అన్నా లెజినోవా ఆస్తులు తెలిస్తే.. మైండ్ బ్లోయింగ్
అన్నా లెజినోవా.. ఒకవైపు రష్యా సాంస్కృతిక నేపథ్యం, మరోవైపు కోట్లాది రూపాయల సామ్రాజ్యం ఉన్న వ్యాపారవేత్త కుమార్తె. అంతర్జాతీయ స్థాయిలో బిజినెస్ నెట్‌వర్క్, సొంత గుర్తింపు ఉన్న ఆమె, తెలుగు చిత్రసీమలోని పవన్ కళ్యాణ్‌ను వివాహం చేసుకున్న నాటి నుంచి ఎప్పుడూ వార్తల్లో నిలుస్తూనే ఉన్నారు. ఇటీవల వీరిద్దరి బంధం గురించి వస్తున్న ప్రచారాలు, ఆమె వ్యక్తిగత నేపథ్యం, ఆస్తుల వివరాలు మళ్లీ రెండు తెలుగు రాష్ట్రాల్లో తీవ్ర చర్చనీయాంశంగా మారాయి.
రూ. 1800 కోట్లకు యువరాణి
సాధారణంగా ప్రముఖుల ఆస్తుల గురించి చర్చ వచ్చినప్పుడు వారి సినీ లేదా రాజకీయ సంపాదన చూస్తుంటాం. కానీ అన్నా లెజినోవా విషయంలో కథ పూర్తిగా వేరు. ఆమె పుట్టుకతోనే భారీ సంపన్న కుటుంబానికి చెందిన వ్యక్తి. రష్యాతో పాటు సింగపూర్‌లో ఆమెకు భారీగా ఆస్తులు ఉన్నట్లు తెలుస్తోంది. ముఖ్యంగా సింగపూర్‌లో ప్రముఖ హోటల్ చైన్స్, వ్యాపార భాగస్వామ్యాలు ఉన్నట్లు సమాచారం. మీడియా వర్గాల అంచనా ప్రకారం ఆమె ఆస్తుల విలువ సుమారు రూ.1,800 కోట్ల పైమాటే. పవన్ కళ్యాణ్ ఆస్తుల అంచనా సుమారు రూ.164 కోట్ల కంటే ఇది చాలా రెట్లు ఎక్కువ కావడం విశేషం.

ప్రేమ.. పెళ్లి.. ఆత్మీయ బంధం
2011లో వచ్చిన 'తీన్‌మార్' సినిమా చిత్రీకరణ సమయంలో పవన్ కళ్యాణ్, అన్నా లెజినోవాల మధ్య తొలి పరిచయం ఏర్పడింది. ఆ పరిచయం కొద్ది రోజుల్లోనే గాఢమైన ప్రేమగా మారింది. 2013 సెప్టెంబర్ 30న వీరిద్దరూ వివాహ బంధంతో ఒకటయ్యారు. 2017లో ఈ దంపతులకు 'మార్క్ శంకర్ పవనోవిచ్' జన్మించాడు. అంతేకాకుండా, అన్నాకు తొలి వివాహం ద్వారా ఉన్న కుమార్తె 'పోలెనా అంజనా పవనోవా'ను కూడా పవన్ కళ్యాణ్ తన స్వంత సంతానంగా దత్తత తీసుకుని ఆదరించారు.
ఉన్నత విద్య, సంప్రదాయాలపై గౌరవం
ఒకవైపు కుటుంబాన్ని చూసుకుంటూనే, మరోవైపు తన చదువును కొనసాగించారు అన్నా. 2024 జులైలో నేషనల్ యూనివర్సిటీ ఆఫ్ సింగపూర్ (NUS) నుంచి 'మాస్టర్ ఆఫ్ ఆర్ట్స్' పట్టా అందుకున్నారు. విదేశీయురాలైనప్పటికీ భారతీయ, ముఖ్యంగా హిందూ సంప్రదాయాలను ఆమె ఎంతో గౌరవిస్తారు. తిరుమల శ్రీవారిని దర్శించుకుని తలనీలాలు సమర్పించుకోవడం, కుటుంబ శుభకార్యాల్లో పద్ధతిగా చీరకట్టులో పాల్గొనడం చూసి తెలుగు ప్రజలు ఆమెను ఎంతో అభిమానించారు. పవన్ కళ్యాణ్ సినీ, రాజకీయ ప్రయాణంలో ఎదురైన ఒడిదొడుకుల్లో ఆమె ఎప్పుడూ అండగా నిలిచారు. విదేశాల్లో వేల కోట్ల సామ్రాజ్యం ఉన్నప్పటికీ, అత్యంత నిరాడంబరంగా కనిపిస్తూ తన వ్యక్తిగత జీవితాన్ని ప్రైవేట్‌గా ఉంచుకోవడానికే అన్నా లెజినోవా ఎప్పుడూ ప్రాధాన్యత ఇస్తుంటారు.














Click it and Unblock the Notifications
