2025లో అత్యంత చెత్త సినిమాగా తిరుగులేని రికార్డ్

సాధారణంగా సినిమాలు విడుదలైనప్పుడు ప్రేక్షకులకు నచ్చకపోతే తిరస్కరిస్తారు. ఎక్కువమంది థియేటర్లకు వెళ్లడం మానేస్తారు. దీనివల్ల సినిమా ఫ్లాప్ అనే ముద్ర పడుతుంది. సినిమా ఫ్లాప్ అయినప్పటికీ కనీస మాత్రం కలెక్షన్లైనా వస్తాయి. వాటితో థియేటర్ అద్దెతోపాటు కరెంటు బిల్లు, ఇతర ఖర్చులకు ఇబ్బంది లేకుండా ఉంటుంది. అలా కాకుండా కనీసం కరెంటు బిల్లులకు కూడా డబ్బులు రాకపోతే ఆ సినిమాను ఏమనాలి? కనీసం పదిమంది కూడా థియేటర్ కు రాకపోతే ఆ సినిమా తీసిన దర్శకుడిని, పెట్టుబడి పెట్టిన నిర్మాతలను, అందులో నటించిన హీరోను విమర్శించాలి. దీనివల్ల భవిష్యత్తులో మళ్లీ ఇలాంటి సినిమా రాకుండా వారికి ప్రేక్షకులే బుద్దిచెప్పినట్లవుతుంది.

మైత్రీకి భారీ దెబ్బ
ఇలాంటి సినిమాలు తెలుగులో లెక్కలేనన్ని వస్తున్నాయి. తాజాగా ఈ ఏడాది ప్రేక్షకుల ముందుకు వచ్చిన సినిమాల్లో నితిన్ హీరోగా నటించిన రాబిన్ హుడ్. వెంకీ కుడుముల దర్శకత్వంలో మైత్రీ మూవీస్ ఈ సినిమాను నిర్మించింది. శ్రీలీల, రాజేంద్రప్రసాద్, వెన్నెల కిషోర్, డేవిడ్ వార్నర్ తదితరులు నటించారు. మైత్రీ మూవీస్ కు మంచి ట్రాక్ రికార్డు ఉంది. దీంతోపాటు వెంకీ కుడుముల మంచి డైరెక్టర్. టీజర్ కూడా ఆకట్టుకుంది. ఇన్నిరకాల అంశాలుండటంతో సినిమా హిట్ అవుతుందని అందరూ భావించారు. అట్టర్ ఫ్లాప్ అయింది. నితిన్ కు మరోసారి నిరాశ తప్పలేదు. మైత్రీ మూవీస్ కు తొలిసారి భారీ దెబ్బ పడింది. ఇప్పటికే రూ.30 కోట్లకు పైగా నష్టాలు వాటిల్లాయి. భవిష్యత్తులో ఈ సంఖ్య పెరగనుందేకానీ తగ్గదు.

An unbreakable record as the worst telugu movie of 2025

భీష్మకు మొదటిరోజే రూ.5 కోట్లు
ఈ సినిమా ఇప్పటివరకు ప్రపంచవ్యాప్తంగా రూ.6.43 కోట్లు మాత్రమే రాబట్టగలిగింది. గతంలో నితిన్, రష్మిక నటించిన భీష్మ చిత్రానికి మొదటిరోజే రూ.5 కోట్ల వసూల్లు వచ్చాయి. కానీ రాబిన్ హుడ్ ఇప్పటివరకు రూ.6 కోట్లు మాత్రమే వసూలు చేయగలిగిందంటే నితిన్ మార్కెట్ పడిపోతోందని అర్థమవుతోంది. తర్వాత తమ్ముడు సినిమా విడుదల కానుంది. దానికి బిజినెస్ జరుగుతుందా? లేదా? అనేది చూడాలి. ఏ సినిమా చేసినా పరాజయం పాలవుతోంది. వరుసగా ఫ్లాప్స్ లో ఉన్న నితిన్ ను ఏ దర్శకుడు రక్షిస్తారో చూడాలి.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+