ 2021లో విడిపోతున్నట్లు ప్రకటించారు.ఇండస్ట్రీలో బెస్ట్ జోడిగా ఉంటారనుకునేలోపే వీరు విడిపోయారు.పెళ్లైన కొన్నాళ్లకే వీరి మధ్య అభిప్రాయభేదాలు తలెత్తడంతో ఈ జంట విడాకులు తీసుకున్నారు.
వీరి మధ్య విభేదాలు రావడంతో విడాకులు తీసుకుని ఎవరి జీవితాన్ని వారు కొనసాగిస్తున్నారు.అయితే విడాకుల విషయంలో అభిమానులు రెండు వర్గాలుగా విడిపోయి.. సమంతది తప్పంటే.. లేదు నాగచైతన్యదే తప్పని సోషల్ మీడియా వేదికగా యుద్దం చేశారు.విడాకులపై నాగచైతన్య ఎప్పుడు మాట్లాడింది లేదు. కానీ సమంత మాత్రం తన సినిమాల విడుదల సమయంలో పరోక్షంగా విడాకులపై స్పందిస్తూ వస్తున్నారు. అయితే వారిద్దరు తిరిగి కలిస్తే చాలా బాగుంటుందని అభిమానులు కోరుకున్నారు.కానీ సమంతతో విడాకులు తర్వాత నాగ చైతన్య శోభితతో రిలేషన్‌లో ఉన్నాడు.

నాగ చైతన్య శోభితతో ఉన్న తన బంధాన్ని పెళ్లిగా మార్చుకున్నాడు. ఈక్రమంలోనే సైలెంట్‌గా శోభితను రెండో వివాహం చేసుకున్నాడు. అయితే సమంత మాత్రం సింగిల్‌గానే తన జీవితాన్ని కొనసాగిస్తుంది. ఇదిలా ఉంటే అక్కినేని కుటుంబంలో సమంతపై ఎలాంటి అభిప్రాయం ఉన్నప్పటికీ, అక్కినేని అఖిల్ మాత్రం తన మాజీ వదినపై అదే గౌరవంతో ఉన్నాడని తెలుస్తోంది. ఎందుకంటే అఖిల్ తన సోషల్ మీడియాలో గతంలో పెట్టిన పోస్ట్ ఇప్పటికీ అలానే ఉంది.
నాగ చైతన్య , సమంతల పెళ్లి రోజు సందర్భంగా అఖిల్ వారికి విషెష్ చెబుతూ పెట్టిన పోస్ట్ ఇంకా అతని ఇన్‌స్టాగ్రామ్‌లో అలానే ఉంది. సాధారణంగా తమ కుటుంబంలో నుంచి ఓ వ్యక్తి విడిపోయినప్పుడు కచ్చితంగా వారి ఫొటోలను డిలీట్ చేస్తారు. కానీ అఖిల్ మాత్రం తన ఫ్యామిలీతో, అన్న చైతు, మాజీ వదిన సమంతతో కలిసి దిగిన ఫొటోలు ఇంకా జ్ఝాపకంగా ఉంచుకున్నాడు.ఇది చూసిన నెటిజన్లు సమంతను అఖిల్ ఇంకా వదినగానే చూస్తున్నాడని కామెంట్ చేస్తున్నారు. ప్రస్తుతం దీనికి సంబంధించిన ఫొటో నెట్టింట వైరల్‌గా మారింది.












Click it and Unblock the Notifications