జూనియర్ ఎన్టీఆర్‌కు గుడ్‌న్యూస్ చెప్పిన చంద్రబాబు
యంగ్ టైగర్ ఎన్టీఆర్ కథానాయకుడిగా ద్విపాత్రాభినయం పోషిస్తున్న చిత్రం దేవర. కొరటాల శివ దర్శకత్వంలో పాన్ ఇండియా సినిమాగా రూపుదిద్దుకొని ఈ నెల 27వ తేదీన విడుదల కాబోతోంది. సినిమాకు సంబంధించిన ప్రమోషన్లు ముమ్మరంగా సాగుతున్నాయి. హీరో, దర్శకుడు, హీరోయిన్ తోపాటు ఇతర నటులు వివిధ భాషల్లో జరుగుతున్న ప్రచార కార్యక్రమాల్లో పాల్గొంటున్నారు. ఆరు సంవత్సరాల తర్వాత ఎన్టీఆర్ సోలో హీరోగా వస్తున్న చిత్రం కావడంతో అంచనాలు కూడా భారీగా ఉన్నాయి. సినిమా విడుదల సమయం దగ్గరయ్యేకొద్దీ అంచనాలు తారాస్థాయికి చేరుకుంటున్నాయి.
అర్థరాత్రి షోలకు అనుమతి
దాదాపు రూ.300 కోట్ల బడ్జెట్ తో రూపొందించిన ఈ సినిమాకు టికెట్ ధరలు పెంచుకోవడానికి, విడుదల రోజున ఆరు షోలు ప్రదర్శించుకోవడానికి అనుమతి మంజూరు చేసింది. థియేటర్లలో బాల్కనీ ధర రూ.110, కుర్చీపై రూ.60 పెంచుకోవడానికి అనుమతిచ్చారు. మల్టీప్లెక్స్ లో టికెట్ పై రూ.135వరకు పెంచుకోవడానికి అనుమతి మంజూరైంది. 26వ తేదీ అర్థరాత్రి 12.00 గంటల నుంచి ఆరు షోలకు, 28వ తేదీ నుంచి రోజుకు 5 షోలు వేసుకోవడానికి 9 రోజులపాటు అనుమతిచ్చారు. ఒకరకంగా ఇది జూనియర్ ఎన్టీఆర్ అభిమానులకు శుభవార్తే అని చెప్పాలి.

కొరటాల శివకు అత్యంత ప్రతిష్టాత్మకం
అనిరుధ్ రవిచందర్ అందించిన బాణీలకు ఇప్పటికే మంచి స్పందన లభించింది. జాన్వీకపూర్ ఈ సినిమాతో తొలిసారిగా తెలుగు పరిశ్రమలోకి ప్రవేశిస్తోంది. సైఫ్ అలీఖాన్ ప్రతినాయకుడి పాత్ర పోషించాడు. సినిమా బాగుంది అనే టాక్ కొంచెం వచ్చినా చాలని సినిమా దూసుకుపోవడానికి, అదిరిపోయే రికార్డులను సృష్టిస్తామని ఎన్టీఆర్ అభిమానులు చెబుతున్నారు. దర్శకుడు కొరటాల శివ ఆచార్య సినిమా ఫ్లాప్ కావడంతో అత్యంత ప్రతిష్టాత్మకంగా దీన్ని నిర్మించారు. యువసుధ ఆర్ట్స్ పతాకంపై మిక్కిలినేని సుధాకర్, ఎన్టీఆర్ ఆర్ట్స్ పతాకంపై నందమూరి కల్యాణ్ రామ్ సంయుక్తంగా ఈ సినిమాను నిర్మించారు.












Click it and Unblock the Notifications