రెండు ఎలక్ట్రిక్ స్టవ్ లు కొన్నా.. గ్యాస్ కొరత వేళ సూపర్ స్టార్ సంచలనం

పశ్చిమాసియాలో ఉద్రిక్తతల కారణంగా దేశవ్యాప్తంగా గ్యాస్ సంక్షోభం నెలకొన్న సంగతి తెలిసిందే. గ్యాస్ కొరత కారణంగా అటు సామాన్య ప్రజానీకం నుంచి సెలబ్రిటీస్ వరకూ అందరూ ఇబ్బందులు పడుతున్నట్లు స్పష్టం అవుతోంది. ఇలాంటి సంక్షోభ సమయంలో సాధారణంగా పేద, మధ్య తరగతి కుటుంబాలు సతమతం అవుతుంటాయి. కానీ సినిమా స్టార్స్ కూడా గ్యాస్ కొరత వల్ల కట్టెల పొయ్యికి షిఫ్ట్ కావడం, ఎలక్ట్రిక్ స్టవ్ లను కొనుగోలు చేయడం చేస్తున్నారు. ఇందుకు సంబంధించిన వీడియోలు ప్రస్తుతం సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతున్నాయి.

ఇటీవల టాలీవుడ్ యంగ్ హీరో నాగ శౌర్య తల్లి గ్యాస్ సిలిండర్ల కొరతపై తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. ఈ మేరకు సోషల్ మీడియాలో ఒక వీడియోను పోస్టు చేశారు. నాగశౌర్య తల్లి హైదరాబాద్ లో 'ఉషా ముల్పూరి కిచెన్' పేరుతో ఓ రెస్టారెంట్ నిర్వహిస్తున్నారు. అయితే గ్యాస్ కొరత కారణంగా వంటలను కట్టెల పొయ్యిపై చేయాల్సిన పరిస్థితి వచ్చిందని ఉషా ముల్పూరి ఆవేదన వ్యక్తం చేశారు. ఇందుకు సంబంధించిన వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్ గా మారింది. అలాగే చాలామందికి ఈ గ్యాస్ సిలిండర్ల కొరత తాకింది.

తాజాగా బాలీవుడ్ స్టార్ హీరో అక్షయ్ కుమార్ కీలక వ్యాఖ్యలు చేశారు. ప్రస్తుతం తమ ఇంట్లో గ్యాస్ సిలిండర్ల కొరత లేదని అన్నారు. అయితే బ్యాకప్ కోసం తన సతీమణి ట్వింకిల్ ఖన్నా.. రెండు ఎలక్ట్రిక్ స్టవ్ లను ఆర్డర్ చేసినట్లు తెలిపారు. అయితే అవి ఇంటికి వచ్చాయో.. లేదో.. ఇంకా తనకు తెలియదని అన్నారు. ముంబైలోని క్లీన్ లీగ్ ఈవెంట్ లో పాల్గొన్న ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.

AkshayKumar bollywood star Buys Two Electric Stoves Amid Gas Shortage His Strong Message Goes Viral

ఇక ప్రస్తుతం బాలీవుడ్ హీరో అక్షయ్ కుమార్ భూత్ బంగ్లా అనే హారర్ కామెడీ మూవీలో నటిస్తున్నారు. ఈ మేరకు తాను షూటింగ్ నుంచి నేరుగా ఈ కార్యక్రమానికి వచ్చినట్లు తెలిపారు. అలాగే భాత్ భంగ్లా మూవీతోపాటుగా రోహిత్ శెట్టి తెరకెక్కిస్తున్న గోల్ మాల్ 5 మూవీలోనూ అక్షయ్ కుమార్ లీడ్ రోల్ చేస్తున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+