పవన్‌కల్యాణ్‌ను రిక్వెస్ట్ చేసిన అల్లు అర్జున్

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ కథానాయకుడిగా నటించిన భారీ బడ్జెట్ చిత్రం పుష్ప2. ఈ చిత్రంపై దేశవ్యాప్తంగా భారీ అంచనాలున్నాయి. డిసెంబరు ఐదోతేదీన ప్రపంచవ్యాప్తంగా 11,500 స్క్రీన్లలో విడుదల చేయబోతున్నారు. మనదేశంలో తెలుగుతోపాటు తమిళం, కన్నడం, మళయాళం, హిందీ, బెంగాలీ భాషల్లో విడుదలవుతోంది. మైత్రీ మూవీస్ నిర్మించిన ఈ చిత్రానికి దర్శకుడు సుకుమార్. దేవిశ్రీప్రసాద్ స్వరాలందించారు. రష్మిక మందన్నా, ఫహాద్ ఫాజిల్, సునీల్, అనసూయ తదితరులు నటించారు. ఈ సినిమా ప్రీరిలీజ్ ఈవెంట్ ను హైదరాబాద్ లో ఘనంగా నిర్వహించాలని నిర్మాతలు భావించారు.

ముఖ్యఅతిథిగా రావాలని కోరనున్న బన్నీ
అయితే నవంబరు 28వ తేదీ వరకు హైదరాబాద్ నగరంలో ప్రభుత్వం 144 సెక్షన్ విధించింది. అప్పటివరకు ర్యాలీలు నిర్వహించడం, గుంపులు గుంపులుగా చేరడం, సభలు నిర్వహించడం నిషేధం. ఇంటిలిజెన్స్ నుంచి వచ్చిన సమాచారం మేరకు కమిషన్ సీవీ ఆనంద్ ఈ నిర్ణయం తీసుకున్నారు. దీంతో పుష్ప2 వేడుక కూడా రద్దయింది. దీంతో నిర్మాతలు అమరావతిలో ఘనంగా నిర్వహించాలని భావిస్తున్నారు. దీనిపై ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ ను కలిసి అనుమతి కోరగా ఆయన మంజూరు చేశారు. త్వరలోనే తేదీని ప్రకటించబోతున్నారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా రావాలని అల్లు అర్జున్ స్వయంగా పవన్ కల్యాణ్ ను కలిసి రిక్వెస్ట్ చేయబోతున్నారు.

Allu Arjun requested Pawan Kalyan to hold a pushpa2 pre-release event in Amaravati

రాజీకి వద్దామని..
ఏపీ అసెంబ్లీ ఎన్నికల సమయంలో జరిగిన పరిణామాల నేపథ్యంలో అప్పటివరకు మెగా కుటుంబానికి, అల్లు అర్జున్ కు ఉన్న విభేదాలు తారాస్థాయికి చేరుకున్నాయి. రోజురోజుకు అవి పెరుగుతున్నాయేకానీ తగ్గడంలేదు. సినిమా విడుదల నేపథ్యంలో టికెట్ ధరలు పెంచుకునేందుకు ప్రభుత్వం అనుమతివ్వాల్సి ఉంది. ఈ విషయాన్ని కూడా దృష్టిలో ఉంచుకున్న అల్లు అర్జున్ రాజీకి రాక తప్పలేదు. ఇప్పటివరకు జరిగిన గొడవలన్నింటినీ మనసులో పెట్టుకోకుండా కలిసిమెలిసి పనిచేసుకుందామనే ప్రతిపాదనతో బన్నీ పవన్ ను కలవబోతున్నారు. దీంతో బన్నీ అభిమానులు, పవన్ అభిమానులు, మెగా అభిమానులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. కలిసి ఉంటే కలదు సుఖం అనే వాక్యాన్ని సామాజిక మాధ్యమాల్లో వైరల్ చేస్తున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+