భారత్‌లో moto g77 power లాంచ్.. ఎంతంటే??

ఎప్పటికప్పుడు కొత్త కొత్త ఫీచర్లతో తక్కువ ధరలోనే ఫోన్లను అందించేందుకు కంపెనీలు సైతం పోటీ పడుతున్నాయి. ఇండియన్ మార్కెట్లో ప్రముఖ మొబైల్ ఫోన్ల తయారీ సంస్థ మోటారోలా మొబైల్స్ కి సపరేట్ ఫ్యాన్స్ ఉంటారు. ఇప్పటికే ఈ కంపెనీ నుంచి రిలీజ్ అయిన ఫోన్స్ టెక్ టెక్ ప్రియులను బాగా ఆకర్షించాయి. బడ్జెట్ రేంజ్ నుంచి ఫ్లాగ్ షిప్ రేంజ్ వరకు పలు ఫోన్‌లతో మంచిగా సక్సెస్ అయ్యింది. ఇప్పుడు లేటెస్ట్ గా మోటరోలా (motorola)భారత మార్కెట్లో తమ కొత్త moto g77 Power స్మార్ట్‌ఫోన్‌ను అధికారికంగా లాంచ్ చేసింది.

భారీ 7000mAh బ్యాటరీ, 120Hz రిఫ్రెష్ రేట్ డిస్‌ప్లే, MediaTek Dimensity 6400 5G ప్రాసెసర్, 50MP Sony LYTIA కెమెరా, Android 16 వంటి ఆధునిక ఫీచర్లతో ఈ ఫోన్ మిడ్-రేంజ్ విభాగంలో బలమైన పోటీ ఇవ్వనుంది. ముఖ్యంగా ఒకసారి ఛార్జ్ చేస్తే రెండు రోజుల వరకు బ్యాటరీ బ్యాకప్ కోరుకునే వారికి ఈ ఫోన్ ఆకర్షణీయమైన ఎంపికగా నిలవనుంది.

motorola-newly-launched-moto-g77-power-smart-phone-that-price-and-specifications-full-details

moto g77 Power ఫీచర్స్..

డిస్‌ప్లే..

Motorola moto g77 Powerలో 6.72 అంగుళాల Full HD+ LCD డిస్‌ప్లేను అందించారు. ఈ స్క్రీన్ 120Hz రిఫ్రెష్ రేట్తో స్క్రోలింగ్, గేమింగ్, వీడియో వీక్షణను మరింత స్మూత్‌గా మార్చుతుంది. గరిష్టంగా 1050 నిట్స్ బ్రైట్‌నెస్ ఉండటంతో ఎండలో కూడా స్క్రీన్ స్పష్టంగా కనిపిస్తుంది. అదనంగా Corning Gorilla Glass 7i రక్షణ ఉండటంతో స్క్రాచ్‌లు, చిన్నపాటి దెబ్బల నుంచి స్క్రీన్‌కు మెరుగైన భద్రత లభిస్తుంది.

ప్రాసెసర్..

పనితీరు కోసం ఈ ఫోన్‌లో 6nm టెక్నాలజీపై రూపొందించిన MediaTek Dimensity 6400 5G చిప్‌సెట్ను ఉపయోగించారు. రోజువారీ వినియోగంతో పాటు మల్టీటాస్కింగ్, సోషల్ మీడియా, వీడియో స్ట్రీమింగ్, గేమింగ్ వంటి పనులను సులభంగా నిర్వహించే సామర్థ్యం ఈ ప్రాసెసర్‌కు ఉంది.

స్టోరేజ్..

ఈ ఫోన్‌లో 8GB LPDDR4X RAM అందించగా, RAM Boost ఫీచర్ ద్వారా అదనంగా 16GB వరకు వర్చువల్ RAMను వినియోగించుకోవచ్చు. స్టోరేజ్ కోసం 128GB UFS 2.2 ఇంటర్నల్ మెమరీ ఉండగా, మైక్రో SD కార్డ్ ద్వారా 1TB వరకు విస్తరించుకునే అవకాశం ఉంది.

కెమెరా..

ఫోటోగ్రఫీ ప్రియులను దృష్టిలో ఉంచుకుని Motorola ఈ ఫోన్‌లో Sony LYTIA 600 సెన్సార్‌తో కూడిన 50MP ప్రైమరీ కెమెరాను అందించింది. ఇది తక్కువ వెలుతురులో కూడా మెరుగైన ఫోటోలు తీసేందుకు సహాయపడుతుంది. దీనికి తోడు 8MP అల్ట్రా వైడ్ కెమెరాను అందించారు. దీంతో ల్యాండ్‌స్కేప్‌లు, గ్రూప్ ఫొటోలు, వైడ్ యాంగిల్ షాట్లు సులభంగా క్యాప్చర్ చేయవచ్చు. సెల్ఫీలు, వీడియో కాల్స్ కోసం 32MP ఫ్రంట్ కెమెరాను ఏర్పాటు చేశారు. ముందు, వెనుక కెమెరాలు రెండూ 2K వీడియో రికార్డింగ్కు మద్దతు ఇస్తాయి. AI Portrait, Night Vision, HDR, Pro Mode, Panorama, Slow Motion వంటి కెమెరా ఫీచర్లు కూడా ఇందులో అందుబాటులో ఉన్నాయి.

