బంగారం ధరల కొనుగోళ్లపై భారీ షాక్..: షార్ప్ రివర్స్ గేర్

దేశంలో బంగారం ప్రియులకు షాక్ తగిలింది. మొన్నటివరకు భారీగా క్షీణిస్తూ వచ్చిన పసిడి ధరలకు బ్రేక్ పడింది. వీటి రేట్లన్నీ కూడా షార్ప్ గా రివర్స్ గేర్ తీసుకున్నాయి. అమాంతం పెరిగాయి. నేడు 24 క్యారెట్ల స్వచ్ఛమైన బంగారం (99.9 శాతం ప్యూరిటీ) ధర గ్రాముకు 0.18 శాతం పెరిగి 14,324 రూపాయల వద్ద ట్రేడవుతోంది. అదేవిధంగా ఆభరణాల తయారీకి ఎక్కువగా ఉపయోగించే 22 క్యారెట్ల బంగారం (91.6 శాతం స్వచ్ఛత) ధర కూడా పుంజుకుని 13,130 రూపాయల వద్ద కొనసాగుతోంది.

మధ్యతరగతి కొనుగోలుదారులు ఎక్కువగా ఇష్టపడే 18 క్యారెట్ల బంగారం ధర కూడా స్వల్పంగా పెరిగింది. ప్రస్తుతం 18 క్యారెట్ల పసిడి రేటు అంతకుముందు ధరతో పోలిస్తే కొద్దిగా పెరిగింది. గ్రాముకు 10,743 రూపాయలుగా రికార్డైంది. ఇవి బేసిక్ రేట్లు మాత్రమే. వీటిపై జీఎస్టీ, మేకింగ్ ఛార్జీలు అదనంగా ఉంటాయి. దేశంలోని వివిధ ప్రధాన నగరాల్లో పన్ను నిబంధనలు, స్థానిక రవాణా ఖర్చులు, అసోసియేషన్ నిర్ణయాలను బట్టి పసిడి ధరల్లో తేడాలుంటాయి.

Gold Rate Edges High in India as Positive Global Sentiment Fuels Price Rise With US and Iran Raising

ముఖ్యంగా హైదరాబాద్‌తో పాటు విజయవాడ, వైజాగ్, బెంగళూరు, ముంబై నగరాల్లో బంగారం ధరలు ఒకే విధంగా ఉన్నాయి. చెన్నైలో మాత్రం దేశంలోని ఇతర మెట్రో నగరాల కంటే ధరలు కొద్దిగా ఎక్కువగా నమోదవుతుంటాయి. హైదరాబాద్ లో 24 క్యారెట్ల బంగారం ధర 10 గ్రాములకు రూ. 1,43,240, 22 క్యారెట్లు రూ. 1,31,300, రూ. 1,07,430 లుగా రికార్డయ్యాయి. చెన్నైలో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 1,44,220, 22 క్యారెట్లు రూ. 1,32,200, రూ. 1,10,400 రూపాయల వద్ద ట్రేడ్ అయింది.

ప్రధాన నగరాల్లో నేటి బంగారం ధరలు (గ్రాముకు)

చెన్నై..

24 క్యారెట్లు- రూ. 14,422, 22 క్యారెట్లు - రూ. 13,220, 18 క్యారెట్లు - రూ. 11,040

ముంబై..

24 క్యారెట్లు - రూ. 14,324, 22 క్యారెట్లు- రూ. 13,130, 18 క్యారెట్లు - రూ. 10,743

బెంగళూరు..

24 క్యారెట్లు - రూ. 14,324, 22 క్యారెట్లు- రూ. 13,130, 18 క్యారెట్లు - రూ. 10,743

హైదరాబాద్..

24 క్యారెట్లు - రూ. 14,324, 22 క్యారెట్లు- రూ. 13,130, 18 క్యారెట్లు - రూ. 10,743

విజయవాడ..

24 క్యారెట్లు - రూ. 14,324, 22 క్యారెట్లు- రూ. 13,130, 18 క్యారెట్లు - రూ. 10,743

విశాఖపట్నం..

24 క్యారెట్లు - రూ. 14,324, 22 క్యారెట్లు- రూ. 13,130, 18 క్యారెట్లు - రూ. 10,743

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+