సౌత్ ఇండియాలో బిగ్గెస్ట్ బ్లాక్‌బస్టర్ వదులుకున్న నాగార్జున
మన్మథుడు అక్కినేని నాగార్జునకు వయసుతో సంబంధం లేదు. వయసు పెరుగుతున్నకొద్దీ తాను ఎంతో అందంగానే కనపడుతుంటారు. అగ్ర కథానాయకుల్లో ఇలా ఉండటం ఏ హీరోకు సాధ్యం కాలేదు. కెరీర్ పరంగా తన 100వ సినిమాకు దగ్గరలో ఉన్న నాగార్జున దీన్ని ఎంతో ప్రతిష్టాత్మకంగా తీయాలనే ఆలోచనలో ఉన్నాడు. ప్రస్తుతం ధనుష్ తో ఓ సినిమా, రజనీకాంత్ కూలీ సినిమాల్లో నటిస్తున్నారు. వీటి షూటింగ్ పూర్తయిన తర్వాత తన 100వ సినిమా పట్టాలెక్కిస్తారు. దీనికోసం అనేక కథలను వింటున్నారు. కెరీర్ లో ఎంతో ప్రత్యేకంగా నిలిచిపోవాలని నాగార్జున ఆశిస్తున్నారు. ఆయన కోరిక ఎంతమేరకు నెరవేరుతుందో చూడాలి.
ఈరోజున రూ.700 కోట్లతో సమానం
కెరీర్ పరంగా చాలా బిజీగా ఉన్న సమయంలో అనేక కథలు తన దగ్గరకు వచ్చినప్పటికీ కొన్నింటిని కథలు నచ్చక, మరికొన్నింటికి డేట్లు ఖాళీలేక వదులుకోవాల్సి వచ్చింది. అలా వదులుకున్నవాటిలో కలిసుందాం.. రా సినిమా కూడా ఉంది. వెంకటేష్ కథానాయకుడిగా సురేష్ ప్రొడక్షన్స్ ఈ సినిమాను ఉదయ్ శంకర్ దర్శకత్వంలో నిర్మించింది. 2000లో విడుదలైన ఈ సినిమా రూ.25 కోట్ల గ్రాష్ వసూళ్లు రాబట్టి అతి పెద్ద సంచలనాన్ని నమోదు చేసింది. 25 సంవత్సరాల క్రితం దక్షిణ భారతదేశంలో రూ.25 కోట్ల గ్రాష్ వసూళ్లు అంటే ఈరోజు రూ.600 నుంచి రూ.700 కోట్లతో సమానం. అటువంటి సినిమాను ముందుగా నాగార్జునే చేయాల్సివుంది.

అతి పెద్ద సంచలనం నమోదు
ఎందుకనోకానీ ఆయన తిరస్కరించడంతో వెంకీ, సిమ్రాన్ హీరో హీరోయిన్లుగా వచ్చిన కలిసుందాం..రా సినిమా పెద్ద సంచలనాన్ని నమోదుచేసింది. కుటుంబ కథాచిత్రానికి అంత స్థాయిలో కలెక్షన్లు రావడం ఎవరూ ఊహించలేకపోయారు. నాగార్జున వదులుకున్న సూపర్ హిట్ సినిమాల్లో ఇది కూడా ఒకటి. ప్రస్తుతం నాగచైతన్యకు శోభితతో వివాహం చేసిన మన్మథుడు చిన్న కొడుక్కు కూడా పెళ్లి చేయడానికి అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు. అఖిల్ పెళ్లి కూడా అన్నపూర్ణ స్టూడియోలో జరిగే అవకాశం ఉంది. కొడుకులిద్దరికీ పెళ్లిళ్లు చేయాలనే నాగార్జున కోరిక నెరవేరబోతున్నందుకు అక్కినేని అభిమానులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. హైదరాబాద్ లోని ఓడియన్ థియేటర్ యజమాని కూతురుతో అఖిల్ పెళ్లి జరగబోతోంది. వీరిద్దరూ కొంతకాలంంగా ప్రేమలో ఉన్నారు.












Click it and Unblock the Notifications