సౌత్ బెంగళూరులో రెండో ఇంటర్నేషనల్ ఎయిర్ పోర్ట్: సీఎం డీకే శివకుమార్ తుది నిర్ణయం

బెంగళూరులో రెండో అంతర్జాతీయ విమానాశ్రయం ఏర్పాటుకు సంబంధించిన కసరత్తు వేగవంతమైంది. కెంపెగౌడ అంతర్జాతీయ విమానాశ్రయంపై నిరంతరం పెరుగుతున్న రద్దీని తగ్గించేందుకు వీలుగా నగరానికి దక్షిణ భాగంలో ఈ నూతన ఎయిర్‌పోర్టును నిర్మించనున్నట్లు కర్ణాటక ముఖ్యమంత్రి డీకే శివకుమార్ వెల్లడించారు. దీనికి సంబంధించి పూర్తి డీపీఆర్ సిద్ధం చేయాలని అధికారులను ఆదేశించారు.

నూతన విమానాశ్రయం ఏర్పాటు కోసం భూముల ధరలు తక్కువగా ఉండే ప్రాంతాలను గుర్తించాలని అధికారులకు సూచించారు. ప్రాజెక్టు వ్యయం భారం ప్రభుత్వంపై పడకుండా ఉండేలా అనుకూల ప్రాంతాలను ఎంపిక చేయాలని స్పష్టం చేశారు. అన్నింటికంటే ముఖ్యంగా, ఈ ప్రాజెక్ట్ నిర్మాణం వల్ల స్థానికులు, రైతులు నిరాశ్రయులు కాకుండా చూడాలని, పర్యావరణానికి ముప్పు వాటిల్లని స్థలాలను మాత్రమే ఎంపిక చేయాలని ఆయన స్పష్టం చేశారు.

Bengaluru 2nd Airport in South Bengaluru DK Shivakumar Orders Proposal With Low-Cost abd Land

ప్రతిపాదిత విమానాశ్రయం ఏర్పాటుపై మౌలిక సదుపాయాల అభివృద్ధి శాఖ మంత్రి ఎంబీ పాటిల్, ఇతర ఉన్నతాధికారులతో కలిసి డీకే శివకుమార్ ప్రత్యేక సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. గతంలో జరిగిన ప్రాజెక్టు చర్చల వివరాలను నిశితంగా పరిశీలించారు. ఎక్కడైనా కొన్ని ఇళ్లు మాత్రమే ఉంటే వారికి ప్రత్యామ్నాయంగా మెరుగైన పరిహారం చెల్లించవచ్చని, దీనికోసం వేలాది మంది ఉన్న పల్లెలను తరలించొద్దని ఆదేశించారు.

ఈ నూతన విమానాశ్రయం కోసం ఇప్పటికే మూడు ప్రధాన ప్రాంతాలను ఏఏఐ ఉన్నతాధికారులు ప్రాథమికంగా సందర్శించి సర్వే నిర్వహించారు. దక్షిణ బెంగళూరు వైపే అధికారులు మొగ్గు చూపుతున్నారు. ప్రభుత్వ తుది పరిశీలనలో మూడు ప్రాంతాలు కూడా షార్ట్ లిస్ట్ అయ్యాయి. బెంగళూరు- కనకపుర మార్గంలోని హరోహళ్లి, బెంగళూరు- హసన్ రోడ్డులోని కుణిగల్ లేదా నెలమంగళ శివార్లల్లో ఈ ఎయిర్ పోర్ట్ కట్టాలనే ప్రతిపాదనలు ఉన్నాయి.

తాజా సమీక్ష అనంతరం హారోహళ్లిని ఖరారు చేశారు ముఖ్యమంత్రి డీకే శివకుమార్. ఆయన సొంత నియోజకవర్గం కనకపుర పరిధిలోకి వస్తుందీ గ్రామం. పర్యావరణానికి కష్టం కలగకుండా నూతన విమానాశ్రయం నిర్మించడంపై ప్రభుత్వం ప్రస్తుతం పూర్తి దృష్టి సారించింది. ఏఏఐ సాంకేతిక బృందం తన తుది నివేదికను సమర్పించిన తర్వాత అత్యంత ప్రాధాన్యత కలిగిన స్థలాన్ని ఎంపిక చేసి, కేంద్ర పౌర విమానయాన మంత్రిత్వ శాఖ ఆమోదం కోసం అధికారులు ప్రతిపాదనలు పంపనున్నారు.

దేశంలోనే అత్యధిక రద్దీ కలిగిన విమానాశ్రయాల్లో మూడో స్థానంలో ఉంటోంది బెంగళూరు కెంపెగౌడ ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్ట్. దీనిపై ప్రయాణికుల ఒత్తిడి ఊహించని రీతిలో పెరుగుతోంది. ఈ నేపథ్యంలోనే బెంగళూరుకు రెండో ఎయిర్‌పోర్ట్ అత్యంత అవసరమని గతంలో మాజీ ముఖ్యమంత్రి సిద్ధరామయ్య బడ్జెట్ ప్రసంగంలో స్పష్టం చేశారు. డీకే శివకుమార్ దీన్ని పరుగులు పెట్టిస్తోన్నారు. ఈ ఏడాదే పనులు మొదలయ్యే అవకాశాలు లేకపోలేదు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+