మేకప్ లేకపోతే ఈ హీరోయిన్‌ను గుర్తుపట్టడం కాస్తా కష్టమే..!

మేకప్ అంటే ముఖం మీద అందంగా తీర్చిదిద్దుకోవడానికి ఉపయోగించే వివిధ రకాల ఉత్పత్తుల సముదాయం. ఇది ప్రతి ఒక్కరి అభిరుచి మరియు అవసరాలను బట్టి మారుతూ ఉంటుంది. కొంతమందికి లైట్ మేకప్ నచ్చగా, మరికొందరికి హెవీ మేకప్ నచ్చుతుంది.హీరోయిన్ల మేకప్ గురించి కొత్తగా చెప్పాల్సిన పనిలేదు. మేకప్ లేకుండా హీరోయిన్లు బయటకు రారు. కొంతమంది హీరోయిన్లు మేకప్ లేకుండా బయటకు వస్తే గుర్తించడం కాస్తా కష్టమే.

సరిగ్గా ఇప్పుడు ఇలాంటి ఘటనే ఒకటి వెలుగులోకి వచ్చింది. తాజాగా ఓ హీరోయిన్ మేకప్ లేకుండా బయటకు రావడంతో అభిమానులు ఆమెను గుర్తించడం కాస్తా కష్టతరం అయింది. ఆ హీరోయిర్ మరెవరో కాదు..అనన్య పాండే. బాలీవుడ్ యంగ్ హీరోయిన్స్ లిస్ట్‌లో అనన్య పాండే కూడా ఒకరు. బాలీవుడ్ నటుడు చుంకీ పాండే కూతురుగా ఎంట్రీ ఇచ్చిన అనన్య పాండే , అనతి కాలంలోనే స్టార్ హీరోయిన్‌గా గుర్తింపు తెచ్చుకుంది. జీరో సైజ్ బ్యూటీ పేరుతో అనన్య పాండే ఫుల్ పాపులారిటీ సంపాదించుకుంది.

ananya pandey without makeup photos goes viral

తాజాగా ఈ బ్యూటీ మేకప్ లేని ఫొటోలు కొన్ని వైరల్ అవుతున్నాయి. అనన్య పాండే జిమ్ క్యాజువల్ దుస్తుల్లో, మేకప్ లేకుండా కనిపించి అభిమానులకు షాకిచ్చింది. అనన్య పాండే మేకప్ లేని లుక్ చూసి చాలామంది ట్రోల్ చేస్తున్నారు. అసలు గుర్తుపట్టలేకపోతున్నామంటూ నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు.అనన్య పాండే డార్క్ సర్కిల్స్ చూసి చాలామంది నెటిజన్లు ఆశ్చర్యపోయారు. మేకప్ లేకపోతే ఈ గుర్తుపట్టడం కాస్తా కష్టమే అంటూ కొందరు కామెంట్ చేస్తుండగా, మేకప్ లేకపోతే ఈ హీరోయిన్ ఏంటీ ఇలా ఉందంటూ మరికొందరు రియాక్ట్ అవుతున్నారు.

ఇక అనన్య పాండే కెరీర్ విషయానికి వస్తే.. ''స్టూడెంట్ ఆఫ్ ది ఇయర్ 2'' సినిమా అనన్య పాండే కెరీర్‌ను పూర్తిగా మార్చేసింది. ఈ సినిమా తర్వాత వరుస సినిమాలు చేస్తూ ఫుల్ బిజీగా మారింది అమ్మడు. తెలుగులో పూరి జగన్నాథ్ దర్శకత్వంలో వచ్చిన ''లైగర్'' సినిమాలో హీరోయిన్‌గా నటించింది.

ఈ సినిమాలో హీరోగా విజయ్ దేవరకొండ నటించారు. భారీ అంచనాల మధ్య విడుదలైన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద ఫ్లాప్‌గా నిలిచింది. ఇక సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉండే అనన్య పాండే తన వ్యక్తిగత విశేషాలతో పాటు, సినిమా విషయాలను కూడా వెల్లడిస్తుంటుంది. ఇక అమ్మడుకు లవ్ స్టోరీల కూడా ఎక్కువగానే ఉన్నాయి. అనన్య పాండే గతంలో ఇషాన్ ఖత్తర్, కార్తిక్ ఆర్యన్ వంటి హీరోలతో డేటింగ్ చేసింది. ఆశికీ 2 హీరో ఆదిత్యరాయ్ కపూర్‌తో కూడా అనన్య పాండే రిలేషన్‌లో ఉందనే వార్తలొచ్చాయి. దీనికి తగ్గట్టుగానే వీరిద్దరు కలిసున్న ఫొటోలు సోషల్ మీడియాలో దర్శనం ఇచ్చాయి. అయితే ఏం జరిగిందో తెలియదు కానీ ఆదిత్యరాయ్ కపూర్‌‌కు బ్రేకప్ చెప్పింది ఈ బ్యూటీ.

కొద్ది నెలల నుంచి వీరిద్దరు కలిసున్న ఫొటో ఒక్కటి కూడా బయటకు రాలేదు. దీంతో వీరిద్దరు వీడిపోయారనే అంతా భావిస్తున్నారు. తాజాగా తన బ్రేకప్‌పై ఓపెన్ కామెంట్స్ చేసింది. బ్రేకప్ తర్వాత తన ఎక్స్-బాయ్ ఫ్రెండ్ ఫొటోల్ని తగలబెట్టానని, ఫొటోలు అలా కాలుస్తూ ఉంటే చాలా బాధ తగ్గిందని వెల్లడించింది. రిలేషన్ షిప్‌లో తను చాలా కాంప్రమైజ్ అయ్యానని, కానీ చెడ్డ వ్యక్తుల పట్ల మరీ అంత మంచిగా ఉండాల్సిన అవసరం లేదని చెప్పుకొచ్చింది.

తను రిలేషన్ షిప్ లో ఉన్నప్పుడు భాగస్వామిలో కేవలం మంచిని మాత్రమే చూశానని, అతడి కోసం ఎన్నో విషయాల్లో కాంప్రమైజ్ అయ్యానని, తననుతాను మార్చుకున్నానని తెలిపింది. మనల్ని మనం పూర్తిగా అర్పించుకున్నప్పుడే ప్రేమకు అర్థం ఉంటుందని, ఇదే సమయంలో ఎదుటి వ్యక్తి నుంచి అది ఆశించడంలో తప్పులేదని అంటోంది.అలా తను భాగస్వామి నుంచి ఆశించినప్పుడు ఎదురుదెబ్బ తగిలిందని చెప్పుకొచ్చింది.ఆదిత్యరాయ్ కపూర్‌ బ్రేకప్‌ తర్వాత మరొకరితో రిలేషన్‌ మెయిన్‌టైన్ చేస్తోంది. వాకర్ బ్లాంకో అనే వ్యక్తితో ఆమె డేటింగ్ చేస్తోంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+