అమాంతం పెరిగిన పసిడి వాల్యూ: నూతన ట్రెండ్ కు నాంది?
పండగలు, పెళ్లిళ్లీ సీజన్ సమీపిస్తోన్న ప్రస్తుత పరిస్థితుల్లో దేశీయంగా బంగారం, వెండి ధరల్లో అనూహ్య కదలికలు నెలకొన్నాయి. కొంతకాలంగా కుప్పకూలుతూ వస్తోన్న వీటి రేట్లకు బ్రేక్ పడింది. ఇక రివర్స్ గేర్ వేశాయి. శుక్రవారం నాటి క్లోజింగ్ ను కొనసాగిస్తూ నేడు కూడా ధరలు పెరిగాయి. ఈ పెరుగుదల స్వల్పమే. అయినప్పటికీ.. మున్ముందు ఇలాగే పాజిటివ్ ట్రెండ్ నమోదవుతుందనే అంచనాలు వ్యక్తమౌతోన్నాయి.
కొద్ది రోజులుగా స్వల్ప హెచ్చుతగ్గులతో సాగుతున్న పసిడి విలువ తిరిగి ఊపందుకోవడం ప్రారంభించింది. ఈ పెరుగుదల ధోరణి కొనుగోలుదారులను కొంత ఆందోళనకు గురి చేస్తోన్నప్పటికీ.. దీర్ఘకాలికంగా పసిడిపై పెట్టుబడులు పెట్టిన వారికి మాత్రం ప్రయోజనకరంగా మారింది. నిలకడ లేని అంతర్జాతీయ పరిస్థితుల మధ్య దేశీయంగా కిందటివారానికి కొనసాగింపుగా బంగారం రేట్లు స్థిరంగా పెరుగుతున్నాయి.

నేడు 24 క్యారెట్ల బంగారం ధర 10 గ్రాములకు 1,43,460 రూపాయల వద్ద కొనసాగుతోంది. 22 క్యారెట్ల బంగారం ధర రూ. 1,31,500 వద్ద స్థిరపడింది. 18 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధర రూ. 1,07,590 గా నమోదైంది. సాధారణంగా బులియన్ మార్కెట్‌లో ప్రకటించే ధరలకు, వినియోగదారులు నేరుగా షాపుల్లో కొనుగోలు చేసే తుది ధరలకు కొంత వ్యత్యాసం ఉంటుంది. ఈ ప్రాథమిక ధరల గుణకారంపై మూడు శాతం జీఎస్టీ అదనం.
హైదరాబాద్ లో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 1,43,460, 22 క్యారెట్లు రూ. 1,31,500, 18 క్యారెట్లు రూ. 1,07,590 రూపాయల వద్ద ట్రేడ్ అయింది. చెన్నైలో 24 క్యారెట్లు రూ. 1,43,460, 22 క్యారెట్లు రూ. 1,31,500, 18 క్యారెట్లు రూ. 1,09,650 వద్ద నిలిచింది. ముంబైలో 24 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధర రూ. 1,43,460, 22 క్యారెట్లు రూ. 1,31,500, 18 క్యారెట్లు రూ. 1,07,590 వద్ద స్థిరపడింది.
చెన్నై..
24 క్యారెట్లు- రూ. 14,346, 22 క్యారెట్లు - రూ. 13,150, 18 క్యారెట్లు - రూ. 10,965
ముంబై..
24 క్యారెట్లు - రూ. 14,346, 22 క్యారెట్లు- రూ. 13,150, 18 క్యారెట్లు - రూ. 10,759
బెంగళూరు..
24 క్యారెట్లు - రూ. 14,346, 22 క్యారెట్లు- రూ. 13,150, 18 క్యారెట్లు - రూ. 10,759
హైదరాబాద్..
24 క్యారెట్లు - రూ. 14,346, 22 క్యారెట్లు- రూ. 13,150, 18 క్యారెట్లు - రూ. 10,759
విజయవాడ..
24 క్యారెట్లు - రూ. 14,346, 22 క్యారెట్లు- రూ. 13,150, 18 క్యారెట్లు - రూ. 10,759
విశాఖపట్నం..
24 క్యారెట్లు - రూ. 14,346, 22 క్యారెట్లు- రూ. 13,150, 18 క్యారెట్లు - రూ. 10,759

Click it and Unblock the Notifications