పిఠాపురంలో పవన్ కల్యాణ్ ఓటమి ఖాయం..నటి షాకింగ్ కామెంట్స్
ఏపీలో ఎన్నికలు రసవత్తరంగా మారాయి. పోలింగ్‌కు కేవలం 9 రోజులు మాత్రమే సమయం ఉండటంతో రాజకీయ పార్టీలన్నీ కూడా విసృతంగా ప్రచారం నిర్వహిస్తున్నాయి. అభ్యర్థుల తరుఫున అన్ని పార్టీల అధినేతలు జోరుగా ప్రచారం నిర్వహిస్తున్నారు. ఇక గత ఎన్నికల్లో పోటీ చేసిన రెండు చోట్ల ఓడిపోయిన జనసేన అధినేత పవన్ కల్యాణ్..ఈసారి పిఠాపురం నుంచి బరిలో దిగుతున్నారు.
ఈసారి ఎలాగైనా గెలిచి చట్ట సభల్లో అడుగుపెట్టాలని పవన్ కల్యాణ్ విశ్వప్రయత్నాలు చేస్తున్నారు. పిఠాపురంలో టీడీపీ నేతలతో కలిసి పవన్ కల్యాణ్ విసృతంగా ప్రచారం నిర్వహించారు. పవన్ కల్యాణ్ గెలుపు కోసం జబర్థస్త్ నటులు సైతం రంగంలోకి దిగారు. మెగా హీరో వరుణ్ తేజ్, వైష్ణవ్ తేజ్ ,నాగబాబు ,ఆయన భార్య ప్రచారం నిర్వహిస్తున్నారు.పిఠాపురంలో టీడీపీ నేతలతో కలిసి పవన్ కల్యాణ్ విసృతంగా ప్రచారం నిర్వహించారు. పవన్ కల్యాణ్ గెలుపు కోసం జబర్థస్త్ నటులు సైతం రంగంలోకి దిగారు. మెగా హీరో వరుణ్ తేజ్, నాగబాబు ఆయన భార్య ప్రచారం నిర్వహిస్తున్నారు.

వైసీపీ తరుఫున మాత్రం అభ్యర్థి వంగా గీత ఒక్కరే ప్రచారం నిర్వహిస్తున్నారు. ఆమెకు మద్దతుగా నటి, ప్రముఖ యాంకర్ శ్యామల ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు.ఈ క్రమంలో శ్యామల మాట్లాడుతూ ..పిఠాపురంలో వంగ గీతాగారి గెలుపు ఖాయమైందని ఆమె తెలిపారు. పిఠాపురంలో వంగా గీత గెలుపు ఆపటం ఎవరి తరం కాదంటూ ఆమె సంచలన కామెంట్స్ చేశారు. నియోజకవర్గంలో ఆమె చేసిన అభివృద్ధి పనులే ఆమెను గెలిపిస్తాయని యాంకర్ శ్యామల ధీమా వ్యక్తం చేశారు.
పిఠాపురం ప్రజలు అభివృద్ధి చేసే వారికి ఓటు వేయాలంటూ ఆమె పిలుపునిచ్చారు.ఆ అభివృద్ధి సీఎం జగన్ వల్లే సాధ్యమవుతుందని తెలిపారు.ఇక ఇదే సమయంలో జనసేన అధినేత పవన్ కల్యాణ్‌పై కూడా విమర్శలు చేశారు.పవన్ కళ్యాణ్ ఒక పెద్ద స్టార్ హీరో ఆయన గెలుపు ఖాయమైనప్పుడు జబర్థస్త్ ఆర్టిస్టులు, సినిమా హీరోలు ఎందుకని వారిని శ్యామల ఎద్దెవా చేశారు. పిఠాపురంలో పవన్ ఓటమి..వంగా గీత గెలుపు ఖాయమైందంటూ శ్యామల చేసిన కామెంట్స్ ఇప్పుడు వైరల్‌గా మారాయి.












Click it and Unblock the Notifications