షాకింగ్ వీడియో: రైలు ప్రమాదానికి ముందు బ్రేక్ వేయలేక లోకో పైలట్ గజగజ..!

అస్సోంలోని గౌహతి సమీపంలో ఉన్న డిగారు రైల్వే స్టేషన్ వద్ద ఇవాళ ఉదయం జరిగిన కోల్ కతా-సైరాంగ్ ఎక్స్ ప్రెస్ (Sairang Express) రైలు ప్రమాదం వెనుక కారణం బయటపడింది. ఉదయం 6.54 నిమిషాలకు జరిగిన ఈ ప్రమాదానికి రైలు ఎమర్జెన్సీ బ్రేక్ పనిచేయకపోవడమే కారణమని తెలుస్తోంది. ఈ ప్రమాదంలో రైలు ఇంజన్ తో పాటు ఐదు బోగీలు పట్టాలు తప్పాయి. డిగారు స్టేషన్ కు రైలు చేరుకున్న తర్వాత మరో రైలుకు దారి ఇచ్చేందుకు వీలుగా ఈ రైలును మరో లైన్ లోకి పంపుతున్న సమయంలో లోకో పైలట్ అనూహ్యంగా ట్రైన్ వేగాన్ని నియంత్రించలేకపోయారు. దీంతో రైలు పట్టాలు తప్పింది.

అయితే సైరాంగ్ ఎక్స్ ప్రెస్ లోకో పైలట్ చివరి నిమిషంలో రైలు వేగాన్ని నియంత్రించేందుకు క్యాబిన్ లో ఎమర్జెన్సీ బ్రేక్ వాడేందుకు చేస్తున్న ప్రయత్నాలు విఫలమయ్యాయి. దీంతో రైల్లో ఉన్న మిగిలిన స్విచ్ లను నొక్కుతూ టెన్షన్ పడుతున్న దృశ్యాలకు సంబంధించిన వీడియో ఒకటి వైరల్ అవుతోంది. ఇందులో రెడ్ సిగ్నల్ పడిందని, ఎమర్జెన్సీ బ్రేక్ పనిచేయడం లేదని ఆయన ఆందోళన వ్యక్తం చేస్తున్నట్లుగా ఉంది. అన్ని ప్రయత్నాలు చేసి లోకో పైలట్ విఫలమైన తర్వాత రైలు ముందున్న ఏదో ఒక బలమైన అడ్డంకిని ఢీకొట్టి పట్టాలు తప్పినట్లుగా ఇందులో ఉంది.

Sairang Express Accident Loco Pilot Reports Brake Failure Moments Before Train Derails Video Emerges

దీన్ని బట్టి చూస్తే రైలు ప్రమాదం వెనుక ఎమర్జెన్సీ బ్రేక్ వైఫల్యమే కారణంగా తెలుస్తోంది. ఈ ప్రమాదంలో పలువురు ప్రయాణికులకు గాయాలయ్యాయి. వారికి ప్రాథమిక చికిత్స అందించిన అనంతరం ప్రత్యామ్నాయ రైళ్లలో వారి గమ్య స్ధానాలకు పంపినట్లు తెలుస్తోంది. ఈ ఘటనపై ఇప్పటికే ఉత్తర సరిహద్దు రైల్వే విచారణ ప్రారంభించింది. లోకో పైలట్ ఇచ్చిన సమాచారం, ఆధారాలతో ప్రస్తుతం విచారణ చేపట్టారు. ఇతర ఆధారాలు సేకరించేందుకు రైల్వే బృందాలు విచారణ జరుపుతున్నాయి.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+