సంధ్య థియేటర్ ఘటనతో పేరు మార్చుకుంటున్న అల్లు అర్జున్!
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ తన పేరు మార్చుకుంటున్నారు. దీనికి కారణం.. పుష్ప2 సినిమా విడుదల సమయంలో ఆర్టీసీ క్రాస్ రోడ్స్ లోని సంధ్య థియేటర్ దుర్ఘటన. ఎవరు ఔనన్నా.. ఎవరు కాదన్నా.. ప్రతి మనిషికి కచ్చితంగా కొన్ని సెంటిమెంట్స్ ఉంటారు. అందరూ వాటిని జీవితకాలం అనుసరిస్తుంటారు. కొంతమందికి మధ్యలో సెంటిమెంట్స్ వస్తాయి. ఏవైనా అనుకోని సంఘటనలు ఎదురైనప్పుడు, పండితుల సలహాలు, సూచనల మేరకు కొన్ని కొన్ని మార్పు చేర్పులు తమ జీవితంలో చేసుకుంటుంటారు. అలాగే అల్లు అర్జున్ కూడా చేసుకోబోతున్నారు. తాజాగా ఆయన తన పేరును మార్చుకోబోతున్నాడు.
గురూజీ సినిమా సమయంలో ప్రకటన
త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో త్వరలోనే అల్లు అర్జున్ ఓ సినిమా చేయబోతున్నారు. ఇది సోషియో, మైథలాజికల్, ఫాంటసీగా రాబోతోంది. త్రివిక్రమ్ కు, బన్నీకి కూడా ఈ తరహా సినిమా చేయడం ఇదే మొదటిసారి. భారీ బడ్జెట్ తో రూపొందబోతున్న ఈ సినిమాను సూర్యదేవర నాగవంశీ నిర్మించనున్నారు. త్వరలోనే దీనిపై అప్ డేట్ రానుంది. ముందుగా అట్లీ దర్శకత్వంలో చేస్తారా? లేదంటే త్రివిక్రమ్ దర్శకత్వంలో చేస్తారా? అనేది తేలలేదు. అయితే గురూజీ దర్శకత్వంలో చేయబోయే సినిమా సమయంలో తాను మార్చుకున్న పేరును, పేరులో మారిన అక్షరాలను బన్నీ పరిచయం చేయబోతున్నాడు.

అభిమానులకు పూర్తిగా దూరం కావొద్దు
సంధ్య థియేటర్ దుర్ఘటనలో రేవతి అనే 35 సంవత్సరాల మహిళ మృతి చెందగా, ఆమె తొమ్మిది సంవత్సరాల కుమారుడు శ్రీతేజ్ కిమ్స్ ఆసుపత్రిలో నాలుగు నెలల నుంచి చావుబతుకుల మధ్య కొట్టుమిట్టాడుతున్నాడు. ఆ బాబు పరిస్థితిని ఇంతవరకు స్పష్టంగా వైద్యులు చెప్పలేకపోతున్నారు. అవసరమైతే విదేశాలకు పంపించైనా వైద్యం అందిస్తామని ప్రభుత్వం చెబుతోంది.. అల్లు అర్జున్ టీం చెబుతోంది. కానీ ఇంతవరకు అడుగు మాత్రం ముందుకు పడలేదు. కొత్త సినిమా చేయడానికి సిద్ధమవుతున్న బన్నీ ఈలోగా ఆ బాబు సంగతి, వైద్యం సంగతి, పూర్తిగా కోలుకోవడానికి అవసరమైన సహాయ సహకారాలను అందిస్తే కొంతైనా మానవత్వం ఉందని నిరూపించుకున్నట్లవుతుంది. లేదంటే అభిమానులకు పూర్తిగా దూరం కావాల్సి ఉంటుంది.












Click it and Unblock the Notifications