హీరోయిన్లను ధనుష్ ఎంత టార్చర్ పెడతాడంటే..?
సూపర్ స్టార్ రజనీకాంత్ కు మాజీ అల్లుడు, దర్శకుడు సెల్వ రాఘవన్ కు సోదరుడైన ధనుష్ హీరోగా, నిర్మాతగా బిజీగా ఉన్నారు. ఒకవైపు నటనతోపాటు సినిమాలు నిర్మిస్తూ కొత్తవారిని ప్రోత్సహిస్తున్నాడు. హీరోయిన్ నయనతారతో ధనుష్ కు ప్రస్తుతం వివాదం నడుస్తున్న సంగతి తెలిసిందే. నయనతారపై నెట్ ఫ్లిక్స్ రూపొందించిన డాక్యుమెంటరీలో ఉపయోగించుకోవడానికి ధనుష్ నిర్మాతగా ఉన్న సినిమాలోని కొన్ని సన్నివేశాలు కావాలని అడిగారు. ఇవ్వకపోవడంతో నయనతార-విఘ్నేష్ శివన్ వాటిని వాడుకోవడంతో రూ.10 కోట్లు చెల్లించాలంటూ కోర్టు నోటీసు పంపించాడు.
మండిపడ్డ నయనతార
దీనిపై నయనతార తీవ్రస్థాయిలో ధనుష్ పై మండిపడింది. బహిరంగంగా లేఖ రాసి తీవ్ర ఆరోపణలు చేసింది. అయితే దీనిపై ఇంతవరకు ధనుష్ మౌనంగానే ఉన్నాడు. ఈ తరుణంలో పరిశ్రమలో హీరోయిన్లను అతను టార్చర్ చేస్తాడనే వార్త సామాజిక మాధ్యమాల్లో వైరలవుతోంది. గతంలో కూడా కొందరు హీరోయిన్లను ధనుష్ ఇలాగే టార్చర్ చేసేవాడంటూ కొన్ని విషయాలు బయటకు వస్తున్నాయి. వెబ్ చాట్ ఛానెల్ కు చెందిన అనంతన్ గతంలో ధనుష్ వివాదాస్పద వైఖరిని బయటపెట్టారు. కీర్తిసురేష్ తో కలిసి అతను రైలు సినిమా చేశాడు. ఈ సినిమా షూటింగ్ లో 90 శాతం రైలులోనే జరిగింది.

తీవ్ర ఒత్తిడికి గురైన కీర్తిసురేష్
ప్రభు సాల్మన్ దర్శకత్వంలో ఈ చిత్రం తెరకెక్కింది. సినిమా ప్రారంభమయ్యే సమయంలో ధనుష్ కీర్తి సురేష్ ను ఏదో విషయమై అడగ్గా కీర్తి అందుకు నిరాకరించింది. దీంతో మూడురోజులపాటు ఆమెను తీవ్ర చిత్రహింసలు పెట్టాడని అనంతన్ చెప్పాడు. పని పరంగా తీవ్ర ఒత్తిడి చేస్తుండటంతో మూడురోజులపాటు కీర్తి సురేష్ సినిమాలో నటించడం మానుకుంది. ఒక షాట్ తీయడానికే మూడురోజుల సమయం పట్టిందంట. ధనుష్ పెట్టిన టార్చర్ కు కీర్తి సురేష్ ఒత్తిడికి గురికావడంతో ఈ సినిమా షూటింగ్ ఎక్కువ రోజులు చేశారు. దీన్ని భరించలేక కీర్తి తన తండ్రికి ఫోన్ చేసి ఏడ్చింది. వెంటనే కీర్తి సురేష్ తండ్రి వెంటనే రజనీకాంత్ కు ఫోన్ చేసి విషయం చెప్పారు. వెంటనే రజనీకాంత్ కూడా ధనుష్ కు ఫోన్ చేస్తే రజనీ మాటను కూడా లెక్కచేయలేదు. అనంతన్ ఈ విషయాలన్నింటినీ ఓ ఇంటర్వ్యూలో వెల్లడించారు. తాజాగా ఈ విషయం బయటపడటంతో నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు. ధనుష్ నిజ స్వరూపం ఇప్పుడు బయటపడిందని, ఇలాంటివి ఎన్ని ఉన్నాయో అంటూ వ్యాఖ్యానిస్తున్నారు.












Click it and Unblock the Notifications