'యానిమల్' మూవీ సంచలన రికార్డ్
రణ్ బీర్ కపూర్, రష్మిక హీరో హీరోయిన్లుగా సందీప్ రెడ్డి వంగా డైరెక్షన్ లో వచ్చిన యానిమల్ మూవీ బాక్సాఫీస్ వద్ద బ్లాక్ బస్టర్ గా నిలిచిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం రూ.850 నుంచి రూ.900 కోట్ల మధ్యలో ఫుల్ కలెక్షన్స్ వచ్చాయి. బాలీవుడ్ పరిశ్రమలోనే కాకుండా రణబీర్ కెరీర్ లో కూడా బిగ్గెస్ట్ హిట్ గా ఈ చిత్రం నిలిచింది. అయితే ఈ సినిమా ఎవరికీ సాధ్యంకాని రీతిలో మరో అరుదైన రికార్డును నెలకొల్పింది.
ఒక థియేటర్ లో ఏకంగా 3 కోట్ల రూపాయల కలెక్షన్లను సాధించింది. కెనడాలోని సిల్వర్ సిటీ థియేటర్ లో యానిమల్ సినిమా ఈ అరుదైన రికార్డ్ ను సొంతం చేసుకుంది. త్వరలోనే ఈ సినిమా ఓటీటీ వెర్షన్ విడుదల కాబోతోంది. ఓటీటీ వెర్షన్ కు అదనంగా 20 నిముషాలు జోడిస్తున్నారు. ఇక్కడ కూడా రికార్డులు సృష్టించడం ఖాయమంటున్నారు.

యానిమల్ సినిమా తెలుగు వెర్షన్ కు కూడా మంచిపేరు వచ్చింది. దీనికి సీక్వెల్ తెరకెక్కనుండగా దాన్ని భారీ లెవెల్ లో ప్లాన్ చేస్తున్నారు. థియేటర్లలో ఈ సినిమాను చూసినవారు సైతం ఓటీటీలో చూడటానికి ఆసక్తి చూపిస్తున్నారు. ఈ సినిమా విజయం తర్వాత రణబీర్ కపూర్ బాధ్యత మరింతగా పెరిగింది. భవిష్యత్తులో చేయబోయే చిత్రాల విషయంలో ఎన్నో జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంది.
తనకు ఫ్యాన్ బేస్ రోజురోజుకు పెరుగుతోంది. యానిమల్ నిర్మాతకు కళ్లు చెదిరే స్థాయిలో లాభాలను అందించింది. టీ సిరీస్ తో కలిసి ఈ సినిమాను సందీప్ రెడ్డి వంగా తమ్ముడు ప్రణయ్ రెడ్డి నిర్మించారు. భవిష్యత్తులో తాను తీయబోయే చిత్రాలకు సైతం తాను నిర్మాతగా వ్యవహరించనున్నట్లు సందీప్ రెడ్డి ప్రకటించారు.












Click it and Unblock the Notifications