సంక్రాంతి విన్నర్ అనిల్ సుంకర సాహసం.. టాలెంట్ ఉన్నవారికి 'గోల్డెన్ ఛాన్స్'

తెలుగు సినీ పరిశ్రమలో కంటెంట్‌కు పట్టం కట్టే నిర్మాతగా, భారీ బడ్జెట్ చిత్రాలనే కాకుండా వినూత్న ఆలోచనలను వెండితెరపై ఆవిష్కరించే అభిరుచి గల వ్యక్తిగా అనిల్ సుంకరకు ప్రత్యేక గుర్తింపు ఉంది. ఇటీవల ఆయన ప్రకటించిన 'షో టైమ్-సినిమా తీద్దాం రండి' అనే మేకింగ్ రియాలిటీ షో ఇప్పటికే ఇండస్ట్రీలో సెన్సేషన్ సృష్టించగా, తాజాగా మరో అడుగు ముందుకు వేశారు. భారీ అంచనాలున్న పెద్ద హీరోలతో సినిమాలు తీసి ఫ్లాప్ నిర్మాతగా పేరు తెచ్చుకునేకంటే దగ్గుబాటి రామానాయుడు తరహాలో, దాసరి నారాయణరావు స్ఫూర్తితో చిన్న చిన్న నటీనటులు, అద్భుతమైన కథలతో సినిమాలు తీయాలని నిర్ణయించుకొని 'నారీ నారీ నడుమ మురారి'తో సంక్రాంతికి భారీ హిట్ కొట్టారు. శర్వానంద్ ను ఇండస్ట్రీలో స్థిరపరిచారు.

ప్రతిభను వెలికి తీయడంలో ముందంజ

సినీ గ్లామర్ వెనుక ఉన్న అసలైన ప్రతిభను వెలికితీయడంలో అనిల్ సుంకర ఎప్పుడూ ముందుంటారు. తాజాగా ఆయన ఏటీవీ ఒరిజినల్స్‌ బ్యానర్‌పై పూర్తిగా కొత్త నటీనటులతో ఒక ఫీచర్ ఫిల్మ్‌ను ప్రకటించారు. అదే 'ఎయిర్‌ఫోర్స్‌-బెజవాడ బ్యాచ్' . టాలెంట్ ఉండి అవకాశం కోసం ఎదురుచూస్తున్న కొత్త రక్తాన్ని వెండితెరకు పరిచయం చేస్తూ, ఆయన యువతకు ఒక అద్భుతమైన వేదికను కల్పించారు. ఏరికోరి ఏరుకున్న కొత్త నటీనటులతో అనిల్ సుంకర చేస్తున్న ఈ ప్రయత్నం ఇప్పుడు టాలీవుడ్‌లో హాట్ టాపిక్ గా మారింది.

Anil Sunkara Gives Golden Opportunity for New Actors AIRFORCE Bezawada Batch Announced

విజయవాడ నేపథ్యంలో కథ

విజయవాడ నేపథ్యంలో సాగే ఈ చిత్రం కేవలం నలుగురు నిరుద్యోగ యువకుల కథ మాత్రమే కాదు, ప్రతికూల పరిస్థితులను ఎదిరించి లక్ష్యాన్ని ముద్దాడే ఒక స్ఫూర్తిదాయక ప్రయాణం. ఈ సినిమా ప్రమోషన్స్ ప్రారంభించిన తీరు కూడా అనిల్ సుంకర అభిరుచికి అద్దం పడుతోంది. బెజవాడలోని ఒక ప్రముఖ జంక్షన్‌లో ఏర్పాటు చేసిన వినూత్నమైన బ్యానర్ ఇప్పుడు సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతోంది. అమెరికాకి వెళ్లి మా బెజవాడ బ్యాచ్‌ని ఖాళీగా తిరక్కండిరా, ఏదో ఒక పని చేసుకోమని సలహాలు ఇచ్చేంత స్థాయికి ఎదిగిన మా అర్జున్‌కు స్వదేశాగమన శుభాకాంక్షలు అంటూ స్వచ్ఛమైన మట్టి వాసనతో కూడిన సందేశం అందరినీ ఆకట్టుకుంటోంది. ఈ ఒక్క వాక్యంతోనే సినిమాలో స్నేహం ఎంత గాఢంగా ఉండబోతుందో, బెజవాడ మార్క్ వెటకారం ఏ స్థాయిలో ఉండబోతుందో హింట్ ఇచ్చేశారు.

ప్రతిభ ఉన్నవారికి ప్రోత్సాహం

ప్రతిభ ఉన్న ప్రతి ఒక్కరికీ అనిల్ సుంకర ఒక ఆశాదీపంలా కనిపిస్తున్నారు. ఈ చిత్రంలోని ప్రధాన పాత్రలైన ఆ నలుగురు యువకులు అనుకోని పరిస్థితులను అధిగమించి, తమ లక్ష్యాన్ని ఎలా చేరుకున్నారనేది ఈ కథాంశం.సామాన్య యువకుల జీవితాల్లో ఎదురయ్యే ఆర్థిక, సామాజిక ఇబ్బందులు. ప్రతికూలతలను అనుకూలతగా మార్చుకునే దృఢ సంకల్పం. అంతిమంగా వారు సాధించిన విజయం వెనుక ఉన్న శ్రమ. ఈ ముక్కోణపు కథనాన్ని అనిల్ సుంకర కొత్త నటీనటులతో నడిపించడం అనేది నిజంగా ఒక సాహసోపేతమైన మరియు ప్రశంసనీయమైన నిర్ణయం. ఎయిర్‌ఫోర్స్‌-బెజవాడ బ్యాచ్ వందలాది మంది కొత్త కళాకారుల కలల ప్రతిరూపం. వినూత్నమైన కాస్టింగ్ ఆన్‌బోర్డింగ్‌తో అంచనాలు పెంచేసిన మేకర్స్, త్వరలోనే మిగతా నటీనటులు, సాంకేతిక నిపుణుల వివరాలను వెల్లడించనున్నారు. కొత్త కథలను, కొత్త టాలెంట్‌ను ఆదరించే ప్రేక్షకులకు ఈ సినిమా ఒక పక్కా లోకల్ విందును అందించబోతుందనడంలో సందేహం లేదు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+