రూ.5.5 లక్షలు తీసుకొని మోసం చేసిన తృప్తి దిమ్రి

ఎన్ని సినిమాల్లో నటించినా రాని గుర్తింపు రాత్రికి రాత్రే వచ్చేసింది. అదీ ఒకే ఒక్క సినిమాతో. ఆ సినిమా పేరు యానిమల్. ఆ సినిమాలో చేసిన బోల్డ్ పాత్రతో కుర్రాళ్ల గుండెల్లో రైళ్లు పరిగెత్తించింది. అంతే అప్పటి నుంచి నేషనల్ క్రష్ గా మారిపోయింది. కొత్తగా నటిస్తున్న సినిమాలో మేరే మెహబూబ్ సాంగ్ కోసం వేసిన డ్యాన్స్ పై సామాజిక మాధ్యమాల్లో విపరీతమైన ట్రోలింగ్ జరుగుతోంది. ఇలాంటివేవీ ఆమె పట్టించుకోదు. యానిమల్ సినిమాలో నటించిన సమయంలోనే కుటుంబ సభ్యులు, బంధువులు... ఎన్నిరకాలుగా మాట్లాడినా పట్టించుకోని ఈ భామ సోషల్ మీడియా కామెంట్స్ ను పట్టించుకుంటుందనుకోవడం భ్రమే.

వివాదంలో చిక్కుకున్న తృప్తి
తాజాగా ఈ బ్యూటీ ఓ వివాదంలో చిక్కుకుంది. జైపూర్ లో మహిళా వ్యాపారవేత్తలు ఓ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. దీనికి ముఖ్యఅతిథిగా రావాలని తృప్తిని కోరగా అందుకు ఆమె అంగీకరించారు. ఈ కార్యక్రమానికి వచ్చేందుకు రూ.5.5 లక్షలు తీసుకుంది. వీరు నిర్వహించే వేడుక పేరు FICCI FLO. అయితే చివరి నిముషంలో వేడుకకు హాజరుకాలేదు. దీనిపై జైపూర్ కు చెందిన ఓ మహిళా వ్యాపారవేత్త మీడియాతో మాట్లాడారు. ఈవెంట్ కు వచ్చేందుకు రూ.ఐదున్నర లక్షలు తీసుకుందని, కార్యక్రమం మొదలయ్యే ఐదు నిముషాల ముందు కూడా ఫోన్ చేసి వస్తున్నానని చెప్పిందని, తీరా కార్యక్రమానికి హాజరుకాలేదని ఆమె ఆరోపించారు.

animal movie beauty Trupti Dimri who cheated by taking Rs 5 lakhs

న్యాయపరమైన చర్యలు తీసుకుంటాం
ఈ విషయంలో తృప్తి దిమ్రిపై న్యాయపరమైన చర్యలు తీసుకుంటామని, బాధ్యతారాహిత్యంగా వ్యవహరించిందని, కార్యక్రమానికి రాను అని ఎటువంటి సమాచారం ఇవ్వలేదన్నారు. జైపూర్ లో తృప్తి నటించే సినిమాలను బ్యాన్ చేస్తామని, తామందరినీ మోసం చేసిందంటూ ఆ వ్యాపారవేత్త మండిపడ్డారు. ప్రస్తుతం ఆమె చెప్పిన విషయాలు సామాజిక మాధ్యమాల్లో వైరల్ గా మారాయి. దీనిపై తృప్తి దిమ్రి ఎలా స్పందిస్తుందో చూడాలి. యానిమల్ సినిమాతో విపరీతమైన గుర్తింపు రావడంతో ఆమె ఇష్టం వచ్చిన రీతిలో ప్రవర్తిస్తోందని, సినీ పరిశ్రమలోని పెద్దలను కూడా లెక్కచేయడంలేదని, రెమ్యునరేషన్ ను భారీగా అడుగుతోందని, ఇలా అయితే కష్టమని, భవిష్యత్తులో పరిశ్రమలో నిలదొక్కుకోవడం కూడా కష్టమని సినీ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+