సాఫ్ట్‌వేర్..

Motorola moto g77 Power Android 16 ఆపరేటింగ్ సిస్టమ్‌తో వస్తోంది. దాదాపు స్టాక్ ఆండ్రాయిడ్ అనుభవాన్ని అందించే ఈ ఫోన్‌లో అనవసరమైన బ్లోట్‌వేర్ చాలా తక్కువగా ఉంటుంది. కంపెనీ Android 17 వరకు ఒక ప్రధాన OS అప్‌డేట్తో పాటు మూడు సంవత్సరాల పాటు సెక్యూరిటీ అప్‌డేట్స్ అందిస్తామని హామీ ఇచ్చింది.

7000mAh బ్యాటరీ..

ఈ ఫోన్‌లో ప్రధాన ఆకర్షణ 7000mAh భారీ బ్యాటరీ. సాధారణ వినియోగంలో ఒకసారి పూర్తి ఛార్జ్ చేస్తే రెండు రోజుల వరకు బ్యాటరీ బ్యాకప్ అందించే సామర్థ్యం ఉందని కంపెనీ చెబుతోంది. దీనికి 30W TurboPower ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ ఉండగా, 6W వైర్డ్ రివర్స్ ఛార్జింగ్ ఫీచర్ కూడా ఉంది. దీంతో అవసరమైతే ఇతర స్మార్ట్‌ఫోన్లు లేదా యాక్సెసరీస్‌ను కూడా ఈ ఫోన్ ద్వారా ఛార్జ్ చేసుకోవచ్చు.

ప్రీమియం డిజైన్..

Motorola moto g77 Powerకు IP64 డస్ట్ & వాటర్ స్ప్లాష్ రెసిస్టెన్స్ రేటింగ్ లభించింది. అలాగే MIL-STD-810H మిలిటరీ గ్రేడ్ డ్యూరబిలిటీ సర్టిఫికేషన్ కూడా ఉండటంతో సాధారణ వినియోగంలో మరింత మన్నికను అందిస్తుంది. భద్రత కోసం సైడ్-మౌంటెడ్ ఫింగర్‌ప్రింట్ సెన్సార్, Face Unlock వంటి ఫీచర్లు ఉన్నాయి.

కనెక్టివిటీ & ఇతర ఫీచర్లు..

5G Dual SIM సపోర్ట్
Bluetooth 5.4
Wi-Fi 5
USB Type-C పోర్ట్
3.5mm హెడ్‌ఫోన్ జాక్
FM రేడియో
Stereo Speakers
Dolby Atmos ఆడియో
GPS, NFC (ఎంపిక చేసిన మార్కెట్లలో)
Google Assistant సపోర్ట్

ధర..

భారత్‌లో 8GB RAM + 128GB స్టోరేజ్ వేరియంట్ ధరను రూ.25,999గా నిర్ణయించారు.

కలర్స్..

Pantone Impenetrable
Pantone Nautical Blue
Pantone Fuchsia Red

ఆఫర్లు..

Motorola moto g77 Power కొనుగోలు చేసే వినియోగదారులకు పలు ప్రారంభ ఆఫర్లను కూడా ప్రకటించింది. Axis Bank, HDFC Bank క్రెడిట్ కార్డులపై రూ.2,000 వరకు ఇన్‌స్టంట్ డిస్కౌంట్
పాత ఫోన్ ఎక్స్చేంజ్‌పై రూ.2,000 వరకు అదనపు ఎక్స్చేంజ్ బోనస్ దక్కుతుంది. ఎంపిక చేసిన బ్యాంకుల ద్వారా నో-కాస్ట్ EMI సదుపాయం ఉండనుంది. Flipkart సైతం ప్రత్యేక లాంచ్ ఆఫర్లు ఇస్తుంది. Motorola moto g77 Power స్మార్ట్‌ఫోన్ Flipkart, Motorola అధికారిక వెబ్‌సైట్, అలాగే దేశవ్యాప్తంగా ఉన్న ఆఫ్‌లైన్ రిటైల్ స్టోర్లలో కొనుగోలుకు అందుబాటులో ఉంటుంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+