విశాఖ వాసులకు అదిరిపోయే శుభవార్త.. ఏసీ బస్సులలో భోగాపురం ఎయిర్ పోర్టుకు!
విశాఖపట్నం నగరవాసులకు శుభవార్త. ఏపీ సర్కార్ భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయాన్ని దృష్టిలో పెట్టుకుని విమానయానం చెయ్యాలనుకునే వారికోసం అన్ని ఏర్పాట్లు చేస్తుంది. అందులో భాగంగా భోగాపురం ఎయిర్పోర్ట్ కు మరింత సౌక్రయవంతమైన రవాణా సౌకర్యాలను అందించాలని నిర్ణయం తీసుకుని ఎలెక్ట్రిక్ ఏసీ బస్సులను ప్రవేశపెడుతోంది.
విశాఖ నగరానికి 100 ఆధునిక ఎలెక్ట్రిక్ ఏసీ బస్సులు
ఈ ప్రాజెక్ట్ క్రింద మొత్తం 100 ఆధునిక ఎలెక్ట్రిక్ ఏసీ బస్సులు విశాఖ నగరానికి రానున్నాయి. ఇవి పర్యావరణ పరిరక్షణకు ఎంతగానో దోహదం చేస్తాయి. కాలుష్య రహితంగా ఈ బస్సులు సేవలు అందిస్తాయి. తొలిదశలో నేడు జులై 20వ తేదీన నాలుగు బస్సులు కూర్మన్న పాలెం డిపోలో చేరాయి. ఈ బస్సులు భోగాపురం ఎయిర్పోర్ట్ కు రెండు వేర్వేరు మార్గాల్లో సర్వీసులను అందించనున్నాయి.

ఎలెక్ట్రిక్ ఏసీ బస్సుల ప్రత్యేకతలు ఇవే
ఈ బస్సులు ఒక్కసారి చార్జింగ్ చేస్తే 200 కిలోమీటర్లు ప్రయాణం చేసే వీలుంటుంది. ఇది భోగాపురం ఎయిర్ పోర్ట్ కు రాకపోకలు సాగించేవారికిఎంతో అనుకూలంగా ఉంటుంది. ప్రతీ బస్సులోనూ 40సీట్ల సామర్ధ్యం ఉంటుంది. ప్రయాణికుల సౌకర్యం కోసం అత్యాధునిక సౌకర్యాలతో ఇది సుఖవంతమైన ప్రయాణానికి దోహదం చేస్తుంది. ఈ బస్సులలో ఆటోమేటేడ్ డోర్స్, ప్రత్యేక మైక్ సిస్టం, సీసీ టీవీ కెమెరాలు ఉంటాయి.
గాజువాక నుండి ఈ మార్గంలో భోగాపురం ఎయిర్ పోర్ట్ కు
ఈ బస్సులు వంద శాతం భద్రతను ఇస్తాయి. ఈ బస్సులు పెద్దగా శబ్ద కాలుష్యం కలిగించవు. ఇంజన్ సౌండ్ రాకుండా నిశ్శబ్దంగా నడుస్తుంది. ఇది ఏసీ బస్సు కావటంతో ప్రయాణికులకు ఎలాంటి ప్రయాణ అలసట తెలియదు. గాజువాక నుండి వెళ్ళే మార్గంలో ఎన్ఏడీ కూడలి, గురు ద్వారా, మద్దిల పాలెం, హనుమంత వాక, మధురవాడ, ఆనందపురం, తగరపువలస మీదుగా ఈ బస్సులు భోగాపురం చేరుకుంటాయి.
తొలిదశలో 20 బస్సులు
ఇక మరో మార్గంలో సింధియా, రైల్వే స్టేషన్, ద్వారకా బస్ స్టేషన్, వుడా పార్క్, రుషికొండ, ఐటీ హిల్స్, మరిక వలసమీదుగా ఇవి వెళ్తాయి. మొదటి దశలో 20 బస్సులు నడుస్తాయి. తర్వాత మిగతా 80 బస్సులను నగరం లోపల మాత్రమే కాకుండా, అనకాపల్లి, విజయనగరం, ఎలమంచిలి వంటి ప్రాంతాల్లో కూడా నడపాలని ఆర్టీసీ భావిస్తోంది.
ఏసీ బస్సులే కాదు వెయిటింగ్ లాంజ్ లు కూడా
ఏసీ బస్సులే కాదు ఎయిర్ పోర్ట్ కు వెళ్ళే వారికోసం వెయిటింగ్ లాంజ్ లను కూడా జీఎంఆర్ ఏర్పాటు చేయనుంది . ఈ బస్సుల చార్జీల వివరాలు త్వరలో ప్రకటించనున్నారు. ఇక ఈ బస్సులను నడిపేది ప్రైవేట్ డ్రైవర్స్ కాగా టికెట్స్ మాత్రం ఆర్టీసీ కండక్టర్ లు ఇస్తారు. విశాఖ వాసుల అవసరాలు తీరుస్తూ, ఈ బస్సులు విశాఖ, చుట్టుపక్కల ప్రాంతాల వారికి ఎంతో ఉపయోగపడనున్నాయి.












Click it and Unblock the Notifications