అట్టర్ ఫ్లాపైనా 175 రోజులు ఆడిన అల్లు అర్జున్ సినిమా!
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ప్రస్తుతం మంచి జోరుమీద ఉన్నారు. పుష్ప మొదటి భాగం సాధించిన విజయంతో ఉన్న ఉత్సాహంతో పుష్ప2 చేస్తున్నారు. డిసెంబరు రెండోతేదీన విడుదల కాబోతోంది. అల్లు అర్జున్ కు తెలుగు తర్వాత మళయాళంలో మంచి మార్కెట్ ఉందన్న సంగతి తెలిసిందే. మాలీవుడ్ లో స్టార్ హీరోగా చెలామణి అవుతున్నాడు. అక్కడి ప్రేక్షకులకు బన్నీ హావభావాలు, స్టైల్ పిచ్చిపిచ్చిగా నచ్చేశాయని చెప్పొచ్చు. అందుకే తెలుగులో విడుదలయ్యే ప్రతి అల్లు అర్జున్ సినిమా కచ్చితంగా మళయాళంలో కూడా విడుదలవుతుంది. అక్కడ బన్నీని మల్లు అని పిలుస్తారు.
ఏకంగా సిల్వర్ జూబ్లీ జరుపుకుంది
కెరీర్ ప్రారంభంలో గంగోత్రి, ఆర్య, బన్నీ చేశారు. నాలుగో సినిమాగా సొంత బ్యానర్ లో జెనీలియా కథానాయికగా కరుణాకర్ దర్శకత్వంలో హ్యాపీ సినిమా చేశారు. ఈ సినిమా తెలుగులో ఫ్లాపైంది. డబ్బులు కూడా రికవరీ కాలేదు. ఆ సినిమాలో ప్రీ క్లైమాక్స్, క్లైమాక్స్ లో వచ్చే భావోద్వేగాలను తెలుగు ప్రేక్షకులు అంగీకరించలేకపోయారు. లాభాలు కూడా రాని ఈ సినిమాను మళయాళంలో డబ్ చేసి విడుదల చేయగా అక్కడ బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచింది. ఏకంగా 175 రోజులు ప్రదర్శితమైంది. ఈ సినిమా నుంచే మళయాళంలో బన్నీ ట్రెండ్ ప్రారంభమైంది.

వరుడు సినిమా 100 రోజులు ఆడింది
హ్యాపీ సినిమా చేసిన తర్వాత పూరీ జగన్నాథ్ దర్శకత్వంలో దేశముదురు, తర్వాత పరుగు, ఆ తర్వాత ఆర్య2 చేశారు. గుణశేఖర్ దర్శకత్వంలో చేసిన వరుడు దారుణమైన డిజాస్టర్ గా నిలిచింది. ఈ సినిమాను మళయాళంలోకి డబ్ చేసి విడుదల చేయగా 100 రోజులు ఆడి ఆశ్చర్యపరిచింది. అల్లు అర్జున్ నటించిన ప్రతి సినిమా కచ్చితంగా మళయాళంలో డబ్ అవడమే కాకుండా ఘనవిజయం కూడా సాధిస్తోంది. ఇటీవలే వయనాడ్ లో ప్రకృతి విలయతాండవం చేయడంతో నష్టపోయిన బాధితులను ఆదుకునేందుకు ముఖ్యమంత్రి సహాయనిధికి రూ.25 లక్షల విరాళం కూడా ప్రకటించాడు.












Click it and Unblock the Notifications