సీఎం జగన్‌పై రాళ్లదాడి గురించి హేళనగా మాట్లాడిన యాంకర్ మంజూష
సీఎం జగన్ రాళ్లదాడి ఏపీ రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్‌గా మారింది. ఈ నెల 13న సీఎం జగన్ చేపట్టిన 'మేమంతా సిద్ధం'యాత్రలో భాగంగా విజయవాడలో ప్రవేశించిన రోజే ఆయనపై రాయితో దాడి చేశారు.బస్సుపై నుంచి సీఎం జగన్ ప్రజలకు అభివాదం చేస్తున్న సమయంలో రాయితో దాడి చేశారు. రాయి తగలడంతో సీఎం జగన్ ఎడమ కనుబొమ్మపై గాయమైంది.దీనిపై అధికార ,ప్రతిపక్ష పార్టీల మధ్య మాటల యుద్ధం చోటు చేసుకుంటోంది.
ఉమ్మడి కృష్ణాజిల్లాలో అడుగుపెట్టిన తొలిరోజే ఈ ఘటన చోటు చేసుకుంది. జగన్‌కు వస్తోన్న ఆదరణ తట్టుకోలేక కడుపు మంటతోనే ఈ దాడి చేశారని వైసీపీ శ్రేణులు ఆరోపిస్తున్నాయి. ఎన్నికల సమయంలో వైసీపీ వారే ఇలా దాడులు చేయించుకుని సింపతి క్రియేట్ చేసుకుంటున్నారని ప్రతిపక్ష నేతలు పెదవి విరుస్తున్నారు. ఇదిలా ఉంటే సీఎం జగన్ పై రాయి వేసిన నిందితుడు సతీష్‌ని పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ కేసులో అతడే ప్రథమ ముద్దాయిగా పోలీసులు నిర్ధారించారు.

రాయి వేసింది సతీష్ అని నిర్థారించి అతడిని ప్రస్తుతం అరెస్ట్ చేసి విజయవాడ కోర్టులో ప్రవేశ పెట్టారు పోలీసులు. ఈ కేసులో మరికొందరిని అరెస్ట్ చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. సీఎం జగన్ రాళ్లదాడిపై యాంకర్ మంజూష చేసిన కామెంట్స్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. యాంకర్ మంజూష తాజాగా 'ప్రతినిధి 2' సినిమా యూనిట్‌తో ఇంటర్య్వూ చేశారు. నారా రోహిత్ హీరోగా నటించిన ఈ సినిమాకు ప్రముఖ జర్నలిస్ట్ మూర్తి దర్శకత్వం వహించారు. జర్నలిస్ట్ మూర్తి మొదటి నుంచి కూడా టీడీపీ సానుభూతిపరుడుగా ముద్ర వేసుకున్నారు.
యాంకర్ మంజూష జర్నలిస్ట్ మూర్తిని ఇంటర్య్వూ చేశారు. సినిమా పోస్టర్‌లో హీరో కంటికి గాయమైంది... ఇటీవలే సీఎం జగన్ కంటికి కూడా గాయమైంది..ఈ రెండింటికి ఏమైన సంబంధం ఉందా అని మంజూష దర్శకుడును ప్రశ్నించింది. మూర్తి దీనికి సమాధానం ఇస్తూ.. రెండింటికీ పెద్ద తేడా ఏం లేదండీ.. ఇక్కడ హీరో కుడి కన్ను దగ్గర గాయం ఉంటుంది.. అక్కడ సీఎం గారికి ఎడమ కంటి దగ్గర తగిలింది. ఇద్దరిదీ ఒకే కన్ను కాదు. టీజర్‌లో కూడా హీరో గారి కంటికి దెబ్బ ఉంటుంది. ఈ సీన్ ఇప్పుడు కావాలని తీసింది కాదు.

సీఎం గారిపై ఎటాక్ చేయడానికి ముందే తీశాం. అంటూ సమాధానం ఇచ్చారు. దీనిపై మంజూష రియాక్షన్ ఇస్తూ హో.. డైరెక్ట్‌గా గులకరాయి అయితే కాదు కదా అంటూ కామెంట్ చేసింది. యాంకర్ మంజూష చేసిన ఈ కామెంట్లపై వైసీపీ శ్రేణులు మండిపడుతున్నారు. కొట్టినోడు దొరికాడు.. కొట్టించినోడు బయటకు వస్తాడు. ఎవరిది డ్రామానో త్వరలోనే తేలుతుంది. అప్పటి వరకు మీ డ్రామాలు ఆపకపోతే...అవే రాళ్లు మీ మీద పడతాయని యాంకర్ మంజూషకు వార్నింగ్ ఇస్తున్నారు.
-
ఇక పెట్రోల్ బంకుల్లోనూ మద్యం.. కొత్త ఎక్సైజ్ పాలసీకి ఆమోదం! -
'ఆ ఒక్క కండీషన్ తో స్టార్ హీరోతో నిజంగానే శోభనం'.. హీరోయిన్ సంచలనం..!! -
అల్లు అర్జున్ "పుష్ప - 3"లో స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లీ భార్య.. -
హిట్ కొట్టాడురా సామీ!.. మిస్టరీ థ్రిల్లర్ అదిరిపోయింది..! -
ఓటీటీలోకి పవన్ కల్యాణ్ 'ఉస్తాద్ భగత్ సింగ్'.. ఆ రోజు నుంచే స్ట్రీమింగ్..? -
ఈ సినిమా చూస్తే ఈఎంఐల జోలికే పోరు సామి! -
వంట గ్యాస్ బుక్ చేసినా రావటం లేదా, ఇలా చేయండి.. వెంటనే..!! -
తిరుమలకు వెళ్లేవారికి గుడ్ న్యూస్, ఇక నేరుగా...సులభంగా..!! -
ప్రభాస్ ఫాలో అవుతున్న ఏకైక తెలుగు హీరో ఎవరో తెలుసా..? -
ఆసియాలోనే అతిపెద్ద, ప్రపంచంలో నాలుగో అతిపెద్ద విమానాశ్రయాన్ని ప్రారంభించనున్న ప్రధాని మోదీ -
ఏపీలో పెరగనున్న అసెంబ్లీ సీట్లు, జిల్లాల వారీ జాబితా - కలిసొచ్చేదెవరికి..!! -
కోర్టు బ్యూటీ శ్రీదేవీ "బ్యాండ్ మేళం" తో మళ్లీ హిట్ కొట్టేసిందయ్యో !!!












Click it and Unblock the Notifications