తాజా పరిణామాల వేళ పవన్ కీలక నిర్ణయాలు, ముఖ్య నేతలకు పిలుపు..!!

ఏపీ రాజకీయాలు ఆసక్తి కరంగా మారుతున్నాయి. కొత్త లెక్కలు తెర మీదకు వస్తున్నాయి. కొద్ది రోజులుగా చోటు చేసుకుంటున్న పరిణామాలతో రాజకీయం కీలక మలుపు తీసుకుంటోంది. ఈ పరిణామాల పైన డిప్యూటీ సీఎం పవన్ ఆగ్రహంగా ఉన్నారు. ఈ సమయంలోనే పార్టీ ముఖ్య నేతలతో కీలక భేటీకి నిర్ణయించారు. అనూహ్య నిర్ణయాలు.. దిశా నిర్దేశం దిశగా పవన్ ఈ భేటీలో ప్రకటనలు చేసే అవకాశం కనిపిస్తోంది.

ఏపీ రాజకీయాల్లో కీలక పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. డిప్యూటీ సీఎం లక్ష్యంగా సాగుతున్న విమర్శలు.. ప్రచారం పైన పవన్ ఆగ్రహంగా ఉన్నారు. రాజమండ్రిలో జరిగిన సమావేశంలోనూ పార్టీ నేతలు ఎప్పటికప్పుడు స్పందించాలని పవన్ నిర్దేశించారు. అప్పట్లో కొందరు మినహా మిగిలిన నేతలు పవన్ పైన వస్తున్న విమర్శలకు ధీటుగా స్పందించటం లేదు. అటు పార్టీ నిర్మాణం పైన పవన్ వేగంగా అడుగులు వేస్తున్నారు. సోషల్ మీడియా పోస్టింగ్స్ పైన ఫిర్యాదుల కోసం తన కార్యాలయంలోనే ప్రత్యేక విభాగం ఏర్పాటు చేయాలని పవన్ డిసైడ్ అయ్యారు. ఆధారాలతో సహా ఫిర్యాదు చేయాలని సూచించారు. ఆ తరువాత గవర్నర్ తో భేటీ వేళ కీలక అంశాలను చర్చించినట్లు తెలుస్తోంది. కాగా.. తాజా పరిణామాల వేళ పార్టీ ముఖ్య నేతలతో పవన్ సమావేశం ఆసక్తి కరంగా మారుతోంది.

 జమిలి, డీలిమిటేషన్ పై కేంద్రం బిగ్ ట్విస్ట్ - విపక్షాలు ఊహించని విధంగా..!!
జమిలి, డీలిమిటేషన్ పై కేంద్రం బిగ్ ట్విస్ట్ - విపక్షాలు ఊహించని విధంగా..!!
janasena-chief-pawan-kalyan-crucial-meeting-with-party-key-leaders-chances-for-big-announcements

తాజా పరిణామాల వేళ పవన్ కీలక సమావేశం

ఈ సమావేశంలో పార్టీ వ్యవహారాలతో పాటుగా తాజా పరిణామాల పైన పవన్ స్పందించే అవకాశం కనిపిస్తోంది. సోషల్ మీడియాలో పవన్ లక్ష్యంగా సాగుతున్న ప్రచారం పైనా పవన్ పార్టీ నేతలకు స్పష్టత ఇచ్చే ఛాన్స్ ఉందని సమాచారం. పార్టీ కమిటీల నియామకంతో.. పార్లమెంటరీ నియోజక వర్గాల వారీగా పనితీరును పవన్ సమీక్ష చేస్తున్నారు. ఇక.. పార్టీకి చెందిన ఎంపీ, ఎమ్మెల్సీ, ఎమ్మెల్యే లను ఈ సమావేశానికి రావాలని సమాచారం అందింది. ఇందులో పవన్ చేసే ప్రసంగం లో ఏ అంశాలు ప్రస్తావిస్తారు.. ఎలాంటి నిర్ణయాలను ప్రకటిస్తారనేది రాజకీయంగా ఆసక్తి నెలకొని ఉంది. రాజకీయంగా అమలు చేయాల్సిన కార్యాచరణ ఖరారు చేసే అవకాశం ఉంది. దీంతో, ఈ రోజు సమావేశంలో పవన్ నిర్ణయాల పైన రాజకీయంగా ఉత్కంఠ నెలకొంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+