అనసూయపై రష్మీ షాకింగ్ కామెంట్స్
జబర్దస్త్ అనగానే అందరికీ ముందుగా గుర్తుకు వచ్చేది ఇద్దరే. వారెవరో కాదు.. యాంకర్లు అనసూయ, రష్మీ. అనసూయ జబర్దస్త్ మానేసి సినిమాల్లో బిజీ అయిపోయింది. రష్మీ ఎక్స్ ట్రా జబర్దస్త్ కు యాంకరింగ్ చేస్తోంది. వీరిద్దరికీ ఉన్న క్రేజ్ మరెవరికీ రాలేదని చెప్పొచ్చు. అందరికంటే ముందుగా జబర్దస్త్ లో అనసూయ కనిపించింది. తర్వాత ఆమె కాస్తంత విరామం తీసుకుంది. లేదంటే నిర్వాహకులేమైనా గ్యాప్ ఇచ్చారో తెలియదు. ఆ సమయంలో రష్మీ ప్రవేశించింది. అనసూయను తప్పించి రష్మీని పెట్టారంటూ సోషల్ మీడియాలో వార్తలు చక్కర్లు కొట్టాయి.
దీనిపై రష్మీ స్పందించింది. తనకు సంబంధం లేని విషయంమీద ట్రోల్ చేశారని, ఏం జరుగుతుందో కూడా అర్థంకాక సైలెంట్ గా ఉండిపోయానన్నారు. దారుణంగా తిట్టారని చెప్పింది. అనసూయ స్థానాన్ని నువ్వు ఎందుకు ఆక్రమించావు రష్మీ అని అడిగితే నేను ఆక్రమించుకోవడం ఏమిటి.. లాగేసుకున్నానంటూ సమాధానం ఇచ్చింది. మరోసారి అనసూయను పక్కకు పంపి నువ్వు ఎందుకు వచ్చావు అని అడిగితే అనసూయ చిన్నపిల్లా ఏమిటి.. పక్కకు పంపించడానికి అంటూ రష్మీ సమాధానం ఇచ్చింది.

మల్లెమాల సంస్థ నిర్వహిస్తున్న పలు కార్యక్రమాలకు, షోలకు రష్మీ యాంకరింగ్ చేస్తోంది. అప్పుడప్పుడు సినిమాల్లో కూడా నటిస్తోంది. గుంటూరు టాకీస్ సినిమాలో హాట్ పాత్ర పోషించింది. తర్వాత అటువంటి పాత్రలకు దూరంగా ఉంటూ వచ్చింది. తాజాగా అనసూయ గురించి చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరలవుతున్నాయి. అనసూయ పుష్ప2 సినిమాతో బిజీగా ఉంది. దీనిపై అంచనాలు భారీగా ఉన్నాయి. ఈ ఏడాది ఆగస్టు 15వ తేదీన విడుదల చేయబోతున్నారు. సుకుమార్ దర్శకత్వంలో మైత్రీ మూవీస్ నిర్మిస్తోంది. ఇది కాకుండా మరికొన్ని సినిమాల్లో కూడా అనసూయ నటిస్తోంది.












Click it and Unblock the Notifications