కుర్ర హీరోలు వద్దు.. ముసలి హీరోలే ముద్దు: పవన్ కల్యాణ్ హీరోయిన్ సంచలనం
బద్రి, నాని, నరసింహుడు, పరమవీరచక్ర వంటి చిత్రాలతో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది స్టార్ హీరోయిన్ అమీషా పటేల్. ఆ తర్వాత సినిమాలకు దూరంగా ఉంది. తాజాగా ఆమె గదర్ 2 తో రీఎంట్రీ ఇచ్చింది. గతేడాది తాబ తెర జల్వ సినిమాలో మెప్పించింది.
అయితే తాజాగా ఆమె సంచలన వ్యాఖ్యలు చేసింది. సికిందర్ సినిమా నేపథ్యంలో రష్మిక మందాన్న, సల్మాన్ ఏజ్ గ్యాప్ గురించి చర్చలు జరుగుతున్నాయి.
'రష్మిక, సల్మాన్ ఏజ్ గ్యాప్ గురించి చర్చలు జరుగుతున్నాయి. నేను కూడా నాకంటే వయసులో చాలా పెద్ద హీరోలతో నటించాను.'గదర్-2'లో సన్నీ డియోల్ నాకంటే 20 ఏళ్లు పెద్దవారు. కానీ మా ఇద్దరి మధ్య కెమిస్ట్రీ ప్రేక్షకులను నచ్చింది. ఆ సినిమా బ్లాక్ బస్టర్‌గా నిలిచింది. అలాగే సల్మాన్, రష్మిక జోడిని కూడా ఆడియన్స్ ఆదరిస్తున్నారు.

నాకు 'సికందర్' సినిమా నచ్చింది. మంచి విజయం సాధిస్తుంది'అని చెప్పుకొచ్చింది. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.












Click it and Unblock the Notifications