యూఎస్ లో జాబ్స్ కోసం నరకం చూస్తున్న OPT, STEM OPT విద్యార్థులు!

అమెరికా లో ఉన్న భారతీయ విద్యార్థులకు గడ్డు కాలం. అమెరికాలో ఉన్న లక్షలాది మంది విద్యార్థులు ప్రస్తుతం తీవ్రమైన ఉద్యోగ సంక్షోభాన్ని ఎదుర్కొంటున్నారు. ట్రంప్ అధికారంలోకి వచ్చిన తర్వాత డాలర్ డ్రీమ్స్ తో యూఎస్ వెళ్ళిన విద్యార్థుల కలలు కల్లలుగా మారాయి. ఉద్యోగం కోసం విద్యార్థులు పడరాని పాట్లు పడుతున్నారు.

యూఎస్ లో తీవ్ర ఉద్యోగ సంక్షోభం ఎదుర్కొంటున్న భారతీయులు

హెచ్ 1బీ విషయంలో ట్రంప్ తీసుకున్న నిర్ణయాల ప్రభావం, యూఎస్ ఫస్ట్ అంటూ యూఎస్ సిటిజన్స్ కు ఉద్యోగాలలో ప్రాధాన్యత ఇవ్వాలని ట్రంప్ పిలుపునివ్వటంతో యూఎస్ లోని కంపెనీలు చదువులు కంప్లీట్ చేసిన విద్యార్థులకు ఉద్యోగాలు ఇవ్వాలంటే భయపడుతున్నాయి. దీంతో లక్షలాది మంది భారతీయ విద్యార్థులు తీవ్రమైన ఉద్యోగ సంక్షోభాన్ని ఎదుర్కొంటున్నారు.

US OPT students jobs indian students facing job rejections due to lack of visa sponsorship

OPT, STEM OPT వారికి అడుగడుగునా తిరస్కరణలు

ముఖ్యంగా OPT (Optional Practical Training) మరియు STEM OPT విద్యార్థుల పరిస్థితి మరీ చెప్పలేనంత దారుణంగా తయారైంది. ఎన్ని ఉద్యోగాలకు అప్లై చేసినా సరే ఉద్యోగాలు రాని స్థితి విద్యార్థులను కృంగదీస్తుంది. ఉద్యోగాలకు దరఖాస్తు చేసిన విద్యార్థులు అడుగడుగునా రిజెక్షన్ ఎదుర్కొంటున్నారు. "మేము వీసా స్పాన్సర్‌షిప్ ఇవ్వడం లేదు. OPT, STEM OPT ఉన్న అభ్యర్థులకు కూడా ప్రస్తుతం అవకాశం లేదు." అంటూ రిక్రూటర్స్ నుండి సందేశాలు చూస్తున్నారు.

టెక్ లే ఆఫ్ లు, ఆర్ధిక అనిశ్చితి కారణంగా కొత్త ఉద్యోగాలకు గండం

ఇది విద్యార్థుల మానసిక స్థితిని, వారి ఆత్మ విశ్వాసాన్ని బాగా కృంగదీస్తుంది. మరోవైపు ఉద్యోగ మార్కెట్ కూడా మందగమనంలో ఉండటం, ఆర్టిఫీషియల్ ఇంటిలిజెన్స్ వినియోగంతో చాలా కంపెనీలు ఉద్యోగులను తొలగించటం వంటి ఘటనలతో ఇబ్బందికర పరిస్థితి ఉంది. టెక్ లే ఆఫ్ లు, ఆర్ధిక అనిశ్చితి కారణంగా కొత్త ఉద్యోగాలు రాని పరిస్థితి ఉంది. ఫలితంగా ఎక్స్పీరియన్స్ లేని విదేశీ విద్యార్థులకు అవకాశాలు బాగా తగ్గిపోయాయి.

ఆర్ధికంగా, మానసికంగా తీవ్రమైన డిప్రెషన్ లో విద్యార్థులు

ఇక ఇదే సమయంలో గతంలో లేని విధంగా యూఎస్ సిటిజన్స్ అయిన విద్యార్థులకు, ఇతర దేశాల నుండి చదువు కోసం వచ్చిన విద్యార్థులకు మధ్య పోటీ పెరిగింది. OPT, STEM OPT విద్యార్థులకు ఉద్యోగాలు రాక ఆర్ధికంగా, మానసికంగా తీవ్రమైన డిప్రెషన్ కు లోనవుతున్నారు. ఈ పరిస్థితులు మారాలంటే, ఇలాంటి కష్టకాలంలో విద్యార్థులకు పేరెంట్స్ సపోర్ట్ చాలా అవసరం.

ఖేలో ఇండియాలో వెయ్యి కోట్ల నిధులు.. కేంద్రానికి ఏపీ మంత్రి వినతి!
ఖేలో ఇండియాలో వెయ్యి కోట్ల నిధులు.. కేంద్రానికి ఏపీ మంత్రి వినతి!

విద్యార్థులు ఇలా చేస్తే మంచిది

విద్యార్థులలో కూడా రిక్రూటర్స్ నాడి తెలుసుకుని తదనుగుణంగా రెజ్యూమ్ అమెరికన్ స్టైల్ లో చేసుకోవటం, రిక్రూటర్స్, అల్యుమ్ని లతో కనెక్ట్ అవ్వటం చెయ్యాలి. సర్టిఫికేషన్ లు, GitHub, ప్రాజెక్టులు బలపరుచుకోవాలి. నిరాశ చెందక జాబ్ కోసం ప్రయత్నం చెయ్యాలి. తప్పక విజయం వరిస్తుంది అంటున్నారు నిపుణులు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+