చిరంజీవిపై వ్యూహాత్మకంగా పావులు కదుపుతున్న అల్లు అర్జున్?

అల్లు కుటుంబానికి, మెగా కుటుంబానికి మధ్య విభేదాలు తారస్థాయికి చేరాయి. కొద్ది సంవత్సరాల క్రితం చిన్నగా మొదలైన ఈ విభేదాలు చిలికి చిలికి గాలివానలా మారాయి. ప్రస్తుతం మెగా కుటుంబానికి అల్లు అర్జున్ పూర్తిదూరంగా ఉంటున్నారు. ఏదైనా ముఖ్యమైన సందర్భాలు ఎదురైన సమయంలో మాత్రం ట్వీట్ తో సరిపెడుతున్నాడు. ఏపీ అసెంబ్లీ ఎన్నికల సమయంలో జరిగిన పరిణామాలు ఈ రెండు కుటుంబాల మధ్య ఆజ్యం పోసినట్లైంది. వాస్తవానికి మెగా కుటుంబం అనే నీడ నుంచి బయటకు వచ్చి సొంతంగా అల్లు బ్రాండ్ మీద అభివృద్ధి చెందాలనేది అల్లు అర్జున్ ఆలోచనగా ఉంది.

చిరంజీవి నీడకింద ఉండాలి
అల్లు రామలింగయ్య తన కూతురును ఇచ్చి వివాహం చేసిన తర్వాతే చిరంజీవి దశ తిరిగింది. అలా అల్లు కుటుంబానికి అల్లుడైన చిరంజీవి కుటుంబం ఇప్పుడు మెగా కుటుంబమైంది. మెగా కుటుంబ సభ్యులతోపాటు అల్లు కుటుంబ సభ్యులంతా కూడా మెగాస్టార్ చిరంజీవి అనే నీడ కింద ఉండాల్సిన పరిస్థితి తలెత్తింది. స్వతహాగా స్వతంత్ర భావాలు కలిగిన అల్లు అర్జున్ కు ఈ పోకడ రుచించలేదు. తనను తాను సొంతంగా నిరూపించుకోవాలనే పట్టుదలతో ఉన్నారు. అందుకే అల్లు పేరుతో స్టూడియో నిర్మిస్తున్నారు. ఆహా పేరుతో ఓటీటీని స్థాపించారు.

Allu Arjun is aiming to promote the Allu brand rather than the mega brand

అల్లు బ్రాండ్ ను ప్రమోట్ చేయాలి
మెగా కాంపౌండ్ నుంచి పూర్తిగా బయటకు వచ్చేసి అల్లు బ్రాండ్ ను ప్రమోట్ చేయాలనేది అల్లు అర్జున్ యోచన. అందుకనుగుణంగా ఆయన అడుగులు వేస్తున్నారు. అల్లు బ్రాండ్ ను విస్త్రత పరుచుకోవడం, అల్లు కుటుంబం అస్తిత్వాన్ని నిలబెట్టడం బన్నీ ప్రధాన లక్ష్యంగా ఉంది. మెగాస్టార్ గా చిరంజీవి ఈరోజు ఈ స్థాయిలో ఉన్నారంటూ అది అల్లు కుటుంబంవల్లే అనే అభిప్రాయం ఆ కుటుంబ సభ్యుల్లో బలంగా ఉంది. ఇటీవలికాలంలో అల్లు అర్జున్ చేస్తున్న వ్యాఖ్యలు కూడా ఏవో గాలివాటున చేస్తున్న వ్యాఖ్యలు కావు. ఒక ప్రణాళిక ప్రకారం చేస్తున్నవేనని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. మెగా కుటుంబం అనే బ్రాండ్ చాటున కాకుండా అల్లు బ్రాండ్ గా జీవించాలని ఆ కుటుంబం యోచిస్తోంది. అందుకనుగుణంగా అడుగులు వేస్తోంది. మెగా బ్రాండ్ కు, అల్లు బ్రాండ్ కు మధ్య జరుగుతున్న ఈ పోరాటం భవిష్యత్తులో ఏ మలుపు తీసుకుంటుందో చూడాలి.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+